27.05.2021 గురువారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
హిందీ
మూలమ్ – సంధ్యా చౌదరి
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు,
నిజాంపేట,
హైదరాబాద్
శ్రీ
సాయి లీల ద్వైమాస పత్రిక సెప్టెంబర్ – అక్టోబర్, 2014 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన మరొక
అధ్భుతమయిన లీలను ఈ రోజు మీకందిస్తున్నాను.
బాబా లీలలు మనం ఊహించని విధంగా ఉంటాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ అధ్భుతమయిన లీలను గ్రహించుకోవడానికి మన శక్తి
చాలదేమో అన్నంతగా బాబా చూపించారు.
ఎరుపు
రంగు చున్నీ…
సాయిబాబావారి మహిమను వర్ణించగలిగే యోగ్యత నాలో లేదు. నాకటువంటి యోగ్యత ఏమీ లేకపోయినా బాబా నాకు కలిగించిన ప్రత్యక్షానుభవానికి సంబంధించిన క్షణం గురించి ఆ సమయంలో నేననుభవించిన ఆనందం గురించి వివరిస్తాను.
ఇది
నవంబరు 2వ.తేదీ, 2013వ.సం లో జరిగింది. ఆ రోజు
శనివారం నరకచతుర్దశి రాత్రి గం.8.30 ని. సమయం. నేను మా ఇంటికి దగ్గరలోనే ఉన్న సాయిబాబా
మందిరానికి వెళ్లాను ఆరోజు శనివారం కారణంగా
శనిదేవుని మందిరం వద్ద భక్తులు ఎందరో వరుసలో నిలబడి ఉన్నారు. సాయిబాబా మందిరం వద్ద భక్తులంతగా కనిపించలేదు. నేను బాబా విగ్రహం వద్దకు వెళ్ళి, కోవా, కొబ్బరికాయ,
పువ్వులు పూజారికి అందచేసి, నేను నా శిరస్సును బాబావారి చరణ కమలాల మీద ఆనించాను. కళ్ళు మూసుకుని దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రార్ధించుకుంటూ
ఉన్నాను. కొద్ది క్షణాల తరువాత కళ్ళు తెఱచి
చూసాను. నా తలమీద ఎరుపురంగు గోటు వేయబడిన, బంగారు వర్ణంతో జరీ ఉన్న ఎరుపు రంగు
చున్నీ నా భుజాలమీద సరిసమానంగా కప్పబడి ఉండటం నాక కళ్లకు కనిపించింది. కొద్ది క్షణాలలోనే ఇంత అధ్భుతంగా నా భుజాలమీద ఈ
ఎరుపురంగు చున్నీని ఇంత అందంగా ఎవరు కప్పగలరు? నేను బాబా విగ్రహం వైపు చూసాను. రాత్రి సమయంలో అలంకరింపబడ్డ వేషధారణలో బాబా ప్రకాశంగా
వెలిగిపోతూ ఆశీనులయి ఉన్నారు. నవరాత్రి ఉత్సవాలు
పూర్తయి చాలా రోజులయింది. నామనస్సుకు అత్యంత
శాంతి కలిగిన అనుభూతి చెంది పైకి లేచాను. బంగారు
వర్ణపు జరీతో, గోటు వేయబడ్డ ఎరుపురంగు చున్నీ తలమీదనే ఉంచుకుని మెల్ల మెల్లగా ప్రదక్షిణలు
చేస్తూ మందిరమంతా తిరిగాను. శనిదేవుని మందిరంలో
ప్రసాదాన్ని తీసుకుని నడుచుకుంటూ ఇంటికి చేరుకొన్నాను. బాబా నాకు కలిగించిన అనుభవాన్ని విని ఇంటిలోనివారందరూ
స్థాణువులయ్యారు. నేను ఎప్పుడు శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేసినా ఆ సమయంలో ఈ జరీ
అంచు చున్నీని తలమీద వేసుకుని పారాయణ చేస్తూ ఉంటాను. బాబా నాకు చూపించిన ఈ అధ్భుతమయిన లీల సాంసారిక జీవనంలో
సాగిపోయే మనలాంటి సామాన్యులం ఏవిధంగా గ్రహించుకోగలం? బాబా చేతులలోనే నాజీవితం. నాకు బాబా ఆశీర్వాదం లభించింది.
సంధ్యా
చౌదరి
334,
దక్షిణాయన్ సొసైటీ,
ఫ్లాట్ నం. 19, సెక్టార్, 4
ద్వారకా,
ఢిల్లీ – 110 078
రేపు మరొక లీల
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment