05.05.2021 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మీకొక అధ్భుతమయిన ఊదీ మహిమను తెలిపే వృత్తాంతాన్ని అందిస్తున్నాను.
శ్రీ
సాయి లీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు – అక్టోబరు, 2020 సంచికలో ప్రచురింపబదింది.
సాయిబాబా –
ఊదీ
వైద్యమ్
శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా తన భక్తులను ఎన్నోఆపదలనుండి, రోగాలనుండి కాపాడిన విషయం మనకందరకూ తెలుసు. బాబా
తన భక్తులను రోగాలనుండి ఊదీ వైద్యం ద్వారా శాశ్వతంగా నివారణ చేసారు.
ఆయన
తన భక్తులను
కరుణతోను, వాక్కుతోను మాత్రమే నివారించారు తప్ప మరింకే ఔషధాలను ఉపయోగించలేదు.
అటువంటి అధ్బుత సంఘటనలు శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేసిన మనకందరకు తెలుసున్న విషయమే కనుక నేను మరలా వాటిని అనువాదం చేసి ప్రచురించటంలేదు.
శ్రీ
సుభోధ్ అగర్వాల్ గారు వ్రాసిన విషయాల చివరలో ఆయన తనకు కలిగిన స్వీయానుభవంతో ఈ వ్యాసాన్ని ముగించారు. ఆయన
అనుభవాన్ని ఇపుడు అనువదించి మీకందరికీ అందిస్తున్నాను.
అన్ని వ్యాధులు బాగగుటకసలైన ఔషధము బాబా యొక్క వాక్కు, ఊదీ, ఆశీర్వాదములు మాత్రమే కాని, ఔషధములు కావు.
ఇక చదవండి…
1988
వ.సంవత్సరంలో నాకు యానల్ ఫిస్టులా వచ్చింది.
అది
గుదస్థానం వద్ద ఏర్పడే వ్రణం.
ఆవ్రణాన్ని
తొలగించాలంటే
జనరల్ సర్జరీ అవసరం.
కాని
కొన్ని మటుకు వాటంతటవే మానిపోతాయి.
ఈ
సర్జరీని ఫిస్టులాటమీ అని అంటారు.
ఈ
సర్జరీ మంచి అనుభవం, నైపుణ్యం ఉన్న సర్జనే చేయాలి.
డెహ్రాడూన్ లో ఉన్న ఎంతోమంది సర్జన్ లని దీని గురించి అడిగాను.
సర్జరీకి
ముందు కొంతమంది పేషంట్లని కూడా కలుసుకుని అన్ని వివరాలు తెలుసుకున్నాను.
సర్జరీ
అనివార్యమనీ, వ్రణం దానంతటది మానిపోదని చెప్పారు.
సర్జరీ
అనే మాటే చాలా భీతి గొలిపేలా ఉంటుంది.
ఇక
సర్జరీ చేయించుకోవడానికే నిర్ణయించుకుని మంచి పేరు, సర్జరీలో మంచి నైపుణ్యం ఉన్న సర్జన్ వద్ద మరుసటిరోజు కలుసుకుని మాట్లాడటానికి ముందుగానే ఆయనతో ఏర్పాటు చేసుకున్నాను.
మా నాన్నగారు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ నుండి 85 కి.మీ దూరంలో ఉన్న మంగలూర్ అనే చిన్న పట్టణంలో ఉంటున్నారు.
నేను
నా సర్జరీ విషయం చెప్పగానే తను ఆసమయంలో ఆస్పత్రిలో ఉంటానని చెప్పారు.
కాని
వచ్చే రెండు వారాలకి కూడా ఆయన చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అందువల్ల ఆయన రాలేని పరిస్థితి.
దాని
వల్ల ఆపరేషన్ వాయిదా వేయవలసి వచ్చింది.
చార్లెస్ డికెన్స్ ఇచ్చిన సలహా “ ఈ రోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయకు.
వాయిదా
వేయడమన్నది కాలాన్ని దొంగిలిస్తుంది.
వాయిదా అనేది
ఒక దొంగ . దానిని గట్టిగా పట్టుకుని గెంటివేయాలి”.
చాలా రోజులు గడిచిపోయాయి.
ఎన్నోవారాలు,
అంతే కాదు సంవత్సరాలు గడిచిపోయాయి.
ఇన్ని
సంవత్సరాలుగా
సర్జరీ జరగవలసిన తేదీ వాయిదా పడుతూనే వస్తోంది.
1991
వ.సం.లో మాఇంటికి ఒక అతిధి వచ్చారు.
ఆయన
రూపం అధ్భుతంగ ఉంది. ఆయన
శిరస్సు చుట్టూ లేతరంగు ఛాయ.
మనసారా
ఆయనను లోపలికి ఆహ్వానించి కూర్చోవడానికి ఆసనం చూపించాను.
మీరు
వచ్చిన కారణం ఏమిటి అని అడిగాను.
“నేను నీ ఆరోగ్యం గురించి, యోగక్షేమాల గురించి తెలుసుకోవడానికి వచ్చాను” అన్నారు.
నేను నాకు ఉన్న సమస్య గురించి వివరించాను.
నేను
చెప్పినది వినగానే ఆయన తీవ్రమయిన ధ్యానస్థితిలోకి వెళ్ళారు.
కొన్ని
సెకనుల తరువాత ఆయన తల పైకెత్తి ఆలోచనా పుర్వకంగా చిరునవ్వు నవ్వారు. మృదువయిన
శాంతస్వబావంతో
నిండిన ఆయన స్వరం నన్నెంతగానో ఆకట్టుకుంది.
“కొద్ది
నిమిషాలపాటు నేను చెప్పేది వింటావా?” అన్నారు.
విననుఅని చెప్పడానికి కారణం ఏమీ లేదు.
అందుచేత
ఆయన చెప్పేది శ్రధ్ధగా వినడానికి ముందుకు వంగాను.
వ్యాసమహాముని వైశంపాయుడికి చెప్పిన కధను చెప్పడం ప్రారంభించారు.
“పూర్వం భద్రేశ్వర్ అనే మహారాజు ఉండేవాడు.
ఆయన
మధ్యదేశ్ (మాద్ర) ని పరిపాలించాడు.
ఒకసారి ఆయన ఎడమచేతికి కుష్టువ్యాధి సోకింది. ఆ భయంకరమయిన
వ్యాధి తన శరీరానికంతటికీ పాకుతుందేమోనని భద్రేశ్వర్ కి చాలా భయం వేశింది.
అందుచేత
తన జీవితాన్ని
అంతం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన
తన నిర్ణయాన్ని ప్రధాన పూజారికి చెప్పుకున్నాడు.
జీవితాన్ని
చాలించుకుందామని
నిర్ణయంతీసుకుని
ఆవిధంగా చేసినట్లయితే మొత్తం రాజ్యమంతా నాశనమయిపోతుందని
మహారాజుని
హెచ్చరించాడు
ప్రధాన పూజారి.
మీరు
కనక సూర్యభవవానుడిని పూజించినట్లయితే మీ కుష్టువ్యాధి నయమవుతుందని చెప్పాడు.
సూర్యుని ఏవిధంగా పూజించాలో
దానికి సంబంధించిన ఆచరణ విధి విధానాలను అన్నీ వివరంగా ప్రధానపూజారి రాజుకి వివరించాడు.
రాజు
ఎంతో నియమనిష్టలతో మంత్రాలను పఠిస్తూ, నైవేద్యాలను, ఫలాలను, అర్ఘ్యాలను, అక్షతలను
సూర్యదేవునికి
సమర్పిస్తూ పూజించాడు. సూర్యదేవుడిని ఎంతో
భక్తిశ్రధ్ధలతో
పూజించిన కారణంగా భద్రేశ్వర్ మహారాజుకి
వచ్చిన కుష్టువ్యాది ఒక్క సంవత్సరంలోనే నయమయింది.”
ఆయన చెప్పిన కధ వినగానే తీవ్రమయిన ఆలోచనలలోకి వెళ్ళిపోయాను.
నాలో
కలిగిన ఆలోచనలని భావాలని
ఆ అతిధి గమనించారు. ఇపుడు
ఆయన కన్నులు ఆయన
వచ్చిన
కారణమేమిటో వివరిస్తున్నాయి.
నా
సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి.
“కాని నాకు మరొక సూర్యభగవానుని వదనమే తెలుసు” అన్నాను.
ఆయన నావైపు ఆశ్చర్యంతో మవునంగా చూసారు.
“ఆసూర్యుడు ఎవరో కాదు.
షిరిడీలో
పగలు రాత్రి మనకు గోచరిస్తూ, ఈ ప్రపంచానికంతటికీ వెలుగును ప్రసాదిస్తూ తన భక్తులందరికీ దీవెనలు అందించే సూర్యుడు సాయిబాబా తప్ప మరెవరూ కాదు.” అన్నాను.
“అయితే
నీకు షిరిడీ సాయిబాబా గురించి తెలుసా?” అని ఆయన నన్ను ప్రశ్నించారు.
నాయొక్క అనేకమయిన గత జన్మలనుండి ఆయనే నా సూర్యభగవానుడు.
అలాగే
అప్పటినుండి
నేనాయన కుమారుడిని” ఒకే శ్వాసలో ఇదంతా ఆయనకు చెప్పాను.
“అయితే సర్వరోగ నివారిణి అయిన ఆయనయొక్క పవిత్రమయిన ఉదీ గురించి కూడా నీకు తెలిసే ఉంటుంది” అని అన్నారు.
శ్రీ సాయి సత్ చరిత్రలో ఊదీయొక్క అధ్భుతాలను గురించిన
సంఘటనలన్నిటినీ
ఒకదానివెంట మరొకటి ఆయన సమక్షంలో గుర్తుచేసుకుని చెప్పాను.
ఆయన
ఎంతో ఓపికగా శ్రధ్ధగా నేను చెప్పినవాటినన్నిటినీ
ఆలకించారు.
ఆయన ఇక వెళ్లడానికి లేచి, తన జీబులోనుండి ఒక ఉదీ పొట్లాన్ని తీసి నాకు ఇచ్చారు.
“ఈ
ఊదీని నీ వ్రణం మీద రాస్తూ ఉండు.
ఒక
నెలలోనే నీకు నయమవుతుంది” అని అన్నారు.
ఇక సర్జరీ చేయించుకుందామనే
నిర్ణయాన్ని
పూర్తిగా పక్కన పెట్టేసి
ఆ అతిధి చెప్పిన విధంగానే చేయడానికి గట్టి నిర్ణయం
తీసుకున్నాను.
అధ్భుతం.
ఆయన
చెప్పినట్లుగానే
సరిగ్గా ఒక్క నెలలోనే వ్రణం పూర్తిగా మానిపోయింది.
నేను ఆయనను ప్రశ్నించిన ప్రశ్నలలో ఒకదానికి సమాధానంగా తాను షిరిడినుంచి వస్తున్నట్లుగా చెప్పిన సమాధానాన్ని బట్టి ఆ అతిధి ఎవరో నేను ఇపుడు గ్రహించుకున్నాను.
నా అజ్ఞానం, నా అజాగ్రత్త వల్ల క్షమించమని వేడుకోవడం
తప్ప మరేమీ చేయలేను.
కాని
ఈ అనుభవం నాకు ఎంతో ఆనందాన్ని కలుగచేసింది.
డా.సుబోధ్
అగర్వాల్
డెహ్రాడూన్
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
1 comments:
ఓం శ్రీ సాయిరాం.
Post a Comment