08.12.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు పంపించిన ఆమె స్వీయ అనుభవాన్ని ప్రచురిస్తున్నాను.
"ఓం సాయి రాం." సాయి బంధువులు అందరికి..ఇప్పుడు నేను రాసె బాబావారి లీల నా జీవితం లోనే జరిగిందని చెప్పడానికి నేను ఎంతో సంతోషం పడుతున్నాను.
అది ఈ దీపావళి రోజున జరిగింది. నేను మా వారిని తీసుకొని ఒక నాచురోపతి ఆస్పత్రికి వెళ్ళాను. అది భువనేశ్వర్ నుండి 30 కి.మీ. దూరంలో ఉంది. ఎలాగైనా మా వారిని బాగుచేయాలన్న తాపత్రయంతో వెళ్ళాను. మా వారు పేరాలిసిస్ తో బాధపడుతున్నారు. రెండు రోజులు వైద్యం చేశారు. అక్కడ మా వారికి నచ్చలేదు.
భోజనం సరిగా
లేదు. ఆయన చాలా బలహీనపడిపోయారు.



