11.06.2021 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక నవంబరు – డిసెంబరు, 2008 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన సాయిలీల
షిరిడీ సాయిబాబా – గురునానక్ – 2 వ.భాగమ్
ఆంగ్ల మూలమ్ డా.సుబోధ్ అగర్వాల్, డెహ్రాడూన్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఓ బాబా! యోగులు వాస్తవంగానే ఏకభావంతో కార్యాన్ని నిర్వహిస్తారు. గురునానక్ హిందువులు, ముస్లిమ్స్ మధ్య ఐకమత్యం ఉండాలని కోరుకొన్నారు. నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందింపచేయడానికి, మతసామరస్యాన్ని నెలకొల్పడానికి అవతరించినవానిగా కీర్తింపబడ్డావు. గురునానక్ ఎప్పుడూ ‘ ఏక్ ఓంకార్ సత్నామ్’ అని అంటూ ఉండేవారు. అనగా దాని అర్ధం ‘భగవంతుడు ఒక్కడే - ఆయన పేరు సత్యసంధత’. అదేవిధంగా జీవితంలో నీయొక్క ముఖ్యమయిన ఉద్దేశ్యం శాశ్వతమయిన సత్యాన్ని ప్రజలు గ్రహించుకోవాలన్నదే. ‘సబ్ కా మాలిక్ ఏక్’ అందరినీ పరిపాలించేది ఒకే భగవంతుడు. (భగవంతుడే అందరికీ యజమాని).
కులాలమధ్య వ్యత్యాసాలపై గురునానక్ కి
నమ్మకం లేదు. సామాజిక సాంప్రదాయాలను
స్వేచ్చాయుతం చేసారు. కులపక్షపాతాలనేవి అవమానకరమని వాటిని ఖండించారు. కులపక్షపాతాలనే ఈ సామాజిక అనారోగ్యానికి
దూరంగా ఉన్నారనటానికి ఆయనే ఒక ఉదాహరణ.
ఒకసారి ఆయన ఎమినాబాద్ (పాకిస్థాన్)
వెళ్ళారు. అక్కడ నిమ్న కులానికి చెందిన భాయి లాలో
ఇంటికి వెళ్ళి అతనితోపాటే ఉన్నారు.
ఇతను చేతివృత్తి చేసుకుంటు జీవించే పేదవాడు. అతను
ఎప్పుడూ కష్టించి నిజాయితీగా పని చేస్తూ వచ్చిన ఆదాయంతోనే జీవించే వ్యక్తి. ఇద్దరూ కలిసి భోజనం చేయడం చూసిన గ్రామస్థులు
చాలా ఆశ్చర్యపడ్డారు. ఒకసారి మాలిక్ భాగో అనే గ్రామపెద్ద గ్రామంలో అందరికీ బ్రహ్మాండమయిన విందు భోజనం
ఏర్పాటు చేసాడు. అతను
గురునానక్ ని కూడా ఆ విందుకు ఆహ్వానించాడు.
కాని గురునానక్ అతని ఆహ్వానాన్ని తిరస్కరించారు. గ్రామపెద్దకు అది అవమానకరంగా తోచి
దానికి కారణం తెలుసుకోవాలని అనుకున్నాడు.
అపుడు గురునానక్ అందరి సమక్షంలో గ్రామపెద్దతో, “నువ్వు పేదల రక్తాన్ని పీల్చి బలవంతంగా
వారినుంచి అన్యాయంగా రాబట్టిన సొమ్ముతో ఏర్పాటు చేసిన విందు కాబట్టి నేను తిరస్కరించాను”
అని అన్నారు. భాయి లాలూ మాత్రం తను నిజాయితీగా కష్టించి సంపాదించిన డబ్బుతో పెట్టిన భోజనం
ఎంతో మేలైనదని అన్నారు. గురునానక్ అన్న మాటలు మాలిక్ భాగోలో నిద్రాణస్థితిలో ఉన్న ఆత్మను మేల్కొలిపాయి.
ఓ! బాబా! నువ్వు కూడా మానవులలోనే కాక, ఈ ప్రకృతిలో చరించే అన్ని
జీవరాశులు, పక్షులు, జంతువులు, క్రిమికీటకాదులన్నిటిలోను ఉన్నావని తెలియచేసావు. మానవులు సృష్టించుకున్న కులాల మధ్య
వ్యత్యాసాలు నీ దృష్టికి కనిపించవు.
నువ్వు ఎప్పుడూ నీ కులమేమిటో నీ మతమేమిటో ఎవ్వరికీ తెలియనివ్వకపోవడం
ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది.
నీ ద్వారకామాయిలో అడుగు పెట్టిన ప్రజలందరిలోను సమానత్వాన్ని తీసుకువచ్చావు. తన జాతిని, కులాన్ని దేహాభిమానాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతునికి సర్వశ్యశరణాగతి
చేసినవానికి ఇది ఆశ్చర్యకరమయిన విషయం కాదు. నీ వద్దకు వచ్చినవారినెవరినీ నువ్వు
నీజాతి ఏమిటి, నీ మతమేమిటి అని ఎప్పుడూ ప్రశ్నించలేదు. అటువంటి మహోన్నతమయిన వ్యక్తివి నీవు. మానవుల మధ్యన ఉండే కులమత జాతి భేదాలను
నువ్వెప్పుడూ చూడలేదు. ఫకీరులతో కలిసి భోజనం చేసావు.
కుక్కలు ముట్టిన ఆహారాన్ని కూడా నువ్వు సణుగుకోలేదు. ద్వారకామాయిలో నువ్వు స్వయంగా వండి
అందరికీ భోజనాలు పెట్టడం అందరినీ సమానంగా చూడాలనే పాఠాన్ని నేర్పావు.
బాబా! అస్పృశ్యతను పాటించవలదనే విషయాన్ని నీవు ఏవిధంగా తెలియచేసావో దానికి మరొక ఉదాహరణ. భాగోజీ షిండే కుష్టువ్యాదితో బాధపడుతుండేవాడు. కాని నువ్వు అతనిని ఎప్పుడూ నీదగ్గరకు రావద్దని అడ్డుచెప్పలేదు. నువ్వు లెండీ తోటకు వెడుతున్నపుడేల్లా నీకు నీడ కలిగించడానికి గొడుగు పట్టి నీ కూడా వచ్చేవాడు.
ఒకసారి
నువ్వు నీచేతిని ధునిలో పెట్టినపుడు నీ చేయి బాగా కాలి గాయమయింది. (ఒక భక్తురాలి బిడ్డను నువ్వు మంటల్లో పడకుండా కాపాడిన సందర్భంలో). అపుడు భాగోజీ షిండే నీ కాలిన చేతి
గాయాన్ని శుభ్రం చేసి కట్టుకడుతూ ఉండేవాడు. అదేవిధంగా నిమ్నకులానికి
చెందిన పాటగాడు మర్దానా అనే అతను గురునానక్ కూడా జీవితాంతం ఉండేవాడు. మర్దానా కుటుంబంలో చాలామంది చిన్నవయస్సులోనే
మరణిస్తూ ఉండటంతో అతను మొట్టమొదటగా గురునానక్ సహాయాన్ని అర్ధించాడు. అపుడు గురునానక్ అతని వంశంలో ఇకనుంచీ
ఎవ్వరూ చిన్న వయసులోనే మరణించరని అభయాన్నిచ్చారు. ఆ అభయాన్నుండె మర్దానా అనే పేరు వచ్చిందని
అంటారు. ‘ మర్ – దా – నా’ అంటే అర్ధం ‘మరణించరు’.
ఒకసారి గురునానక్ ధర్మప్రచార నిమిత్తం మర్దానాతో కలిసి పర్యటిస్తున్నారు. దారిలో వారు కొంతసేపు విశ్రాంతి కోసం ఆగారు. కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో భయంకరమయిన తుఫాను ప్రారంభమయింది. ఆ తుపాను ధాటికి చెత్తా చెదారం ఎగురుతూ వస్తూ ఉంది. ఆకాశం, చుట్టుప్రక్కల ప్రాంతమంతా దట్టమయిన చీకటి అలుకుముని ఉంది. చేతిపొడవు దూరంలో ఏమీ కనిపించని పరిస్థితి. అంత దట్టమయిన చీకటి వ్యాపించి ఉంది. అంత బలంగా ఉంది తుఫాను భీభత్సం.
మర్దానా తన నోటిమీద ఒక బట్టను కప్పుకుని పడుకున్నాడు. అతను గురునానక్ తో “ఇటువంటి భయంకరమయిన ప్రదేశంలో నేను మరణించినట్లయితే నాకు అంత్యక్రియలు కూడా జరగవు. సమాధి కూడా జరగదు. నీతో కూడా ప్రయాణిస్తున్నందుకు నాకు చాలా కష్టాలు కలుగుతున్నాయి” అని అన్నాడు. అపుడు నానక్ నవ్వుతూ “ఎందుకని భయపడతావు. నీకెటువంటి ప్రమాదం జరగదు” అన్నారు. అపుడు వారి ఎదుట ఒక భయంకరమయిన రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. అతని తల ఆకాశంలో ఉంది. అతని కాళ్ళు భూమి లోపలికి చొచ్చుకుని ఉన్నాయి. అతని నాసికా రంధ్రాలు బావిలాగా లోతుగా ఉన్నాయి. నోటిలోని దంతాలు చాలా పొడవుగా ఉన్నాయి. ఆ రాక్షసుడు మహాకాయుడు. భారీ శరీరం. అతను గురునానక్ వైపు వచ్చాడు. మర్దానా భయంతో వణికిపోతూ గురునానక్ తో “ మహరాజ్! మనం తుఫానునుండి బయటపడ్డాము. ఇపుడు మనకి చావు తధ్యం. ఈ భయంకరాకారుడయిన రాక్షసుని ఎదిరించి బ్రతకలేము” అన్నాడు. గురునానక్ ప్రశాంతంగా సమాధానమిచ్చారు. “మర్దానా! అతను నీవద్దకు రాడు. భయపడకు. ‘వాహే గురుని’ ధ్యానించు”
అపుడు
కలిపురుషుడు తన రూపాన్ని మరలా మార్చుకుని ఈ సారి అగ్నిజ్వాలగా మారిపోయాడు. అతని శరీర రోమకూపాలనుండి పొగలు వెలువడుతూ
ఉన్నాయి. ఆఖరిగా అతను
మరలా భయంకరమయిన ఆకారంలోకి మారిపోయాడు.
అయినా గురునానక్ అతనిని ఏమాత్రం పట్టించుకోకుండా చాలా ప్రశాంతంగా
ఉన్నారు. తాను ఎన్ని
భయంకరాకారాలుగా రూపాన్ని మార్చుకున్నా గురునానక్ దేనికీ భయపడలేదంటె ఈయన ఒక ప్రవక్తయి
ఉండవచ్చని భావించాడు. కలిపురుషుడు ఆవిధంగా భావించిన తరువాత మానవాకారంలోకి మారిపోయాడు. మానవాకారంలో ఉన్న కలిపురుషుడు ఒక
చేతితో తన నాలుకను, రెండవచేతితో తన *** పట్టుకుని గురునానక్
వద్దకు వచ్చాడు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
1 comments:
Hanuman Chalisa in Tamil (ஸ்ரீ ஹனுமான் சாலிசா)
Post a Comment