15.06.2021 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక నవంబరు – డిసెంబరు, 2008 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన సాయిలీల
షిరిడీ సాయిబాబా – గురునానక్ – 4 వ.భాగమ్
ఆంగ్ల మూలమ్ - డా.సుబోధ్ అగర్వాల్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
సాయిబంధువులకు ఒక గమనిక....
సాయిభక్తురాలు ఒకామె భరద్వాజగారి పుస్తకాలు ఈ క్రింద ఇస్తున్న లింక్ ద్వారా చదవచ్చని చెప్పారు. ఆ లింకి ఇక్కడ ఇస్తున్నాను. కొంత సమయం కేటాయించుకుని వారి పుస్తకాలను ఆన్ లైన్ లో చదవవచ్చు...
http://www.saibharadwaja.org/pages/books.aspx
“ఒకవేళ నాకు ముత్యాలతోను, ఆభరణాలతోను, కస్తూరి, కుంకుమపువ్వు, చందనపు సువాసనలతోను లభించే గృహం అవన్నీ నా కళ్ళముందు కనబడుతూ ఉంటే చాలా ఆనందంగానే ఉంటుంది. అవన్నీ చూసిన తరువాత నేను దారి తప్పవచ్చు. నేను వాహేగురుని మర్చిపోవచ్చు. నీపేరు కూడా నా ఆలోచనలోకే ప్రవేశించదు. భగవంతుడు లేని నా ఆత్మ కాలి బూడిదయినట్లే. నేను నా గురువుని సంప్రదించాను. అక్కడ వేరే స్థలమేదీ లేదని గమనించాను.
నువ్వు ఇవ్వచూపే భవనంయొక్క నేల వజ్రాలతోను,
కెంపులతోను తాపడం చేసి ఉన్నా, నేను శయనించే తల్పం
కెంపులతో పొదిగి ఉన్నా, కంఠములు పచ్చలహారాలతో అలంకరింపబడి ఉన్నటువంటి
స్వర్గలోకపు సుందరాంగులు, ఎంతో సౌదర్యంతో వెలిగిపోతూ ఉన్న వారి
వదనాలు, తమ హావభావాలతో ప్రేమతో నన్ను ప్రలోభపెట్టడానికి వారు
ప్రయత్నించినట్లయితే నేను అడ్డదారిలో నడుస్తూ నిన్ను మర్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది. నామదిలోకి నీపేరు కూడా ప్రవేశించదు.
నాకు సిధ్ధశక్తులు లభించి సిద్దుడినయి
అధ్భుతాలు, మాయలు చేసినట్లయితే అందరూ నన్ను చూసి ఓహ్ ఎటువంటి అధ్భుతాలు ప్రదర్శిస్తున్నాడొ
అని విస్మయంతో చూస్తారు. ఈ మాయలోపడి నేను దారి తప్పుతాను.
నిన్నే మర్చిపోతాను.
నా ఆలోచనలోకి నీపేరు కూడా ప్రవేశించదు. ఒకవేళ నేనే చక్రవర్తిని అయి అతిపెద్ద
సైన్యాన్ని ఏర్పరచుకుని సింహాసనం మీద కూర్చుని అందరికీ ఆదేశాలను ఇస్తూ ఉన్నా నేను అధర్మంలో
నడుస్తూ నిన్ను మర్చిపోతాను. నీవు గాని నీపేరు గాని నాతలపులలోకే రాదు. (శ్రీ గురుగ్రంధ
సాహెబ్ – లింబ్ 14)
పైన చెప్పినవాటి ప్రకారం గురునానక్ ను
అనుగ్రహించి ఇస్తానని ఎంతగానో ప్రలోభపెడుతూ వాటిని అంగీకరించమని ఆయనను ఒప్పించడానికి ఎంత
ప్రయత్నించినా కలియుగ్ విజయం సాధించలేకపోయాడు.
అపుడు కలియుగ్ “మహరాజ్ మీరు ప్రజలనందరినీ
జనన మరణ చక్రాలనుండి విముక్తులను కావించటానికే జన్మించారు. నేను ఎంతో వినయంగా మీపాదాల చెంతకు
వచ్చాను. నేను మిమ్మల్ని
కలుసుకున్నా మన కలయిక వల్ల ఎటువంటి ఫలితం కనిపించలేదు. మన ఇద్దరి కలయిక నిష్ప్రయోజనమయింది. నేను మీకు ఎన్నో సుఖభోగాలను లభింపచేస్తానని చెప్పాను. కాని మీరు
వేటినీ అంగీకరించటంలేదు. కనీసం ఏదయినా ఒకటి కోరుకోండి.
అపుడు మీరు నన్ను అనుగ్రహించినట్లుగా భావిస్తాను అన్నాడు. అతను వినయంతో తనను ఏదయినా కోరుకోమని
అన్నపుడు గురునానక్ “అయితే ఏదయినా కోరుకోమని నువ్వు నన్ను హృదయపూర్వకంగా
ప్రాధేయపడుతున్నావు కాబట్టి నేను కోరుకునేవి ప్రసాదించు. ఎవరయితే నన్ను నమ్ముకుని నాకు అంకితమయిన
శిక్కులు ఎవ్వరిమిద నీ సైన్యం అధికారాలు ఏవిధమయిన ప్రభావం చూపకూడడు. శిక్కులు ధ్యానము, దాతృత్వము,
స్నానము (భౌతిక మరియు ఆధ్యాత్మిక శుధ్ధి)
ఎప్పుడూ మరువకూడదు. ఏరూపంలోనయినా సరే ఈ మూడు కర్మలను ఆచరిస్తున్న శిక్కులను నువ్వు ఆపకూడదు. నన్ను నమ్ముకున్నవారి మీద నీ శక్తులు
పనిచేయకూడదు”
కలియుగ్ ఎంతో వినమ్రంగా చేతులు జోడించి,”మహరాజ్! మీ ఆదేశాలను నేను తిరస్కరించలేను. కాని మార్చడానికి నాకు భగవంతుని అనుమతి
ఉంది. భగవంతుని అనుమతికి
అనుగుణంగా ఇపుడు చెప్పబోయేవి సంభవమయేలాగ చేస్తాను...
“సద్గురువులకు అగౌరవం. మూర్ఖులను ప్రసిధ్ధులుగా శక్తిమంతులుగా
చేయుట
”వివాహితుల మధ్య నమ్మకమయిన సంబంధాలను అనుమతించకుండుట”
“మంచి, చెడులను ఒకదానికొకటి
సమాంతరంగా తీసుకువచ్చుట”
“నా పరిపాలనలో ఎవరయితే తాము సన్యాసులమయ్యామని
(భగవంతుని అన్వేషణలో అన్నిటినీ త్యజించి) చెప్పుకుంటారో వారు అధికంగా సంపదను కూడబెట్టుకుంటారు. గృహస్థులు ఆకలితో చనిపోతారు”
“ఇపుడు మీరేమి ఆజ్ఞాపిస్తే అది చేస్తాను”
అన్నాడు కలియుగ్.
కలిపురుషుడు చెప్పినదంతా విన్న తరువాత గురునానక్ చాలా సంతోషించి
ఇలా అన్నారు.
“ సత్యయుగంలో లక్ష సంవత్సరాలలో జరిగిన దానికి సమానంగా నీ పాలనలో భగవంతుని కీర్తించడం అనేకరెట్లు పెరుగుతుంది. ఫలితం లబించడానికి త్రేతాయుగంలో పదివేల సంవత్సరాలు, ద్వాపర యుగంలో వేయి సంవత్సరాలు పడితే, నీపరిపాలనలో ఉన్న ఈ కలియుగంలో భగవంతుని స్తుతిస్తూ కీర్తించడం వల్ల ఎంతో పుణ్యం లబిస్తుంది. గడచిన మూడు యుగాలలో అటువంటి పుణ్యాన్ని పొందేందుకు అన్ని సంవత్సరాలు పడితే, ఈ కలియుగంలో చాలా తక్కువ సమయంలోనే పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఆనందాన్ని పొందడానికి సాధ్యపడుతుంది. ఎవరయితే ప్రేమతోను, భక్తితోను భగవంతుని గుణగణాలను కీర్తిస్తూ ఉంటారో వారు ఈ సంసారమనే సముద్రాన్ని చాలా సులభంగా దాటగలరు. నువ్వు ఇవ్వజూపే ఆభరణాలను సంపదను నేను స్వీకరించాలనే పట్టుదలతో నువ్వు ఉన్నట్లయితే, ఆతరువాత నేను నాలుగవ గురువుగా వీటినన్నిటినీ స్వీకరిస్తాను. (కలిపురుషుడు ధనము/బంగారము వంటివాటిని ఇవ్వ చూపినవే నేటి గోల్డెన్ టెంపుల్).
ఇది వినగానే కలిపురుషుడు ఎంతో ఆనందపడ్డాడు. అతను గురునానక్ కు శిరసు వంచి నమస్కరించి “మీ ఆదేశాలను
పాటించేవారి వద్దకు నేను వెళ్ళను” అన్నాడు
కలిపురుషుడు ఆవిధంగా ప్రత్యేకమయిన సదుపాయాన్ని కలిగించి అదృశ్యమయ్యాడు. ఆతరువాత గురునానక్ ప్రపంచమానవాళిని ఉధ్ధరించడానికి
తన ప్రయాణాన్ని కొనసాగించారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పనమస్తు)
0 comments:
Post a Comment