03.01.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 23 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
బాలాజీ పిలాజీ చెప్పిన మరికొన్ని విషయాలు …
గం.10.30 ని తరువాత ఆఖరికి బూటీ బహిర్భూమికి వెళ్ళారు. ఆరోజుల్లో బయట బహిరంగ ప్రదేశాలనే లఘుశంక తీర్చుకోవడానికి
ఉపయోగిస్తూ ఉండేవారు. బూటీతో కూడా ఒక నౌకరు
ఉండేవాడు. బాబా బూటీతో “నువ్వు అక్కడికి ఒంటరిగా
వెళ్ళవద్దు. కూడా నీ సేవకుడిని తీసుకువెళ్ళు”
అన్నారు. సేవకుడు ఆయనకు అంగరక్షకుడిగా
ఉండేవాడు. బాబా అనుమతిచ్చిన తరువాత బూటి చెంబుతో
నీళ్ళు తీసుకుని తన నౌకరుని వెంటబెట్టుకొని బహిర్భూమికి బయలుదేరాడు. నౌకరు వెనుక వస్తుంటే బూటీ ముందు నడుస్తూ ఉన్నారు. ఇంతలో బూటీ గట్టిగా ఆరిచారు. వెంటనే నౌకరు పెరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వెళ్ళాడు. బూటీ ప్రక్కన పాము కుబుసం కనిపించింది. దానిని చూడగానే ఇద్దరూ గట్టిగా అరుస్తూ అక్కడినుండి
వేగంగా వెనుకకు తిరిగి వచ్చారు.
ప్రశ్న --- పాము బూటీని కాటు వేసిందా?
జవాబు --- లేదు.
అక్కడ ఒక పాము ఉంది. కాని అది ఆయనను కాటు వేయలేదు.
బాలాజీ పిలాజీ…
వారిద్దరూ పెరిగెత్తుకుంటూ బాబా దగ్గరకి వెళ్ళారు. బాబా నన్ను అక్కడికి వెళ్లి ఏమిజరిగిందో చూసి రమ్మన్నారు.
ప్రశ్న --- ఏమి జరగబోతున్నదో బాబాకు ముందే తెలుసా?
జవాబు --- అవును, బాబాకు ముందుగానే తెలుసు
బాలాజీ పిలాజీ
--- అక్కడ పాము ఉందో లేదో చూసి బాబాకు
చెబుదామని నేనక్కడికి వెళ్లాను. కాని నాకక్కడ
పాము కుబుసం కనిపించింది. నేను దానిని తీసి
బాబాకు చూపించడానికి తీసుకువచ్చాను. లేదా వాస్తవంగా
నేను పాము కుబుసాన్ని చూసాను. నేను దానిని
విసెరేసి బాబాతో నాకు కుబుసం మాత్రమే కనిపించిందని చెప్పాను. పాము ప్రతి ఆరుమాసాలకు ఒకసారి కుబుసం విడుస్తుంది.
ప్రశ్న --- ఈ మొత్తం కధనంలోని ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు --- బూటీ మరణగండంనుంచి తప్పించుకున్నాడు. ఆయన గం. 8 – 10.30 మధ్యే కనక బహిర్భూమికి వెళ్ళి
ఉన్నట్లయితే అక్కడే ఉన్న పాము ఆయనను కాటు వేసి ఉండేది. ఆయన ఆసమయం దాటి వెళ్ళిన కారణంగా ఆయన బ్రతికారు.
(బాబా నామ స్మరణే నన్ను సర్ప గండాన్నుండి తప్పించింది....త్యాగరాజు)
బాలాజీ పిలాజీ ---
ఆతరువాత కనిపించిన ప్రతివారితోను, గ్రామస్థులందరితోను బాబా తన
ప్రాణాలను రక్షించారని బూటీ చెప్పారు. అందుకు
కృతజ్ఞతగా షిరిడీలో ఒక వాడాను నిర్మించదలచుకున్నట్లుగా చెప్పారు. దాని నిర్మాణానికి కావలసిన ధనం ఆయన వద్ద ఉంది. ఆయన బాబాను అడగగానే బాబా అలాగే అని తన అంగీకారాన్ని
తెలిపారు.
మధ్యాహ్న ఆరతి అయిన తరువాత బాబా భోజనం చేసే సమయంలో ఆయన చుట్టూ
ఎన్నో జంతువులు, కుక్కలు, పిల్లులు, కాకులు మొదలయినవన్నీ వచ్చి తింటూ ఉండేవి. బాబా వాటినన్నిటినీ ప్రేమతో పిలుస్తూ ఉండేవారు.
ప్రశ్న --- ఆయన జంతువులను ఆవిధంగా ప్రేమిస్తూ ఉండేవారా?
తుకారామ్ --- అవును.
ఆయన జంతులయందుకూడా ప్రేమను కనబరచేవారు.
బాలాజీ పిలాజీ
--- బాబా వాటిని పిలిచి వాటికి కూడా
ఆహారం పెడుతూ ఉండేవారు. ఆయన వాటివైపు ఆహారాన్ని
చల్లేవారు.
ప్రశ్న --- బాబా ఊదీనిచ్చే సమయంలో పాట ఏమన్నా పాడేవారా? “రామతే రామ్ ఆవోజీ ఆవోజీ” అని పాడినట్లుగా నేను
చదివాను.
జవాబు --- ధునిలోనుండి ఊదీని తీసుకోవడం భక్తులు చాలా ఇష్టపడేవారు. ఊదీని తీసుకుని బాబాగారి చేతులలో ఉంచేవారు. బాబాకూడా అదేవిధంగానే భక్తుల చేతులలో ఊదీని ఉంచేవారు.
ప్రశ్న --- ఆవిధంగా చేయడమంటే ఆశీర్వదించారన్నదానికి సంకేతమా?
జవాబు --- అవును అంతే.
ప్రశ్న --- ఊదీలో ఉన్న శక్తి ఏమిటి?
జవాబు --- ఎవరికయినా ఏవిధమయిన సంకటాలు కలిగినా…
ప్రశ్న --- శారీరకంగాను, మానసికంగాను రెండిటికీనా?
జవాబు --- అవును.
శారీరకంగాను, మానసికంగాను. కడుపులో నొప్పి, కాళ్ళలో నొప్పి, జ్వరం ఏదయినా సరే
అన్నిటికీ బాబా ఊదీయే మందు. ఎవరయినా బాబా దగ్గరకు
వచ్చి తమ సస్యలను చెప్పుకోగానే బాబా వారికి ఊదీనిచ్చేవారు. బాబా ఇచ్చిన ఊదీని సేవించి, నుదుటిమీద రాసుకున్నంతనే
నివారణ అయ్యేది.
నేను (ఆంటోనియో)
--- బాగుంది. ఇది చాలా ముఖ్యమయిన విషయం.
తుకారామ్ --- ప్రజలందరికీ బాబా ఊదీమీద ఎంతో నమ్మకం.
ప్రశ్న --- ప్రజలు తనను పూజించడం బాబాకు ఇష్టముండేది కాదని,
కాని చాలా కాలం తరువాత మాత్రమే ఆయన అందుకు అంగీకరించారన్నది నిజమేనా?
జవాబు --- నేను ఇక్కడికి 1912 వ.సంవత్సరంలో వచ్చాను. అంతకుముందు నేనిక్కడ లేను. అందువల్ల ఈ ప్రశ్నకు ఏమని సమాధానమివ్వాలో నాకు తెలియదు. నేను 1912 వ.సం.నుండి మాత్రమే బాబాను కలుసుకున్నాను. 1912 నుండి 1918 ఈ ఆరు సంవత్సరాల కాలంలో నేను చూసినవి
మాత్రం మీకు చెప్పగలను.
ప్రశ్న --- బాబా సమాధి చెందిన సమయంలో ప్రజల స్పందన ఏవిధంగా
ఉంది? అక్టోబరు 15 మధ్యాహ్నం 2 గంటలకు బాబా దేహాన్ని విడిచిన సమయంలో ఏమి జరిగింది?
జవాబు --- నేను ఇక్కడే గట్టుమీద కుర్చున్నాను. (బాలాజీ పిలాజీ ఒక ఫొటోను చూపించారు)
తుకారామ్ --- (ఫొటో చూపించి వివరంగా) బాబా తన దేహాన్ని వీడిన
సమయంలో బాబా భక్తులలో ఇతను ఒకడు. బాబా సమాధి చెందిన
సమయంలో బాలాజీ పిలాజీ గురవ్ మసీదు బయట కూర్చుని ఉన్నాడు. అపుడు అతని వయస్సు 20 సంవత్సరాలు. బాబాతో బయాజీబాయి కూడా ఉంది. బాబా ఆమె ఒడిలో తలపెట్టుకొని ప్రాణాలు వదిలారు. ఆవిధంగా పిలాజీ చెప్పిన వివరణ.
బాలాజీ పిలాజీ ---
బాబా బాయజీబాయి ఒడిలో తలపెట్టుకొని ప్రాణాలు వదిలిన క్షణం నేను
నాకళ్ళతో స్వయంగా చూసాను. మసీదులోకి ప్రవేశించే
ప్రదేశంలో నేను కూర్చుని ఉన్నారు. అపుడు నావయస్సు
20 సంవత్సరాలు. “ఇపుడు బాబాకు ఏమి జరుగుతోంది?”
ఇదే ఆలోచన నాలో. నాకు మనసులో చాలా గందరగోళంగా
ఉంది. ఏమి జరుగుతోందనే గాభరాతో ఆలోచిస్తూ ఉన్నాను. ఈ లోపుగానే బాబా ప్రాణాలు వదిలారు. ఆయన దగ్గర బాయాజీబాయి ఉంది. మసీదుకు కాస్త బయట దగ్గరలోనే మరొక వ్యక్తి కూడా
ఉన్నాడు. జరిగినదంతా గ్రామస్థులందరికీ చెప్పడానికి
ఆవ్యక్తి వెంటనే గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఆసమయంలో ప్రజలు భోజనాలు చేస్తూ ఉన్నారు. గ్రామస్థులు కొందరు దీక్షిత్ వాడాలో భోజనాలు చేస్తున్నారు. ఈ వార్త విన్నంతనే వారందరూ తినడం ఆపి బాబాను చూడటానికి
పరిగెత్తుకుంటూ వచ్చారు.
ప్రశ్న --- ద్వారకామాయికా?
జవాబు --- అవును, ద్వారకామాయికే.
ప్రశ్న --- అందరూ ఏడుస్తూ ఉన్నారా?
జవాబు --- అవును.
బాబా ఇక లేరన్న విషయం అందరికి తెలిసిపోయింది. మహమ్మదీయులు, హిందువులు మసీదు చుట్టూ గుమిగూడారు. వారిలో వారే తర్కించుకోవడం మొదలుపెట్టారు. రెండు కులాలవారు బాబా శరీరం మాదంటే మాదని తగవులాడుకోవడం
మొదలుపెట్టారు. (దుబాసీ నవ్వసాగాడు) ఈవిధంగా
కాసేపు వాదులాడుకున్నారు. ఈవిధమయిన వాదనలు
జరుగుతూ ఉండగ కాకాసాహెబ్ దీక్షిత్ నగర్ ఇన్స్ పెక్టర్ కి తంతి (టెలిగ్రామ్) పంపించాడు. అందులో “బాబా మరణించారు. మీరు ఇక్కడికి వచ్చి ఈ సమస్యని పరిష్కరించండి” అని
సందేశం పంపించాడు. అపుడు వారు ఒక కమిటీతో వచ్చారు. నిజానికి ఇన్స్ పెక్టరే షిరిడీకి వచ్చాడు. కమిటీ రాలేదు.
ఇన్స్ పెక్టర్ నగర్ నుండి వచ్చాడు.
శరీరాన్ని పరీక్షించాలని అక్కడున్నవారందరికీ చెప్పాడు. ఆవిధంగా పరీక్షించిన తరువాతనే ఈ సమస్యని పరిష్కరించగలమని
అన్నాడు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment