28.05.2021 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు మరొక అధ్భుతమయిన లీలను ప్రచురిస్తున్నాను.
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబర్ – అక్టోబర్, 2014 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
బాబాకు
తన భక్తుల మదిలోని కోరికలు, ఆశయాలు, అన్ని తెలుసు. దానికనుగుణంగానే ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో వారికేది
శ్రేయస్కరమో బాబాకు బాగా తెలుసు. అటువంటి అద్భుతాన్ని
సంధ్యా చౌదరిగారు వివరిస్తున్నారు.
శ్రీ
రామ రక్షా స్తోత్రమ్…
హిందీ
మూలమ్ : సంధ్యా చౌదరి
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు,
నిజాంపేట,
హైదరాబాద్
ఎన్నో
రోజులుగా నాకు రామరక్షా స్త్రోత్రాన్ని చదవాలనే కోరిక. పూజాసామగ్రి, పుస్తకాలు అమ్మే దుకాణాలలో నాకు ఆపుస్తకం
ఎంత ప్రయత్నించినా దొరకలేదు.
ఏప్రిల్, 11, 2014 వ.సం. … ఈ రోజు ఎలాగయినా సరే అన్ని పెద్దపెద్ద పుస్తకాల దుకాణాలు, పూజాసామాగ్రి అమ్మే దుకాణాలు తిరిగి ఆపుస్తకం లభిస్తుందేమో చూడాల్సిందే అనుకున్నాను. పుస్తకం కొన్న తరువాత సాయిబాబా మందిరానికి వెళ్ళి ఆయన చరణకమలాల మీద సమర్పించి ఇంటికి తీసుకువెడదామని నా ఆలోచన.
ఈ విధమయిన ఆలోచనలతో బజారుకు బయలుదేరాను. కాని ఆరోజు ఎన్నికల కారణంగా దుకాణాలన్నీ మూసివేయబడి ఉన్నాయి. ఇంక నిరాశగా బాబా మందిరానికి వెళ్ళి ఆయనను దర్శించుకుని నా మనసులోని కోరికను బాబాతో చెప్పుకున్నాను. బాబా అంతర్యామి. తన భక్తుల మదిలోని కోరికలన్నీ ఆయనకు అవగతమే. బాబాను దర్శించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా పెద్ద జనరల్ స్టోర్స్ ఒకటి తెరచి ఉండటం కనిపించింది. లోపలికి వెళ్ళి కాస్త బిడియంగానే “మీ దగ్గర శ్రీ రామ రక్షాస్త్రోత్రం” పుస్తకం ఉందా?” అని అడిగాను.
దుకాణదారుడు నావైపు చూసి
కాసేపు ఆలోచించి, ఒక మూలగా ఉన్న సామానుల గుట్టలలో ఉన్న వార్తాపత్రికల అడుగున ఉన్న ఒక
పుస్తకాన్ని తీసి ఇచ్చాడు. ఆ పుస్తకం చూసి,
“ఇది ఆరతులన్నీ ఉన్న పుస్తకం. ఇందులో అన్నీ
ఆరతులు ఉన్నాయి. ఇది నాకు వద్దు” అన్నాను. అపుడతను, “నాదగ్గర ఇదే ఉంది. ఇందులో అన్ని ఆరతులూ ఉన్నాయి. మీకిది పనికొస్తుంది” అన్నాడు. “వద్దు, నాదగ్గిర ఆరతుల పుస్తకం ఉంది. నాకిది వద్దు” అన్నాను. దుకాణదారుడు, “ఇది తీసుకు వెళ్ళు, దీన్ని చదువు” అని బలవంత పెట్టాడు. నేనతనికి పుస్తకం ఖరీదు ఇవ్వబోయాను. కాని అతను డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. అయిష్టంగానే నేను ఆ పుస్తకాన్ని ఇంటికి తెచ్చుకుని
పేజీలు తిరగేయసాగాను. ఆశ్చర్యం… అనుకోకుండా
అందులో శ్రీరామరక్షాస్త్రోత్రం అనే అధ్యాయం కనిపించింది. ఇక నా సంతోషానికి అవధులు లేవు. ఇనుమడించిన ఉత్సాహంతో బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. బాబా తన భక్తులకు క్షేమాన్ని కలిగించే కోరికలను
ఏమాత్రం ఆలశ్యం చేయకుండా వెంటనే తీరుస్తారు.
శ్రీ రామరక్షా స్త్రోత్రమ్ వినండి. ఇందులో పాడిన విధానమ్ నాకు నచ్చింది. (త్యాగరాజు)
సంధ్యా
చౌదరి,
334,
దక్షిణాయన్ సొసైటీ,
ప్లాట్
బణ్, 19, సెక్టార్ – 4
ద్వారకా,
ఢిల్లీ - 1110 078
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment