09.06.2021 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అధ్భుతమయిన బాబా లీల గురించి ప్రచురిస్తున్నాను.
ఈ
లీల శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక నవంబరు – డిసెంబరు, 2008 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
షిరిడీ సాయిబాబా – గురునానక్
శిక్కుల మతగురువయిన గురునానక్ జయంతి ఉత్సవాలు కార్తిక పౌర్ణమి (అక్టోబర్ – నవంబర్) నాడు నిర్వహిస్తూ ఉంటారు.
గురునానక్
1469 వ.సం.లో లాహోర్ కి 45 కి.,మీ. దూరంలో ఉన్న తాల్వండీలో జన్మించారు.
ఇపుడు
ఆ తాల్వండీ నానకనా సాహిబ్ గా పిలవబడుతూ ఉంది.
నానకనా సాహిబ్ లో సుందరమయిన గురుద్వారా, ఇంకా పవిత్రమయిన సరోవరం కూడా ఉంది.
గురుపౌర్ణమినాడు ఇక్కడ
అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.
భారతదేశంనుండే కాక
విదేశాలనుండి
కూడా వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవాలు చూడటానికి వస్తూ ఉంటారు.
నానక్ గొప్ప సంస్కర్త, తత్త్వబోధకుడు, సత్పురుషుడు.
శిక్కు
మతంలో, హిందూమతమ్ మరియు ఇస్లాం మతాల మధ్య ఐకమత్యం పెంపొందించడానికి ప్రయత్నం చేసారు.
కులాలమధ్య
వ్యత్యాసాలపై
ఆయనకు నమ్మకం లేదు.
సామాజిక విధానాలన్నీ
స్వేచ్చాయుతంగా
ఉండేలా చేసారు.
ఆధ్యాత్మిక
సాక్షాత్కారానికి
భగవంతుని నామం శక్తిమంతమయిన సాధనమని బోధించారు.
ఆయనయొక్క
నామం, దానిని పదేపదే స్మరించడం వల్ల మనలోని ఉత్తమగుణాలు మరింతగా అభివృధ్ధి చెందడానికి దోహదపడుతుందని బోధించారు.
ఈ సంవత్సరం గురునానక్ జయంతి నవంబరు, 13వ.తారీకు గురువారమునాడు వచ్చింది.
బాబా,
ఈ గురువారం (నీ గురువారం) గురుపౌర్ణిమ ప్రపంచమానవాళి అందరికీ శక్తిని, అదృష్టాన్ని, విజయాన్ని, సుఖసంతోషాలనీ కలిగించేలా దీవించు.
సాయీ! నీ
భక్తులలో ఒకరు ముంబాయిలో నివసిస్తున్నారు.
ఆ
భక్తుని యొక్క అనుభవాన్ని చదువుతుంటే నాకళ్ళు చెమర్చుతున్నాయి.
అతని
యొక్క అనుభవం …
“నా పేరు చందన్.
నేను,
నాభార్య ఇద్దరం సాయిభక్తులం.
బాబా
అనుగ్రహంతోనే
మా జీవితాలు కొనసాగుతున్నాయి.
మా
ఇద్దరి జీవితాలను బాబాపాదాల చెంతనే సమర్పించుకున్నాము.
మేము
ఎక్కడికి వెళ్ళాలో ఆయనే నిర్ణయించి తీసుకువెడతారు.
బాబా
అనుగ్రహం వల్ల మాకు అత్యధ్భుతమయిన అనుభవం కలిగింది.
అటువంటి
సంఘటన మీకు ఇపుడు వివరిస్తాను.
రెండు సంవత్సరాల క్రితం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుని మా కారులో ముంబాయికి తిరుగు ప్రయాణం చేస్తున్నాము. మేము అప్పుడే షిరిడీ పొలిమేరలు దాటాము. సరిగా అప్పుడు ఏదో ఒక అధ్భుతం జరుగుతోందని నా భార్య చెప్పింది. తను ఏవైపు చూసినా అక్కడే తన కళ్ల ముందు బాబా రూపం కనపడుతోందని చెప్పింది. “నువ్వు కళ్ళుమూసుకుని సరిగా వెనుకకు ఆనుకుని కూర్చో, ఆ తరువాత ఏమి జరిగేది చెప్పమని” అన్నాను. ఆ తరువాత 3 – 4 నిమిషాలవరకు నేను, 13 సంవత్సరాల వయసు గల మా అబ్బాయి తనని పట్టించుకోలేదు. నా భార్య కళ్ళు తెరచి నావైపు చూసి నవ్వుతూ “నేను చెప్పేది మీరు అస్సలు నమ్మరు. నేను కళ్ళు మూసుకోగానే బాబా నాఎదుట స్పష్టంగా కనిపించారు. ఆయన చుట్టూ ఒక విధమయిన అగ్నిజ్వాలలాంటిది ఉన్నట్లుగా నాకు అనిపించింది. బాబా బాధలో ఉన్నట్లుగా అనిపించి నేను దానిని భరించలేకపోయాను. అపుడు నేను బాబా ఆవిధంగా కనిపిస్తున్న రూపాన్ని నాకు కనిపించనీయకు అని ప్రార్ధించాను. ఆ తరువాత అంతా ప్రశాంతంగా అయింది. బాబా ఒక తాటాకుల పాక బయట కూర్చొని ఉండటం కనిపించింది. ఆయన దగ్గర ఒక మట్టి కుండ ఉంది. నేను ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన ముందు ముకుళిత హస్తాలతో నా మోకాళ్ళమీద కూర్చున్నాను. బాబా నావైపు చూసి నవ్వుతూ నన్ను ఆశీర్వదించారు. ఆ తరువాత కుండలోని నీళ్ళు నా చేతులలో పోసారు. నేను ఆనీటిని త్రాగాను. ఆ మరుక్షణం బాబా నానుండి వెళ్ళిపోవడం కనిపించింది. కాని ఆయనతో పాటుగా మరొక వ్యక్తి ఉన్నారు. బాబాతో పాటే ఉన్న వ్యక్తి గురునానక్, చాలా స్పష్టంగా కనిపించారు నాకు.
బాబా
మరియు గురునానక్ ఇద్దరూ కలిసి ఎందుకని కనిపించారో నాభార్యకు అర్ధం కాలేదు. బహుశా
ప్రవక్తలు,
యోగులు ఎపుడూ కలిసే ఉంటారు, అదే కారణం అయి ఉండవచ్చని నా భార్యకు చెప్పాను.
ఆ
అధ్భుతమయిన అనుభూతి అనుభవం మేము ప్రయాణం చేస్తున్నంత సేపు మరపురాని అనుభూతిగా మాలో చెరగని ముద్రవేసింది.
బాబా
ఆవిధంగా నా భార్యకు దర్శనమిచ్చి మమ్మల్ని అనుగ్రహించడంతో మేమెంతో అదృష్టవంతులమని భావించాము.
కొన్ని
నెలల తరువాత మేము మా తల్లిదండ్రులను, బంధువులను చూడటానికి మా స్వంత ఊరికి వెళ్ళాము. అక్కడ ఉన్న రోజులలో మా మరదలు రూప, బాబాకు సంబంధించిన
ఒక సంఘటనను వివరించింది. ఆమెకు ఒకరోజు రాత్రి
స్వప్నంలో బాబా దర్శనమిచ్చారు. ఆయన ప్రక్కనే
గురు నానక్ దేవ్ కూడా ఉన్నారు. అపుడు రూప,
“బాబా మీరు గురునానక్ దేవ్ తో ఎలా వచ్చారు?” అని ప్రశ్నించింది. బాబా నవ్వుతూ ఆమెతో “ఆయన, నేను ఇద్దరం ఒకటే. ఈ భూమి
మీదకు వేరు వేరు సమయాలలో వచ్చాము. మా ఇద్దరి
ఆత్మలు ఒకటే” అన్నారు. రూప చెప్పినది వినగానే
మాకు వెంటనే, నా భార్యకు అంతకు ముందు కనిపించిన దృశ్యం గుర్తుకు వచ్చింది.
ఈ
సంఘటనలు జరగడానికి ముందు బాబా, గురునానక్ దేవ్ ఇద్దరూ ఒకటే అనే విషయం నాకు తెలియదు. నేనెక్కడా ఈ విషయం చదవలేదు, (నేను పుస్తకాలు ఎక్కువ
ఆసక్తితో చదువుతాను) ఎవరూ చెప్పగా వినలేదు.
ఈ సందేశాన్ని బాబా మాకు తెలియచేయడానికి, ఇంకా తన భక్తులకి కూడా తెలియచేయమని
చెప్పడమే బాబా ఉద్దేశ్యమని మాకు బలమయిన అభిప్రాయం కలిగింది. ఆ తరువాత అంతకుముందు నేను చదవని గురునానక్ జీవితం
గురించిన పుస్తకాలు రెండు కొన్నాను. ఆ పుస్తకాలు
చదివిన తరువాత ఆయన బోధనలు, బాబా చెప్పిన బోధనలలోను రెండిటిలోను నాకు ఎన్నో సారూప్యాలు ( పోలికలు ) కనిపించాయి.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment