08.12.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు పంపించిన ఆమె స్వీయ అనుభవాన్ని ప్రచురిస్తున్నాను.
"ఓం సాయి రాం." సాయి బంధువులు అందరికి..ఇప్పుడు నేను రాసె బాబావారి లీల నా జీవితం లోనే జరిగిందని చెప్పడానికి నేను ఎంతో సంతోషం పడుతున్నాను.
అది ఈ దీపావళి రోజున జరిగింది. నేను మా వారిని తీసుకొని ఒక నాచురోపతి ఆస్పత్రికి వెళ్ళాను. అది భువనేశ్వర్ నుండి 30 కి.మీ. దూరంలో ఉంది. ఎలాగైనా మా వారిని బాగుచేయాలన్న తాపత్రయంతో వెళ్ళాను. మా వారు పేరాలిసిస్ తో బాధపడుతున్నారు. రెండు రోజులు వైద్యం చేశారు. అక్కడ మా వారికి నచ్చలేదు.
భోజనం సరిగా
లేదు. ఆయన చాలా బలహీనపడిపోయారు.
దీపావళి పండుగ రోజు నాతో “నేను ఇక్కడ ఉండను, నాకు నచ్చలేదు" అన్నారు. నాకు మావారి మీద చాలా కోపం వచ్చింది. మనసులో చాలా బాధపడ్డాను. ఇంక ఇంత అశాంతిలో సాయిగాయత్రీ మహామంత్ర జపమే శాంతిని కలిగిస్తుంది అని,జపమాల తీసుకొని బయటకు వచ్చేసాను. ప్రశాంతమైన వాతవరణంలో హాయిగా జపం చేసుకుందాం, అని జపం మొదలు పెట్టాను.
ఏ మనిషికయినా శాంతి మనసులో నుంచి రావాలి కానీ బయట ఎక్కడో దొరుకుతుంది అంటే అది సర్వం కల్ల. అలాగే నాకు కలిగింది. మంత్రాన్నయితే జపిస్తునాను కానీ బాబాను ప్రశ్న వేస్తున్నాను" బాబా,నువ్వు నిజంగా దైవానివే అయితే నాకు ఏదో ఒక విధంగా ఇప్పుడే నిరూపించు. ఇప్పుడే కావాలి నాకు. చాలా విసిగి పోయినాను కష్టాలతో, ఆయనకు బాగాలేదు, పిల్లలు మాట వినరు, అన్నివిధాలుగా నేను విసిగిపోయినాను, ఎక్కడ వున్నావు స్వామి" అని రకరకాలుగా వేదన పడుతున్నాను. జపం ఏదో మూడు మాలలు కానిచ్చి గదికి తిరిగి వచ్చాను. మా అబ్బాయి “అమ్మా, నీకేదో ఫోన్ వచ్చింది,నాలుగు missed కాల్స్ ఉన్నాయి,చూడు" అని ఫోన్ ఇచ్చాడు. నేను ఎవరో సాయిగాయత్రీ వాళ్ళు అయివుంటారు.. అని ఆ వచ్చిన నంబర్ కి తిరిగి ఫోన్ చేసాను. అప్పుడు "పూణే బాబా మందిరం నుంచి ఒక బాబాను మాట్లాడుతున్నాను "మాధవీ, ఈసారి సాయిగాయత్రీ చేయడానికి ఎందుకు రాలేదు (క్రితం సంవత్సరం చేసాను), మీవారికి బాగా అవుతుంది అని బాబా చెబుతున్నారు, ఎంతో స్థిరమైన భక్తురాలివి, అస్థిరం అవ్వకు, బాబా చూస్తున్నారు, సమయం వచ్చినప్పుడు అన్ని బాగుచేస్తారు" అని చెప్పి, నన్ను మాట్లాడనివ్వలేదు...ఫోన్ పెట్టేసారు. కొంచెంసేపు నాకు అయోమయం అనిపించింది. మళ్ళీ కాల్ చేసాను,ఎవరు? ఏమిటి? కనుక్కుందామని..చూస్తే "this number does not exist" అని వచ్చింది. అంతా రెండు నిమిషాలలో జరిగిపోయింది..ఆ ముసలాయన ఎవరో తెలియదు.నా ఫోన్ నెంబర్ ఎవరిచ్చారో తెలీదు..అప్పుడు గుర్తువచింది, బాబాను ఆడిగానుకదా," నువ్వు ఉన్నావని నిరూపించు" అన్నాను కదా.. బాబా అలా నిరూపించారు. భరించలేని కష్టం వచ్చినప్పుడు మనం కూడా భగవంతునికి పరీక్ష పెడతాం మనకు తెలీకుండానే. ఆయన అందరికి ఏదో ఒక విధంగా సమాధానం చెప్తూ ఉంటాడు. మన మనసులకు స్వాంతన కలిగిస్తూవుంటాడు.

మేము అంటే, విశ్వసాయి ద్వారకామాయి.. విశ్వశాంతి కోసం చేసే ఈ మహాయజ్ఞం డిసెంబర్ 12వ.తారీకుతో పరిసమాప్తి అవుతుంది. అందరూ ఆహ్వానితులే. అడ్రెస్ కింద జాతచేస్తున్నాను. మీరు వచ్చి ఆ సాయిగాయత్రీ అమ్మవారి, బాబా వారి ఆశీస్సులు తీసుకోవాలని మా ఆకాంక్ష..
" సర్వం సాయి నాధార్పణమస్థు"
విశ్వసాయి ద్వారకామాయి శక్తి పీఠమ్ వారు శ్రీ షిరిడీ సాయి గాయత్రి దత్తాత్రేయ శాంతి హోమమ్ జరుగు స్థలము వివరములు... అందరూ ఆహ్వానితులే...
గురూజీ లక్ష్మోజీ వెంట్రప్రగడ , హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో డిసెంబరు 12 వ.తారీకున జరుగబోవుచున్నది.
హోమము, మంత్ర జపము, ఆరతి, అన్నదానములు జరుగును.
జరుగు స్థలము. శ్రీ ద్వారకామాయి షిరిడీ సాయిబాబా ఆలయమ్, వైష్ణవి టెంపుల్ వెనుక వైపు,
రామోజీ ఫిల్మ్ సిటీ ప్రధాన ద్వారము ప్రక్కన,
అబ్దుల్లపూర్ మెట్ గ్రామము, మండలం,
హైదరాబాద్
(సర్వం శ్రీసాయినాధాప్రణమస్తు)
శ్రీమతి మాధవిగారు పంపించిన సందేశం యధాతధంగా...

Dear Sai Bhandhus ,
On the auspicious day of Datta Jayanthi, Viswa Sai Dwarakamai Shakthi Peetam will be performing Sri Shirdi Sai Gayatri Dattatreya Shanti Homam under the guidance and presence of Guruji Sri Laxmoji Ventrapragada in Hyderabad, India on Dec 12th 2019 as a concluding event for World Peace and Human Well-being.
Homam will be followed by chanting, aarthi, and Annadanam.
Annadanam will be done on a grandeur scale serving food to the absolute Destitute and Needy (including Human- Old, Orphan, Disabled, Animals-Grass feeding for Cows
etc.).
Venue: Sri Dwaraka Shirdi Sai Baba Alayam, Vaishnavi Temple back side, Near Ramoji Film City main entrance, Abdullapurmet Village & Mandal, Hyderabad.
Please forward this message to your friends and family who live in, near or around Hyderabad or anyone who can make it to the event.
Humble appeal to all Sai devotees/Sai Sevaks/Sai disciples to par take in this divine and blissful event 🕉 for Sri Sai Bhagwan’s divine blessings.
Sai Ram
SaI Sevaks
0 comments:
Post a Comment