20.05.2021 గురువారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయిలీల ద్వైమాస పత్రిక మే – జూన్, 2011 వ.సం. సంచికలో ప్రచురింపబడిన మరొక అధ్భుతమయిన
ఊదీ యొక్క మహిమను ఈ రోజు ప్రచురిస్తున్నాను.
బహ్రైన్
లో ఊదీ అధ్బుతమ్
సాయిబాబా
తన ప్రేమను అనేకవిధాలుగా ప్రదర్శిస్తూ ఉంటారు.
అటువంటి
అనుభవాలెన్నో జరిగినవాటిలో నా హృదయానికి అమితంగా ఆకట్టుకున్న అధ్భుతమయిన లీలని ఈ రోజు
వివరిస్తాను.
2005వ.సం.లో
నా భర్తకు సర్జరీ జరిగిన తరువాత జీవితం ఎప్పటిలాగా సాగలేదు. నా భర్తకు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది. భగవంతుని దయవల్ల ఆట్యూమర్ ని తీసివేసారు. కాని మా జీవితాలు మాత్రం ఒడిదుడుకులకు లోనయింది. నా భర్త ఇక జీవితాంతం స్టెరాయిడ్స్ మీద, హార్మోన్
ఇంజక్షన్ ల మీద ఆధారపడి జీవించాల్సిందేనని వైద్యులు చెప్పారు.
ప్రతిరోజు
భగవంతుడు జీవితాన్ని ప్రసాదించిన రోజుగా ఎన్నోరోజులు భావిస్తూ వచ్చాము.
మేము
బహ్రెయిన్ లో ఉంటున్నాము. ఆగష్టు నెలలో పాఠశాలలకు
శలవులు ఇస్తారు. ఆవిధంగా 2007వ.సం.లో శలవుల
కారణంగా మా ఇద్దరు పిల్లలు టెలివిజన్ చూడటం, పుస్తకాలు చదవడం, ఆర్ట్ వర్క్, దెబ్బలాడుకోవడాలు
వీటన్నిటితోను విసుగెత్తిపోయారు. ఒకసారి మా
పొరుగింటామె (ఆంటీ) తన మరదలితో మాఇంటికి వచ్చింది.
వారిద్దరూ
కూడా చిన్మయి మిషన్ లో తమ జీవితాన్ని అధ్యాపకవృత్తికే అంకితం చేసారు. మా పిల్లలిద్దరూ ఏపనీ లేకుండా సోమరిగా అల్లరిచేస్తూ
ఉండటం చూసి వారిద్దరూ, “మీ పిల్లలను మాఇంటికి ఎందుకు పంపకూడదు? మేము వాళ్ళిద్దరికి చిన్నచిన్న భజనపాటలు నేర్పుతాము”
అన్నారు. వారి మాటలు విన్న తరువాత నాకు కూడా
సంతోషమనిపించింది.
మా
పిల్లలిద్దరూ భజనపాటలు నేర్చుకోవడమే కాకుండా కాస్తంత బుధ్ధిగా ఆకొత్తదనంలో మునిగి ఉంటారనిపించింది.
పిల్లలిద్దరూ
పాటలు నేర్చుకుని ఇంటికి వచ్చిన తరువాత వారు నేర్చుకున్న పాటలను పాడమని అడిగేదానిని. వాళ్ళు చక్కని పాటలను శ్రావ్యంగా పాడుతూ ఉంటే నాకు
కూడా ఆపాటలు నేర్చుకోవాలనిపించింది. నేను నాకోరికను
మాఇంటికి వచ్చిన ఇద్దరు ఆంటీలకి చెప్పాను.
వాళ్ళు కూడా చాలా ఆనందంతో పొంగిపోయి నన్నుకూడా తమ ఇంటికి భజనపాటలు నేర్చుకోవడానికి
రమ్మని ఆహ్వానించారు. రెండురోజుల తరువాత మా
పొరుగింటామె నాకు ఇంకా పెద్దపెద్ద పాటలు నేర్పుతానని చెప్పింది. అందుచేత నన్ను ఉదయం వేళ తన ఇంటికి రమ్మని, పిల్లలను
మధ్యాహ్నంపూట రమ్మని చెప్పింది. మేము నలుగురం
ఆడవాళ్ళం ఆంటీ ఇంటికి అభంగాలను నేర్చుకోవడాని వెళ్లడం మొదలుపెట్టాము. (అభంగాలు – పూర్వం యోగులు మరాఠీ భాషలో రచించినటువంటి
భక్తి గీతాలు)
అస్థిమితంగా
ఉన్న నామనసుని మళ్ళించడానికి ఇది నాకు అధ్బుతమయిన అవకాశం. పాటలు నేర్చుకునే అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టం
లేక, రోజూ ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా నా ఇంటిపనులన్నీ పూర్తి చేసుకునేదానిని.
కొన్ని
రోజుల తరువాత మాఇంటికి వచ్చే ఆంటీ తాను దేవాలయంలో ఒక కచేరీని పెడదామనుకుంటున్నట్లు
చెప్పింది. “భగవంతుని సన్నిధిలో కచేరీ చేసే
భాగ్యం మాకు ఉందా” అని కాస్త సంశయంగానే అడిగాను.
ఆంటీ అనుకూల ఆలోచనలతోనే ఉంది. దేవాలయంలో
పాటలుపాడే అదృష్టం మాకు లభిస్తుందనే చెప్పింది.
ఇలా
ఉండగా దురదృష్టం మరొకసారి వెంటాడింది. నా భర్త తన ఎడమకాలి పాదంలో నొప్పిగా ఉందని అన్నారు. ఆనెప్పికి కారణం పాదంలో ఏర్పడిన గడ్డ కనిపించింది. అది రోజురోజుకూ పెద్దదవుతూ ఉంది. సోనోగ్రఫీ చేయించిన తరువాత వైద్యులు దానికి సర్జరీ
చేయాలని అన్నారు. సుగర్ లెవెల్స్ చాలా అధికంగా
ఉండటం వలన ముందుగా దానిని అదుపులో పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. లేనట్లయితే నయం కావడానికి చాలా కాలంపడుతుందని అన్నారు. నేను ప్రతిరోజు కాలికి మర్ధనా చేస్తూ ఉండేదానిని
దానివల్ల కాలికి బాగా నెప్పిగా ఉండేది. ఆనెప్పి
వల్ల నిద్రకుడా పట్టేది కాదు. కాలికి బూటు
తగిలినా విపరీతమయిన బాధ కలిగేది.
రోజులు
ఇలా గడుస్తూ ఉండగా ఒక సాయిభక్తుని ఇంటిలో ఒక అధ్బుతం జరిగిందని విన్నాము. బాబా ఫోటోనుండి ఊదీ రాలిపడుతోందని చెప్పారు. కాని నాలో సంశయం ఉండటం వల్ల ఆవిషయాన్ని నేను నమ్మలేదు.
“ఇది నిజమయి ఉండదు. బహుశ ఆఫొటో చాలా పాతదయి
ఉండచ్చు. అందుచేత లోపల ఉన్న ఫోటో కాగితం పాటబడినందువల్ల పొడిపొడిగా అయిపోయవడం గాని, లేక దానికి ఉన్న ప్లాస్టర్ ఊడిపోయి బయటి ఫ్రేమ్ పొడిపొడిగా రాలుతూ ఉందేమో” అని ఆలోచించాను. కాని నాకళ్ళతో నేను స్వయంగా చూసినప్పుడు నన్ను నేనే
నమ్మలేకపోయాను. నేను చూసిన దృశ్యాన్ని కూడా
అసలు జీర్ణించుకోలేకపోయాను. నిజామా? ఫొటోక్రింద
బాబా పాదాలవద్ద బూడిద రంగులో ఉన్న ‘ఊదీ’ అంటుకుని ఉంది. ఫోటో స్టాండు మీద ఊదీ చిన్న కొండలా పేరుకుని ఉంది. మా ఆంటి మాకు నేర్పిన అభంగాలలో ఒకటి పాడమని సైగ
చేసారు. మిగతా ఆడవారు, ఆంటీ అందరూ పాడటం ప్రారంభించాము. కాని, ఆ అధ్భుతాన్ని వీక్షించిన నాకు, నా గొంతు
మూగబోయింది. ఒకటే ఆనందం ఉప్పెనలాగా నన్ను కమ్మేసింది. నా నోటంబట ఎటువంటి మాటలు రావడంలేదు. నాకు ఆ అధ్భుతాన్ని చూసే అదృష్టాన్ని కలిగించిన
బాబాకు నా కన్నీటినే కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించాను. నాకళ్ళంబట కన్నీరు కారడం ఆగటంలేదు. ఆయన లీలని సందేహించినందుకు నా కళ్ళు క్షమాపణ కోరుకుంటున్నాయా
అన్నంతగా కన్నీరు కారుతూనే ఉంది.
అక్కడ
ఉన్న మాకందరికీ చిటికెడు ఊదీని పంచారు. నాకు
పంచిన ఊదీని చూడగానే “ఈ కాస్తంత ఊదీ మాకుటుంబానికంతా ఎలా సరిపోతుంది” అని చాలా ఆశ్చర్యపోయాను. మరికాస్త ఇవ్వమని కూడా అడగలేకపోయాను. నేనొక్కదాన్నే కాదు భక్తురాలిని. వచ్చినవారందరూ బాబా అనుగ్రహం కోసం, ఊదీ కోసం వచ్చినవాళ్ళే.
ఇంటికి
రాగానే నా భర్త నుదిటిమీద బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేసినచోట మచ్చ ఉంది. ఊదీని ఆ మచ్చమీద రాసాను. చేతి వేలి కొనలమీద అంటుకుని ఉన్న కాస్త ఊదీని కాఫీలో
చల్లాను. ఇకా మరికాస్త మిగిలిన ఊదీ నా వేలికొనమీద
అంటుకుని ఉంది. “ఓమ్ సాయినాధానయనమః’ అని స్మరిస్తూ ఆ మిగిలిన శేషభాగాన్ని నా భర్త కాలిమీద
పెరుగుతూ ఉన్న గడ్ద మీద రాసాను. సాయంత్రం మా
పిల్లల నుదుటిమీద ఊదీ రాసిన తరువాత మరొకసారి నా భర్త కాలిమీద రాసాను. ఊదీ పూర్తయిపోయేంత వరకు నేనెంతో భక్తితో రాసాను.
నాకు
మరికొంత ఊదీని ఇచ్చారు. మరలా అదే విధంగా ఊదీని
రాసాను. ఒక వారం గడిచింది. నేను, నాభర్త ఇద్దరం కాలిమీద గడ్డగురించి పూర్తిగా
మర్చిపోయాము. నా భర్త తన కాలి బాధ గురించి
చెప్పకపోవడం వల్ల నాకు కూడా ఆయన కాలి బాధగురించి అడగాలనే ఆలోచనే రాలేదు. రెండువారాల తరువాత ఒకరోజు మిగిలిన ఆఖరి ఊదీని నా
భర్త కాలికి రాస్తూ ఎలా ఉంది ఇపుడు అని హటాత్తుగా ప్రశ్నించాను. “హే సుభాష్, నిన్ను అడగటమే మర్చిపోయాను. ఇపుడు నీ కాలినొప్పి ఎలా ఉంది?” అప్పుడు మేమిద్దరం కాలివైపు చూసాము. మేమిద్దరం మా కళ్లని మేమే నమ్మలేకపోయాము. కాలి మీద గడ్డ లేదు. కాలిని బాగా పరీక్షీచి చూసాము. మొత్తం గడ్డ మాయమయియింది. చాలా అధ్భుతం జరిగింది. సర్జరీ చేయవలసిన దానికి బాబా తన ఊదీ ద్వారా నయం
చేసారు.
నా
భర్త ఆరోగ్య పరిస్థితిని కూడా బాబాయే కనిపెట్టుకుని నయం చేస్తున్నారని నా ప్రగాఢమయిన
నమ్మకం. ఇక తన శరీరం యధావిధిగా పని చేయడానికి,
సాఫీగా సాగడానికి ఇక ఎటువంటి మందుల మీద ఆధారపడవలసిన అవసరం లేదని నా నమ్మకం. బాబా చూపించిన ఈ అధ్బుత లీలకి శ్రధ్ధ,సబూరీలతో నేను
ఆయననను ప్రార్ధించుకుంటూనే ఉంటాను.
ఓమ్
శ్రీ సాయినాధాయనమః శ్రీమతి శిల్పా షెనాయ్
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
1 comments:
sai naku ichina prasadanni nuvve kapadali thandri . om sairam 🙏🙏🙏
Post a Comment