06.12.2019 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
షిరిడీలో నివసిస్తున్న ఒక డాక్టర్ గారి అత్యద్భుతమయిన అనుభవాన్ని శ్రీమతి మాధవి గారు భువనేశ్వర్ నుంచి పంపించారు. ఈ అనుభవాన్ని మీరుకూడా చదివి ఆనందించండి.
" ఓం సాయి రాం" సాయి భక్తులందరికి. ఇప్పుడు Dr రుస్తుంజి షిర్డీ..నుంచి తనకు బాబా తో కలిగిన
అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
నేను ఒక హోమియోపతి డాక్టర్ ను. షిర్డీలోనే ఒక క్లినిక్ పెట్టుకున్నాను. నాకు సాయిబాబా మీద చాలా నమ్మకం ఉన్నా ఇలాంటి
అనుభవాన్ని
ఆ దేవదేవుడు
నాకు కలిగిస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ బాబా ఎందరినో, ఎన్నో రకాలుగా రక్షిస్తున్నాడు. తన చెంతకు చేర్చుకుంటున్నాడు. సప్తసముద్రాల ఆవలి తీరంలో ఉన్నా వాళ్ళను కూడా పిచ్చుక కాలికి దారం కట్టి
లాగినట్లు షిర్డీ వైపుకు లాగుతున్నారు బాబా. కానీ ఇక్కడే
షిరిడీలోనే ఉన్న నాకు
ఇలాంటి అనుభవాన్ని కలిగించి ,మనసా,వాచా,కర్మణా తనవైపు లాగుతాడని అస్సలు ఊహించలేదు.
ఒక పచ్చి నిజం చెప్పనా! షిర్డీ లో ఉండేవారు అందరూ బాబా భక్తులు కారు. కొందరు వ్యాపారం కోసం, కొందరు వృత్తి కోసం కొందరు వాళ్ళ,వాళ్ళ అవసరాల కోసం ఉంటారు. నేను కూడా అలాగే ఒక హోమియోపతి క్లినిక్ తెరుచుకొని వచ్చే పోయే యాత్రికులు ఎక్కువ ఉంటారని, నా క్లినిక్ బాగా నడుస్తుందనే భావంతో షిర్డీలో ఉన్నాను.
ఒక పచ్చి నిజం చెప్పనా! షిర్డీ లో ఉండేవారు అందరూ బాబా భక్తులు కారు. కొందరు వ్యాపారం కోసం, కొందరు వృత్తి కోసం కొందరు వాళ్ళ,వాళ్ళ అవసరాల కోసం ఉంటారు. నేను కూడా అలాగే ఒక హోమియోపతి క్లినిక్ తెరుచుకొని వచ్చే పోయే యాత్రికులు ఎక్కువ ఉంటారని, నా క్లినిక్ బాగా నడుస్తుందనే భావంతో షిర్డీలో ఉన్నాను.
నేను ఒక పార్టీ వాళ్ళ దగ్గర 300 రూపాయలు అప్పు తీసుకున్నాను చాలా రోజుల కిందట. ఒకరోజు నేను నా క్లినిక్ లో ఉండగా వాళ్ళు వచ్చి ఆ 300 రూపాయలు ఇవ్వమని అడిగారు. ఆసమయంలో నా దగ్గర అప్పుడు డబ్బు లేదు. అందుకని చెక్కు మీద సంతకం పెట్టి ఇచ్చాను. వాళ్ళు చెక్కు తీసుకొని వెళ్లిపోయారు. తరువాత ఇంటికి వచ్చి పాస్ బుక్ చూసుకున్నాను. దానిలో 100 రూ. మాత్రమే ఉన్నాయి." అయ్యో,వాళ్లకు,300 రూపాయలకు చెక్కు ఇచ్చాను, చూస్తే 100రూ. ఉన్నాయి, చెక్కు బౌన్స్ అవుతుందేమో, నాకు ఒక డాక్టర్ గా ఎంతో చెడ్డపేరు
వస్తుంది"అనుకొని చాలా బాధపడ్డాను. అప్పుడు నా దృష్టి బాబా వైపు మళ్ళింది. అంతవరకు రాని ఆలోచన అప్పుడు వచ్చింది. అందుకేనేమో
భగవంతుడు మనుషులకు కష్టాలు ఇస్తాడు. అప్పుడైనా ఆ విధాతను గుర్తు చేసుకుంటామని. " బాబా,నన్ను ఈ అపవాదు నుంచి రక్షించు" అని
సమాధి మందిరం వైపు పరుగు పెట్టాను. ఇలా నాలుగు రోజులు గడిచింది.
ఒకరోజు ,ఒక వ్యక్తి నన్ను కలవడానికి వచ్చాడు. " నేను ఒక
చిన్న పేకెట్ నీ దగ్గర పెట్టనా! అని అడిగాడు. " దానిలో
ఏముంది?"
అని
ఆశ్చర్యంతో అడిగాను. ఈ పాకెట్ లో 300 రూపాయలు ఉన్నాయి అని అన్నాడు. ఇంక నేను ఉండబట్టలేక " మీకు భ్యంతరం లేకపోతే, నేను ఆ డబ్బు వాడుకోవచ్చా? అని అడిగాను. ఆ వ్యక్తి “వాడుకోండి,నేను మళ్ళీ మూడు నెలల తరువాత వస్తాను”..అని చెప్పి
వెళ్లిపోయాడు.
నేను వెంటనే బ్యాంక్ కు పరుగులు పెట్టాను. 300 రూపాయలు అకౌంట్ లో వేసాను. అప్పటికి నేను చెక్కు ఇచ్చిన వాళ్ళు వచ్చి ఇంకా డబ్బు తీసుకోలేదు." భగవంతుడా..రక్షించావు..అనుకున్నాను.
మూడు నెలలు గడిచాయి..ఆ వ్యక్తి రాలేదు..ఆరు
నెలలు గడిచిపోయినాయి." ఏమైవుండవచ్చు? అతను ఎందుకు రాలేదు? మర్చిపోయినాడా? ఇలా నా మనసు అనేక రకాలుగా పరుగులు పెట్టింది. ఎక్కడ ఉంటాడో కూడా తెలీదు. ఒకరోజు అతను నాకు రోడ్డుమీద వెడుతూవుంటే కనపడ్డాడు. నేను వెంటనే అభివాదం చేసి, మీరు, నా దగ్గర ఉంచిన 300 రూపాయల కోసం ఎందుకు రాలేదు.మర్చిపోయినారా! అని
అడిగాను. అతను ఆశ్చర్యంగా నా వైపు చూసి, నేను నీకు ఎందుకు డబ్బులు ఇస్తాను? మీరు ఏ డబ్బు గురించి మాట్లాడుతున్నారు? నాకేమి అర్థం కావటం లేదు.." అన్నాడు. నేను ఆయన తమాషా చేస్తున్నాడు..అనుకున్నాను. కానీ ఆయన నిజమే చెప్పినట్లు అక్కడ నుంచి
వెంటనే ఏమి మాట్లాడకుండా వెళ్లిపోయాడు. అప్పుడు నాకు అర్థం అయింది." ఇది ఆ దివ్యమైన సాయి లీల..అని..ఓహో..ఇలాంటి లీలలు ఆయన సప్తసముద్రాల అవతల కూడా
చేస్తున్నాడు. అందుకే షిర్డీలో జనప్రవహం చాలా పెరిగింది..అనిపించింది. అందుకే ప్రజలు,బీద,ధనిక,రోగం,భోగం..ఏమి లెక్కచేయకుండా షిర్డీ వైపు పరుగులు
పెడుతున్నారు" అనుకోని ఆ సాయి నాధుడికి సర్వస్య శరణాగతి చేసుకున్నాను
Dr రుస్తుంజి..షిర్డీ
"సర్వం సాయి నాధార్పణమస్థు"
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment