18.05.2021 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సమాధి
మందిరాన్ని చూడాలనే కోరిక – అధ్భుతమయిన లీల
సాయిలీల
ద్వైమాసపత్రిక మే – జూన్, 2011 వ. సంవత్సరంలో ప్రచురింపబడిన మరొక అధ్భుతమయిన బాబా లీల
ఈ రోజు ప్రచురిస్తున్నాను.
బాబాని
మనం మనఃస్ఫూర్తిగా వేడుకోవాలే గాని ఆయన మన విన్నపాన్ని మన్నించి మన కోరికను తీర్చకుండా
ఉంటారా? కాని మనం కోరుకునే కోరికలు కూడా సహేతుకమయినవే
అయిఉండాలి తప్ప మన స్వార్ధం కోసం కోరుకునేవిగా ఉండకూడదు. మనకేది మంచిదో బాబాకు తెలియవా? ఇక ఈ అధ్భుతమయిన లీల చదవండి.
బాబా
ఎంతో అందమయిన లామినేషన్ చిత్రరూపంలో విచిత్రంగా నావద్దకు ఏవిధంగా వచ్చారో, బాబా దీవెనలతో
మీ కందరికీ వివరిస్తాను.
మాస్టర్స్ డిగ్రీ చేయడానికి 2004వ.సం. లో నేను అమెరికాకు వచ్చాను. నా దగ్గర ఉన్న బాబా ఫోటోకి నేను ప్రతిరోజు సాయంత్రం ఆరతి ఇస్తూ ఉంటాను. నా దగ్గర ఉన్న ఫొటోలో బాబా పూర్తిగా నిండయిన విగ్రహ రుపంలో లేరు. మోకాళ్ళవరకు మాత్రమే ఉంది.
ఒకరోజున ఆరతి ఇస్తున్న సమయంలో
సమాధి మందిరంలో ఉన్నటువంటి బాబాను దర్శించాలనే కోరిక పుట్టింది. అంటే షిరిడీలోని సమాధిమందిరంలో బాబా ఏవిధంగా మనకి
దర్శనమిస్తారో అదే విధంగా ఆయనను చూడాలనే నా కోరిక. “బాబా, ఇపుడు నా దగ్గర ఉన్న ఫొటో చాలా అందంగా ఉంది,
కాని అది పూర్తిగా నీ నిండయిన విగ్రహ రూపంలో లేదు. నాకు నీ సమాధిని నీ యొక్క పూర్తి రూపాన్ని చూడాలని
ఉంది.” ఈ విధంగా నా కోరికను బాబాకు విన్నవించుకొన్నాను. ఆ తరువాత ఆసంగతిని పూర్తిగా మర్చిపోయాను.
కొన్ని
రోజుల తరువాత, నేను అంతకుముందు నివాసం ఉన్న నా గదికి ఏవో కొన్ని వస్తువులు అక్కడే ఉండిపోతే
తెచ్చుకోవడానికి వెళ్లాను. తలుపు తాళంతీసి
గదిలోకి వెళ్ళాను. గదంతా ఎండిపోయిన ఆకులు చెల్లాచెదురుగా
పడిఉన్నాయి. గదంతా దుమ్ము. బొద్దింకలు తిరుగుతున్నాయి. గదిలో వదిలేసిన నా వస్తువులను తీసుకుని బయటకు వచ్చేద్దామనుకున్నంతలో
ఎందుకనో నాతోపాటే ఉన్న నా సహచరుని గదిని కూడా ఒక్కసారి చూద్దామనిపించింది.
నా
సహచరుని గదిలోకి వెళ్లగానే అక్కడ అలమారులో అందమయిన బాబా విగ్రహం, సమాధితో ఉన్న లామినేటేడ్
ఫొటో కనిపించింది. ఆఫొటో చూడగానే నా రోమాలు
నిక్కపొడుచుకున్నాయి. ఆఫోటో అందం నన్ను కట్టిపడేసింది. అందులో బాబా నవ్వుతూ ఎంతో మనోహరంగా కనిపిస్తున్నారు. కాలికి ఉన్న బూట్లు తీసేసి బాబావైపు చూస్తూ ఇలా
ప్రార్ధించాను, “బాబా ఇక్కడ నిన్ను చూసేవారు ఎవరూ లేరు. నువ్వు నాగదికి వస్తే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను”.
ఆఫొటోని
నాతోపాటు తెచ్చేసుకుందామనే ప్రగాఢమయిన కోరిక కలిగింది. కాని అది దొంగతనంగా తెచ్చుకోవడం అవుతుందనిపించింది. ముందుగా నా స్నేహితుని అడిగి అప్పుడు తెచ్చుకుందామనే
ఆలోచన వచ్చింది. అతను కూడా సాయిబాబా భక్తుడే. అతను కూడా ఈ ఫొటొను చూసినట్లయితే దానిని తనే తీసుకోవాలనుకుంటాడు. నిర్ణయమంతా బాబాకే వదిలేసి నాస్నేహితునికి బాబా
ఫొటో గురించి చెప్పాను. తన గదిలో బాబా ఫొటో
ఉందన్న విషయం వినగానే అతను చాలా ఆశ్ఛర్యపోయాడు.
తను గదికి వచ్చి చూసి అప్పుడు ఏవిషయం చెబుతానన్నాడు.
ఆఫొటో
నాదగ్గరకు వస్తుందనే ఆశ నాలో ఏమాత్రం లేదు.
ఆతరువాత గురువారంనాడు అతను నాదగ్గరకు వచ్చి ఆఫోటోను తీసుకోమని చెప్పాడు. తనదగ్గర అటువంటి ఫొటో ఎప్పుడూ లేదని, తన స్నేహితులు
కూడా ఎవరూ తనకా ఫొటో ఇవ్వలేదని చెప్పాడు. ఆఫొటో తన గదిలోకి ఎలా వచ్చిందో తనకే ఆశ్చర్యంగా
ఉందని అన్నాడు.
ఊహించని
విధంగా అత్యధ్బుతంగా బాబా ఆవిధంగా నాదగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదించారని నాకెంతో ఆనందం
కలిగింది. సాయి బంధువులందరికీ ఈ లీలను తెలియచేసే
అవకాశం బాబా నాకిచ్చినందుకు ఆయనకు నా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
మిధున్,
702, ఓల్డ్ సెట్లర్స్,
హోప్కిన్స్,
ఎమ్ ఎన్ 55343
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment