30.05.2021 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబా
తన భక్తులను అనుగ్రహించడానికి ఎపుడు ఏ రూపంలో వస్తారో ఎవ్వరూ ఊహించలేరు. ఆయన వచ్చి వెళ్ళిన తరువాత మాత్రమే బాబా వచ్చారనే
విషయం మనకు తెలుస్తుంది. అటువంటి అనూహ్యమయిన
సంఘటన జరిగిన అధ్భుతాన్ని శ్రీ వినాయక్ కోసే గారు వివరిస్తున్నారు. ఈ అధ్బుతమయిన లీల శ్రీ సాయి లీల ద్వైమాసపత్రిక మే
– జూన్, 2015 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
హిందీ
మూలమ్ : శ్రీ వినాయక్ కోసే
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
వివిధ
రూపాలలో సాయి
ఈ
కలియుగంలో సగుణ – సాకార బ్రహ్మావతారమయిన శ్రీ సాయిబాబా ప్రజలందరి హితం కోసం, వారిలో
మంచిని పెంపొందించడానికి ఎన్నో ఉపదేశాలనిచ్చారు.
ఆయన ఉపదేశాలను విన్నవారు, చదివినవారు, దేశవిదేశాలనుండి కుల మత జాతి భేదాలు లేకుండా
అధిక సంఖ్యలో బాబా దర్శనానికి షిరిడీకి వస్తూ ఉన్నారు.
నాగపూర్
లో ఉన్న ఒక సాయిభక్తుడయిన శ్రీ సుజిత్ బారస్కర్ షిరిడీకి పాదయాత్ర చేస్తున్న సమయంలో
అధ్భుతమయిన అనుభవం కలిగింది. ఆయన తన అనుభవాన్ని
సహ యాత్రికులయిన సాయి భక్తులకి ఈ విధంగా వివరించారు.
నాగపూర్
నుండి ప్రతి సంవత్సరం సాయిభక్తులు షిరిడికి పాదయాత్రకు బయలుదేరుతూ ఉంటారు. కొంతమంది భక్తులు ఔరంగాబాద్ వెళ్ళి సాయిభక్తుల పాదయాత్రలో
కలుస్తూ ఉంటారు. ఔరంగాబాద్ నుండి షిరిడికి
పాదయాత్ర చేసేవారందరికి ప్రతి చోటా స్థానికులు తమ యధాశక్తిగా వారందరికీ సేవ చేస్తూ
ఉంటారు. ఒకసారి పాదయాత్ర చేస్తున్న సమయంలో
చాలా దూరం నడచినా గాని దారిలో సేవచేసే వ్యక్తి ఒక్కడూ కనిపించలేదు. ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు. దారిపొడవునా స్థానికులు ఎవరో ఒకరు పాదయాత్ర చేసేవారికి
సేవచేస్తుండేవారు. ఈ సారి ఆవిధంగా జరగకపోవడంతో
అందరూ చాలా ఆశ్చర్యపోయారు. అందరికీ బాగా ఆకలివేస్తూ
ఉంది. దారిలో చుట్టుప్రక్కల ఎక్కడా తినడానికి
కూడా ఏమీ దొరకలేదు. సాయినామం జపించుకుంటూ సాయిభక్తులందరూ
నడుస్తూ ఉన్నారు. పాదయాత్రలో ఉన్న శ్రీ సుజిత్
బోరస్కర్ కి అపరిచితుడయిన ఒక యువకుడు కనిపించాడు.
అతను ఒక బుట్టలో రొట్టెలు, ఇంకా కొన్ని పదార్ధాలు పట్టుకుని వస్తూ ఉన్నాడు. ఈ విషయం ఆయన తనతోటి యాత్రికులకి చెప్పారు. ఆ అపరిచిత యువకుడు ముందుగా శ్రీ సుజిత్ బోరస్కర్
కి, ఆతరువాత మిగతా యాత్రికులకి కడుపునిండా భోజనం పెట్టాడు. అందరికీ జఠరాగ్ని శాంతించింది. తిరిగి మళ్ళీ శక్తి పుంజుకుని అందరూ సాయిదర్శనానికి
పాదయాత్ర ప్రారంభించారు. ఆ అపరిచిత వ్యక్తి
కొంతదూరం వరకు కనిపించాడు. ఆ తరువాత అకస్మాత్తుగా
అతను అదృశ్యమయ్యాడు. అందరూ అతను వెళ్ళినవైపే
ఎంతో విస్మయంగా చూస్తూనే ఉన్నారు.. అతను ఎక్కడా
కనిపించలేదు. ఎవ్వరికీ నోటమాట రాలేదు.
షిరిడీ
చేరుకున్న పాదయాత్రికులకి రెండవసారి మరొక అనుభవం కలిగింది. అంతకు ముందు కనిపించిన ఆ అపరిచిత యువకుడే సాయిప్రసాదం
లడ్డూలు తీసుకుని వచ్చి ఎదురుగా నుంచుని ఉన్నాడు.
అతను అందరికీ లడ్డూలు పంచిపెట్టాడు.
ప్రసాదాన్ని తీసుకుని పాదయాత్రికులందరూ ఆయువకునివైపే ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పటివరకూ లడ్డూలను పంచుతూ పంచుతూ ఉన్న ఆయువకుడు
ఎప్పుడు మాయమయాడొ తెలీదు. ఇది ఎలా జరిగిందో
ఎవరికీ అర్ధం కాలేదు. పాదయాత్రికులందరూ ఆయువకుడు
ఎక్కడయినా కనిపిస్తాడేమోనని చాలాసేపు వెదికారు.
కాని ఎంతప్రయత్నించినా అతను ఎక్కడా కనపడలేదు. అతనియొక్క రూపం పాదయాత్రికులందరి మనసులలోను ముద్రించుకునిపోయింది. వారినోట మాట లేదు.
వినాయక్
రోసే,
సాయిబాబా
మందిరం దగ్గర,
గణేష్
మందిరం రోడ్,
టిట్
వాలా
ఠానే జిల్లా, మహారాష్ట్ర
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment