15.05.2021 శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ
రోజు మరొక అధ్భుతమయిన బాబా లీల గురించి ప్రచురిస్తున్నాను. సాయి లీల ద్వైమాసపత్రిక మే – జూన్, 2011 వ.సంవత్సరంలో
ప్రచురింపబడింది.
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
సర్వాంతర్యామి - ఆర్తితో అర్ధిస్తే ఆదుకుంటారు
ఒకసారి
నేను దసరా శలవలకి మా ఊరు షహజాన్ పూర్ (బరేలీ) కి వెడుతున్నాను. అంతదూరం ప్రయాణం చేయడం నాజీవితంలో అదే మొదటిసారి.
నేను
మధురలో దిగి బస్సులో వెళ్ళాలి. కాని బస్ స్టాండ్
కి వెళ్ళేటప్పటికి అప్పటికే మధురనుండి బరేలీకి వెళ్ళే బస్సులన్నీ వెళ్ళిపోయాయి. ఏమి చేయాలో తెలియక మా నాన్నగారికి ఫోన్ చేసాను. నేను ఫోన్ చేసిన సమయానికి ఆయన ఫోన్ ని ఇంటిలోనే
వదిలేసి బయటకు వెళ్లారు. అందుచేత నా పరిస్థితి
ఆయనకు తెలియదు.
ఇక రైలులో వెళ్ళడం తప్ప మరే మార్గమూ కనిపించలేదు నాకు. స్టేషన్ కి చేరుకొని టికెట్ తీసుకున్నాను. టికెట్ మీద నేను టికెట్ కొన్న సమయం గం. 7.20 p.m. అని ముద్రించబడింది. అంటే నేను రాత్రి 7.20 కి టికెట్ కొన్నాను. కాని పొరబాటున నేను ఆసమయం రైలు బయలుదేరే సమయం అని భావించాను. వాచీలో సమయం చూస్తే గం. 7.15 అయింది. వెంటనే వేగంగా ప్లాట్ ఫారం మీదకు చేరుకొన్నాను. అప్పటికే రైలు సిధ్ధంగా ఉంది. ఆరైలు ఎక్కడికి వెడుతుందని వాకబు చేస్తే అది బరేలీకి వెడుతుందని చెప్పారు. అప్పటికే బయలుదేరడానికి సిధ్ధంగా ఉన్న రైలులోకి ఎక్కి కూర్చున్నాను.
ఇక
విశ్రాంతిగా నా సీటులో కూర్చుని బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. బయట బాగా చలిగాలి వీస్తూ ఉండటం వల్ల నాకు జ్వరం
కూడా తగిలింది. చలికి వణుకుతూ ఉన్నాను. ఇంతలో రైలులో ఒక అపరిచితుడు కనిపించాడు. అతను చాలా మురికిగా ఉన్నాడు. తలకి తెల్లని గుడ్డ చుట్టుకుని ఉన్నాడు. అతను నావద్దకు వచ్చి, “నాకు కొంత డబ్బు ఇవ్వు” అన్నాడు. రోజంతా ప్రయాణం చేసి అలసటతోను, జ్వరంతోను వణుకుతూ
ఉన్న కారణంగా అతని మీద చిరాకుపడి తిట్టాను.
కాని అతను పరిహాసంగా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. అతను ఇంకెవరినీ డబ్బు అడగలేదు. అతని ప్రవర్తన నాకు చాలా చిత్రంగా అనిపించింది.
ఒక
అరగంట తరువాత ఇంటికి చేరుకున్న మానాన్నగారు నాకు ఫోన్ చేసారు. నేను రైలు ఎక్కేశాననీ, ఇంటికి వస్తున్నానని చెప్పాను. నేను రైలులో వస్తున్నట్లు చెప్పగానే మానాన్నగారు
కంగారుపడ్డారు. రాత్రి గం.11.00 లకు ముందు
మధురనించి బరేలీకి వచ్చే రైళ్ళు ఏమీ లేవు కదా అన్నారు. నేను కూడా కలవరపడి, తోటి ప్రయాణీకులని ఈ రైలు బరేలీకే వడుతోందా అని అడిగాను. వారు బరేలీకే వెడుతుందని చెప్పారు. నేను మానాన్నగారికి ఫోన్ చేసి రైలు బరేలీకే వడుతోందని
చెప్పాను.
నేను
చెప్పినది వినగానే మానాన్నగారు మధుర రైల్వే స్టేషన్ కి ఫోన్ చేసి బరేలీకి వచ్చే రైలు
ఏమన్నా ఉందా అని వాకబు చేసారు. రైలు ఆరోజే కొత్తగా ఆసమయానికి ప్రారంభించబడిందని చెప్పారు. బాబా చేసిన ఈ లీలకి మానాన్నగారికి ఒడలు జలదరించింది. నేను టికెట్ కొన్న సమయాన్నే రైలు బయలుదేరే సమయం
అని భావించడం, సరిగ్గా అదే రోజున రైలు అదే సమయానికి బయలుదేరే రోజు కావడం బాబాలీక కాక
మరేమిటి? ఇక్కడితో ఈ లీల ఆగలేదు.
మానాన్నగారు
నన్ను తీసుకునిరావడానికి షహజాన్ పూర్ నుండి బరేలీకి బయలుదేరారు. కాని హడావిడిలో ఆయన వేరే రైలు ఎక్కారు. కొంతసేపటికి అది తను ఎక్కవలసిన రైలు కాదని గ్రహించుకుని
తరువాతి స్టేషన్ లో దిగిపోయారు. కాని ఆరాత్రివేళ
తను దిగిన స్టేషన్ నుండి బరేలీకి వెళ్ళే రైలు లేదు నేను చాలా దూరంనుండి మొదటిసారిగా ప్రయాణం చేస్తూ
ఉండటం, అంతేకాకుండా నేను జ్వరంతో బాధపడుతూ ఉండటంవల్ల మానాన్నగారు చాలా గాభరా పడ్డారు. తను దిగిన స్టేషన్ నుండి వెంటనే బస్ స్టాండుకు చేరుకొన్నారు. కాని ఆరోజు సమ్మె జరుగుతూ ఉండటం వల్ల బస్సులు
ఏమీ తిరగటంలేదని రాత్రి 9 గంటల తరువాత బస్సులే లేవని తెలియడం, తన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో
కళ్లంబట నీరు కారుస్తూ నుంచున్నారు.
మానాన్నగారు దిగిన చోట రాత్రివేళ దొంగలు తిరుగుతూ ఉంటారని అక్కడున్నవారు చెప్పారు. దానితో ఆయన ఇంకా భయంతో వణికిపోతూ బాబాను, హనుమాన్ ని ప్రార్ధించ సాగారు.
ఇంతలో అకస్మాత్తుగా ఒకతను స్కూటర్ మీద తనవైపు వస్తూ ఉండటం కనిపించింది. ఆవచ్చే వ్యక్తి బహుశ దొంగ అయిఉండవచ్చనిపించింది మానాన్నగారికి. కాని ఆ అపరిచిత వ్యక్తి మానాన్నగారి దగ్గర ఆగి తన స్కూటర్ మీద కూర్చోమన్నాడు. ఆవ్యక్తి కూర్చోమని చెప్పగానే తాను ఎందుకని వెంటనే అభ్యంతరం తెలపకుండా ఎక్కి కూర్చున్నానో తనకే తెలియదని ఆతరవాత మానాన్నగారు నాతో అన్నారు. మానాన్నగారు ఆవ్యక్తితో తను ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండానే ఆవ్యక్తి తన స్కూటర్ ని బరేలీవైపుగా పోనిస్తున్నాడు. (బరేలీ ఆపట్టణంనుండి ఎంతో దూరం లేదు)
ఒకగంట తరువాత ఆవ్యక్తి తన స్కూటర్ ని ఆపి బరేలీ రైల్వేస్టేషన్ దగ్గరే ఉందని చెప్పాడు. స్కూటర్ మీద కూర్చున్నంత సేపు మా నాన్నగారు అచేతనావస్థలోనే ఉండటంతో, ఆవ్యక్తితో మాట్లాడటం గాని, తను ఎక్కడికి వెళ్ళాలో ఏవిధమయిన వివరాలను కూడా చెప్పలేదు. అందుచేత మానాన్నగారు ఎక్కడికి వెళ్లాలో ఆవ్యక్తికి ఎలా తెలిసిందా అని నిర్ఘాంతపోయారు. మా నాన్నగారు ఏదో చెప్పేలోపుగానే ఆవ్యక్తి “దీపక్ తుమ్ ముఘే బహుత్ పరేషాన్ కర్తేహో” (దీపక్ మానాన్నగారి పేరు – నువ్వు నన్ను చాలా తొందరపెట్టేశావు) అని అంటు ఆవ్యక్తి వెళ్ళిపోయాడు.
మా
నాన్నగారికి నోటమాట రాలేదు. సాయినాదుడే స్వయంగా
మానాన్నగారికి సహాయం చేసారన్నది స్పష్టం. మానాన్నగారు వెంటనే రోడ్డుమీదనే సాష్టాంగనమస్కారం చేసుకున్నారు. కాని మానాన్నగారికి ఒక సందేహం కలిగింది. ఆ ఆపరిచిత వ్యక్తి రూపంలో వచ్చినది హనుమాన్ వారా
లేక సాయినాధులవారా అని. ఆయన ఆవిధంగా ఆలోచిస్తూండగా
ఒక వ్యక్తి కనిపించాడు. అతని శరీరం మురికిగా
ఉంది. తలకు తెల్లని గుడ్డ చుట్టుకుని ఉన్నాడు. అతను మా నాన్నగారి దగ్గరకు వచ్చి కాసిని మంచినీళ్లడిగాడు. మానాన్నగారు సీసా నింపి తేవడానికి దగ్గరలోనే ఉన్న
కుళాయి దగ్గరకు వెళ్లారు. కాని తిరిగి వచ్చి
చూసేసరికి అక్కడేవరూ కనిపించలేదు. మానాన్నగారు
అక్కడ ఉన్నవారిని మురికి గుడ్దలతో ఉన్న వ్యక్తిని గాని చూసారా అని అడిగారు. కాని మానాన్నగారు వర్ణించినలాంటి వ్యక్తిని తాము
చూడలేదని చెప్పారు.
తన
అనుమానలన్నిటినీ పటాపంచలు చేయడానికే సాయినాధులవారు వచ్చారని గ్రహించుకున్నవెంటనే, బాబా
లీలలకు మానాన్నగారికి ఆనందంతో దుఃఖం పొర్లుకు వచ్చింది. అదే సమయంలో నేను ప్రయాణిస్తున్న రైలు బరేలీ స్టేషన్
కి చేరుకుంది. నేను మానాన్నగారిని కలుసుకున్నాను. ఆతరువాత మా నాన్నగారు మురికి బట్టలతో కనిపించిన
వ్యక్తి గురించి వర్ణించి చెప్పగానే, రైలులో కొంత డబ్బు ఇవ్వమని నన్ను అడిగిన వ్యక్తి
సాయిబాబా తప్ప మరెవరూ కాదనీ గ్రహించుకున్నాను.
అది తలచుకోగానే నాకు కన్నీళ్ళాగలేదు.
నా
సాయిబాబాకు దక్షిణ ఇవ్వకుండా అయనను అవమానించినందుకు నాకు చాలా సిగ్గనిపించింది. బాబా ఫోటో ముందు నిల్చుని ఆయనను క్షమాపణ వేడుకొన్నాను. మా కుటుంబ సభ్యులందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చాయి.
హర్షిత్ శ్రీవాత్సవ
c/o
శ్రీప్రహ్లాద శర్మ, 75, సోనా విహార్ కాలనీ,
ఢిల్లీ
రోడ్, ఫోర్ వ్హీల్
ఆల్వార్
– 301 001
రాజస్థాన్
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment