08.12.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 9 వ.భాగమ్
23. సాయిబానిస గోపాలరావు రావాడగారు 1989 లో శ్రీషిరిడీసాయి భక్తులుగా మారి షిరిడీ దర్శించుకొన్నారు. కాని ఆయన సాయి అంకితభక్తుడు అయిన శ్రీ ఎక్కిరాల భరద్వాజగారిని దర్శించుకోలేదని ఈనాటికీ బాధపడుతున్నారు. బాబా ఆయన బాధను అర్ధము చేసుకొని 29.10.2019 నాడు తెల్లవారు జామున శ్రీఎక్కిరాల భరద్వాజగారిని చూపించి, ఇతడు నా అంకితభక్తుడు.
నీవు వానిని దర్శించుకోలేదని బాధపడుతున్నావు. ఇప్పుడు వానిని చూడు అతను తన జీవిత గమ్యానికి చేరడానికి సిధ్ధపడి ధ్యానముద్రలో ఉన్నాడు.
శ్రీ ఎక్కిరాల భరద్వాజగారు తన జీవిత ఆఖరి రైలు ఎక్కడానికి రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫారమ్ మీద బెంచీమీద కూర్చొని తన రైలు కోసం ఎదురు చూస్తున్నారు. సాయిబానిసగారు వారి ధ్యానాన్ని భంగపరచకుండా ఆయన సమీపానికి వెళ్ళి దూరమునుండే వారికి సాష్టాంగనమస్కారము చేసారు. ఆ తర్వాత రైలు వచ్చింది. శ్రీఎక్కిరాల భరద్వాజగారు రైలు ఎక్కి మనందరికి అందని దూరానికి వెళ్ళిపోయి శ్రీసాయిబాబాలో ఐక్యమయిపోయారు. ఈ విషయాలు సాయిబానిసగారు నాకు టెలిఫోన్ లో చెబుతుంటే నాకు ఆనందం కలిగింది.
24. కాలచక్రంలో షిరిడీ
సాయిబానిసగారు 2000వ.సంవత్సరంలో ఆఖరిసారిగా షిరిడీ వెళ్ళి బాబావారి దర్శనం చేసుకొన్నారు. తిరిగి తాను ఎప్పుడు షిరిడీని దర్శించుకొంటాను అని ఆయన బాబాను ధ్యానంలో ప్రశ్నించినపుడు బాబా ఇచ్చిన సమాధానం వివరాలు మీకు తెలియచేస్తాను.
“నీవు 1916 నాటి షిరిడీయొక్క ఫోటోలు చూసావు. ఆనాటి షిరిడీ ఒక చిన్నపల్లెటూరు. కాని నీవు ఆఖరిసారిగా 2000 సంవత్సరంలో షిరిడీ చూశావు. అది ఒక పట్నముగా రూపొంది కళకళలాడుతోంది.
నీవు వచ్చే జన్మలో అనగా 2070 వ.సంవత్సరంలో షిరిడీ వచ్చి నాదర్శనం చేసుకొంటావు. 2070 నాటికి నాభక్తుల కోరికపై షిరిడీ సంస్థానమువారు నా భక్తుల దర్శనార్ధము భూగృహములోని నాసమాధి దర్శనానికి ఏర్పాట్లు చేస్తారు. 2070 నాడు షిరిడి ఒక మహాపట్నముగా మారుతుంది. బూటీవాడలోని నాసమాధి మందిరం గోపురం బంగారు రేకుతో తాపడం చేస్తారు. షిరిడీలో దూరదర్శన్ కేంద్రము ఏర్పాటు చేస్తారు.
నాభక్తులు షిరిడీకి ప్రతిరోజు విమానములలోను, రైళ్ళలోను, వస్తూ ఉంటారు. షిరిడీ సంస్థానంవారు ఉచిత భోజనసదుపాయాలు, ఉచిత వైద్య సదుపాయాలు షిరిడీ పట్టణవాసులకు ఉచిత విద్యాసౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. షిరిడీ, ప్రపంచంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రముగా మారుతుంది. నీవు 2070 లో షిరిడీకి శ్రీసాయి కృపానంద్ పేరిట వచ్చి దేశవిదేశాలలో నాతత్త్వప్రచారం చేస్తావు. అంతవరకు ఓపికతో ఉండు. నిన్ను మరుజన్మలో కలుస్తాను.”
(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment