13.06.2021 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక నవంబరు – డిసెంబరు, 2008 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన సాయిలీల
షిరిడీ సాయిబాబా – గురునానక్ – 3 వ.భాగమ్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
గురునానక్ మర్దానాతో “ఇలా వచ్చి చూడు – ఇప్పుడు జరగబోయే నాటకాన్ని చూడు” అన్నారు. కలిపురుషుడు గురునానక్ కు తలవంచి వినయంతో వేడుకొన్నాడు. “మహరాజ్, దయచేసి నాతప్పులను క్షమించండి. నాకు మీపేరుప్రఖ్యాతులు, గొప్పతనం తెలియవు. ఈ యుగానికి నేనే పరిపాలకుడిని. మానవులను ఏకోరికలయితే నడిపిస్తున్నాయో అటువంటి భౌతికశరీరంతో మీముందుకు వచ్చాను నేను. మానవులు అన్ని ధర్మాలను విస్మరిస్తారు. వారి జీవితాలన్నీ నాలుక రుచులకి, *** కోరికల చేత నడిపింపబడుతూ ఉంటాయి.
ఈ కోరికలే మానవుల జీవితాలను నడిపిస్తాయి”. గురునానక్ అతని గురించి తెలుసుకోవాలనే
ఆసక్తితో “నువ్వెవరు? నీ పేరేమిటి?
నువ్వు మమ్మల్ని కలుసుకోవడానికి ఎందుకు వచ్చావు?” అని ఆడిగారు. అపుడు కలిపురుషుడు, “నాపేరు కలియుగ్. మీకు నేను నా ప్రణామాలను అర్పించడానికి వచ్చాను. మిమ్మల్ని పరీక్షించడానికే ముందుగా
నేను వివిధరూపాలను ధరించాను”. గురునానక్ తిరిగి ప్రశ్నించారు, “నీ గుణగణాలేమిటీ? ఈ యుగాన్ని నువ్వే పరిపాలిస్తున్నావని
అన్నావు. ఏవిధమయిన సైన్యంతో నువ్వు నీ పరిపాలనను కొనసాగిస్తున్నావు?”
అపుడు కలిపురుషుడు, “ నా వద్దనున్న అత్యంత గొప్ప యోధుడు ‘అసత్యం’. నా సైన్యానికి ముందు ‘అసత్యం’ జెండా పట్టుకుని నడుస్తూ ఉంటుంది. ప్రాపంచిక విషయాలతో బంధాలే ఈ సైన్యానికంతటికీ రాజు. నా సైన్యాధ్యక్షుడు హింస, హత్య. నా ఏనుగుమీద కామము, క్రోధము, దురాశ, అహంకారము అనే యోధులు ఉన్నారు. ఈర్ష్య, వ్యర్ధ ప్రసంగాలు, పనికిమాలిన ముచ్చట్లు, అపనింద, దోపిడీ, ప్రాపంచిక విషయాలపై నెరవేరనికోరికలు, ఇవన్నీ రధాలమీద వచ్చే యోధులు. సోమరితనం, జూదము, త్రాగుడు/మత్తుపదార్ధాలు, ఇంకా ఇతర చెడువ్యసనాలు ఇవన్నీ అశ్వాలమీద కూర్చుని వస్తున్న యోదులు. అన్యులతో సంబంధాలు, పాపము, దొంగతనము ఇవన్నీ కూడా నా కాల్బలము. నా సైన్యంతో నేనెక్కడికి వెళ్లినా నేనెప్పుడూ విజయాన్ని సాధిస్తాను. నా యుధ్ధయోధులందరూ అసత్యం, క్రోధం. వీరందరూ నేనెక్కడికి వెళ్ళినా నాకు విజయాన్ని సాధించి పెడతారు. ఇవీ నాపాలనయొక్క లక్షణాలు. ప్రస్తుతం ప్రపంచం యొక్క స్థితి కలిపురుషుని వివరణ విన్న తరువాత గురునానక్, “ఎవరయితే బాధ్యత వహిస్తారో వారే అవమానింపబడతారు. సేవకుడు ఎందుకు భయపడాలి?” (గురుగ్రంధ సాహెబ్ లింబ్ 902).
సేవకుడు ఎప్పుడూ భయపడడు. కారణం అతను పరిపాలకుడు కాదు కాబట్టి. అతనికి పోయేదేమీ లేదు. ఎటువంటి పర్యవసానాలకి భయపడకుండా సేవకుడు
తన ఇచ్చానుసారం ఎక్కడికయినా వెళ్ళగలడు.
కాని పరిపాలించేవాడు తన పరిపాలనకి తను చేయవలసిన విధులకు కట్టుబడి
ఉండాలి. యజమాని సంకెళ్లతో
బంధింపబడితే? అతను తన
సేవకుని చేతిలోనే మరణిస్తాడు.
అందుచేత నువ్వు పరిపాలించినా గాని నీ
పరిపాలనలో జరిగే ఇటువంటి అకృత్యాలవల్ల నువ్వు కూడా అవమానాలను ఎదుర్కోవలసి ఉంటుందని
గురునానక్ అన్నారు. ఇపుడు
ఇదే నీ పరిపాలన అయినట్లయితే నేను భగవంతుని సేవకుడిని. నీ పరిపాలన అంతం కావాలని రాసిపెట్టి
ఉన్నట్లయితే అది భగవంతుని సేవకుడయిన ఈ గురునానక్ వల్లనే సంభవిస్తుంది. “నేను మీవద్దకు వచ్చిన కారణం కూడా
అదే మహరాజ్” అని కలిపురుషుడు సమాధానమిచ్చాడు. ఆ కారణమేమిటంటే మీకు, భగవంతుడికి మధ్య ఎటువంటి భేదము లేదు. నేను మీకు బంగారంతోను, ముత్యాలతోను నిర్మింపబడిన అత్యంత సుందరమయిన గృహాన్ని కానుకగా ఇస్తాను. ఆ గృహంలో నేను చందనం, కస్తూరి పరిమళాలను వెదజల్లుతాను.
మీరు అందులో ఎంతో సంతోషంగా నివాసం ఉండవచ్చు. కలిపురుషుడు తాను ఇవ్వజూపుతున్నవాటిని
స్వీకరించవలసిందిగా గురునానక్ ని బ్రతిమాలాడు. అపుడు గురునానక్ ఇచ్చిన సమాధానమ్.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment