16.05.2021 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు మరొక అధ్భుతమయిన బాబా లీలను ప్రచురిస్తున్నాను. శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా, చాంద్ పాటిల్ యొక్క
తప్పిపోయిన గుఱ్ఱాన్ని ఏవిధంగా ఎక్కడ ఉందో చూపించారో మనకందరకూ తెలుసు. అదే విధంగా ఒక నాస్తికుడికి కూడా అతని గుఱ్ఱాన్ని
చూపించిన అద్భుత సంఘటన ఇది. శ్రీ సాయిలీల ద్వై
మాసపత్రిక మే – జూన్, 2011 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
పారిపోయిన
గుఱ్ఱమ్
చిన్నప్పటినుండి
నేను నాస్తికుడిని. భగవంతుడిని నమ్మడం కాని,
పూజించడం గాని ఇవేమీ నాకు అవసరం అనిపించలేదు. నా నాస్తికత్వం, నా ఆలోచనా విధానాలే నా జీవితంలో నేను
సాధించిన అభివృధ్ధికి కారణమనే నా అభిప్రాయం.
నవంబరు,
2వ.తారీకు, 1998 వ.సం. లో జరిగిన ఒక సంఘటన శ్రీ షిరిడీ సాయిబాబా మీద నాకు తిరుగులేని
విశ్వాసాన్ని కలిగించడానికి కారణమయింది. ఆయన
సర్వాంతర్యామి అని అప్పుడే నాకు అర్ధమయింది.
వివాహవేడుకలకి
నేను నా గుఱ్ఱాన్ని అద్దెకు ఇస్తూ ఉంటాను.
ఒకరోజున నేను నాపనంతా పూర్తి చేసుకుని రాత్రి గం. 11.30 కు ఇంటికి వచ్చాను. భోజనం చేసి నా భార్యతోను, కొడుకుతోను కాసేపు మాట్లాడి
నిద్రపోయాను. అర్ధరాత్రి గం. 12.15 కి మా సేవకుడు వచ్చి గుఱ్ఱం కట్టు త్రెంచుకుని
పారిపోయిందని చెప్పాడు.
వెంటనే
నా మోటార్ సైకిలు మీద దానిని వెతకడానికి బయలుదేరాను. నాలుగు గంటలపాటు వెదకినా ఎటువంటి ఫలితం కనిపించలేదు. పారిపోయిన నా గుఱ్ఱం గురించి ఎంతోమందిని అడిగాను
కాని ఎవ్వరూ తాము చూడలేదని చెప్పారు. నాలో
భయాందోళనలు కలిగాయి.
ఇక
నిరాశలో కూరుకుపోయిన నేను నాకు తెలియకుండానే అసంకల్పితంగా శ్రీ షిరిడీ సాయిబాబాను మనఃస్ఫూర్తిగా
ప్రార్ధించుకున్నాను. “బాబా తప్పిపోయిన చాంద్ పాటిల్ గుఱ్ఱాన్ని తిరిగి తెప్పించినట్లుగానే
నా గుఱ్ఱాన్ని కూడా తీసుకురా” అని వేడుకొన్నాను.
ఆవిధంగా
నేను బాబాను మనఃస్ఫూర్తిగా వేడుకున్న మరుక్షణమే, సామాన్యమయిన తెల్లని పంచె ధరించిన
ఒక వ్యక్తి కనిపించాడు. అతనిని పారిపోయిన నా
గుఱ్ఱం గురించి అడిగాను. అతను ప్రక్క వీధివైపు
చూపించి ఆవీధిలో ఒక కఱ్ఱ స్థంభానికి గుఱ్ఱం కట్టివేయబడి ఉంది” అని చెప్పాడు. గుఱ్ఱం పారిపోయిందనే ఆందోళనలో ఉన్న నాకు ఆవ్యక్తి
నాకొక దేవతలాగా, దేవదూతలాగ కనిపించాడు. తెల్లవారుజాము
మూడు గంటలకి వణుకుతున్న శరీరంతో, గుండెదడదడ కొట్టుకుంటూ ఉన్న స్థితిలో నిర్మానుష్యంగా
ఉన్న సందులోకి వెళ్లాను. ఆవ్యక్తి చెప్పిన
చోట కొయ్య స్థంభం దగ్గరకి చేరుకొన్నాను. అక్కడ
నా గుఱ్ఱాన్ని చూడగానే సంతోషంతో నాకళ్లనుండి ఆనంద భాష్పాలు కారాయి. నా గుఱ్ఱం
నాకు దొరికిందన్న సంతోషం నామనసుకు ఎంతో ఊరటను కలిగించింది. నావంటి భగవంతుని మీద నమ్మకమే లేని, నాస్తికుల మీద
కూడా ఆపరమేశ్వరుడు దయ చూపిస్తాడు. నాస్తికులకి తన మీద విశ్వాసం లేకపోయినా, తన శక్తిసామర్ధ్యాల మీద
ఆయన అస్థిత్వంమీద ఎటువంటి సంశయాలున్నా గాని భగవంతుడు అవేమీ పట్టించుకోడు.
ఈ
సంఘటన నాజీవితంలో పెద్ద మలుపు. ఇపుడు నేను
ప్రతి గురువారం శ్రీసాయిబాబా మందిరానికి వెళ్ళి ఆయనను దర్శించుకుంటూ ఉంటాను. ప్రతినెలా షిరిడికి వెళ్ళి వస్తూ ఉంటాను. నాజీవితం ఇంత అభివృధ్ధి, వైభవం చెందడానికి కారణం
అంతా ఆభగవంతుడయిన సాయిబాబాయే అని పూర్తిగా విశ్వస్తిస్తున్నాను.
వీరూ
సింధీ,
సింధూ
హీరానంద్ ఘోరీవాలా ప్రై.లి.
986,
లజపత్ రాయ్ మార్గ్,
రెడ్
ఫోర్ట్ ఎదురుగా,
న్యూ
ఢిల్లీ - 110 006
0 comments:
Post a Comment