సాయి లీల - రాబోయే ఆపదను నివారించిన బాబా
29.02.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి
లీల పత్రిక నవంబరు – డిసెంబరు 2003 సంవత్సరమ్ సంచికలోని మరొక సాయి లీల.
శ్రీ ఎల్.డీ.
సోమరాజు, 233, ఆస్టిన్, బెంగళూరు వారికి బాబా తనకు తానుగా ప్రకటితమగుట.
నేను ఆర్మీలో
పనిచేసి పదవీ విరమణ చేశాను. 1940వ.సంవత్సరంనుండీ
నేను బాబాని పూజిస్తూ ఉన్నాను. నాకు పదిమంది సంతానం. వారిలో ముగ్గురు కవలలు. వారంతా క్షేమంగా ఆనందంగా ఉన్నారు.
నా దగ్గిర చిన్న
బాబా ఫోటో ఉంది. నేనెక్కడికి వెళ్ళినా నా కూడా
దానిని తీసుకుని వెడుతూ పూజించుకుంటూ ఉంటాను.
1941 వ.సంవత్సరంలో సెలవు పెట్టి జబల్ పూర్ నుండి బెంగళూరు వెళ్ళాను. బెజవాడ రైల్వే స్టేషన్ లో శ్రీ నరసింహ స్వామీజీ
గారిని కలుసుకోవడం జరిగింది.
ఆయన నా ప్రక్కనే
కూర్చున్నారు. ఆయన బాబా గురించి ఎన్నో విషయాలు
చెప్పారు. అయన నన్నాశీర్వదించి ఒక అణా ఇచ్చారు. దానిని రోజూ పూజించుకుంటూ ఉండమని చెప్పారు.
బెంగళూరు చేరుకున్న
తరువాత, నా తల్లిడండ్రులకు, శ్రీ నరసింహ స్వామీజీ గారిని కలుసుకున్న విషయం చెప్పి
, మీరు కూడా బాబాని భక్తితో పూజించుకుంటూ ఉండండని చెప్పాను. ఒక రోజు సాయంత్రం నేను సినిమాకి వెళ్ళాను. రాత్రి 7 గంటలవేళ మాయింటి ముందున్న ఆవరణలోకి ఒక
సాధువు వచ్చాడు. ఆ సమయంలో విపరీతంగా వర్షం
కురుస్తూ ఉంది.
ఆ సాధువు తెల్లని దుస్తులు
ధరించి, బాబాగే తలకు ఒక గుడ్డను చుట్టుకుని ఉన్నాడు. ఆ సాధువు బయటనుంచుని, “ఎవరూ గేటు దాటి బయటకు రావద్దు. బయట ఒక నాగుపాము ఉంది” అని అరుస్తూ చెప్పాడు. మా అమ్మగారు “బయట ఏమి ఉంది బాబా” అని అడిగింది. అతను సాయిబాబా లాగే ఉండటం వల్ల ఆసాధువుని మా అమ్మగారు
బాబా అని సంబోధించి అడిగింది. అపుడతను “గేటు
బయట నాగుపాము ఉంది. అది తొందరలోనే వెళ్ళిపోతుంది.
కాని ఎవ్వరూ బయటకు మాత్రం రావద్దు” అన్నాడు.
అతని మాటలు విని మా యింటి ప్రక్కనే ఉన్నతను తన ఇంటి తలుపు తెరిచాడు. మాయింటి బయట ఆవరణలో ఆయనకు పెద్ద నాగుపాము కనిపించింది. బాబా మా అమ్మగారితో పాముకు కాస్త పాలు తీసుకుని
రమ్మని చెప్పాడు. పాలు త్రాగి ఆ పాము వెళ్ళిపోయింది.
మా అమ్మగారు
ఆ సాధువుని ఇంటిలోనికి రమ్మని ఆహ్వానించారు.
కాని ఆయన రావడానికి అంగీకరించలేదు.
అతను మా అమ్మగారిని కాస్త అన్నం పెట్టమని అడిగాడు. బయట ఉన్న రాతి
పలక మీద మా అమ్మగారు అతనికి భోజనం పెట్టారు. భోజనం చేసిన తరువాత అతను మా అమ్మగారిని కొంచెం డబ్బడిగాడు.
వెంటనే మా చిన్న
చెల్లెలు ఇంటిలోకి వెళ్ళి అయిదు రూపాయలు తెచ్చి అతనికిచ్చింది. వంటిమీద కప్పుకోవడానికి ఒక *గోనె సంచి ఇమ్మని అడిగాడు. మా అమ్మగారు ఒక గోనె సంచి తెచ్చిమ్మని మా నాన్నగారితో
చెప్పింది. మా నాన్నగారు ఇవ్వనని చెప్పారు. అపుడా సాధువు “నీ ఇంటి పూజా మందిరంలో 50 గోనె సంచులున్నాయి. వాటిలోనుంచి ఒకటివ్వు” అన్నాడు. ఆయన మాటలు విని
మా అమ్మగారికి, నాన్నగారికి చాలా ఆశ్చర్యం కలిగింది. అతనికి ఒక గోనె సంచి తెచ్చి ఇచ్చారు. అతను ఆ రాతిపలక మీదే కూర్చుని బీడీ కాల్చి గుప్పెడు
బూడిదని ఆరాతి పలక మీద రాల్చాడు. ఆ తరువాత
అతను మరొక సారి ఎప్పుడయినా వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మా చిన్న చెల్లెలు అతను వెళ్ళిన వైపు రోడ్డు మలుపు దాకా
వెళ్ళింది. కాని అతను అక్కడ అదృశ్యమయ్యాడు.
నేను, మాసోదరుడు,
సోదరితో సినిమానుండి ఇంటికి చేరుకునేటప్పటికి విపరీతమయిన వర్షం కురిసి మా యింటి ఆవరణంతా
వర్షపు నీటితో నిండిపోయి వరదలాగ ఉంది. మా అమ్మగారు
సాధువు వచ్చిన విషయం చెప్పారు. మేమమంతా ఆ సాధువు
కూర్చున్న పెద్ద రాతి పలక వద్దకు వెళ్ళి చూశాము.
విచిత్రం ఏమిటంటే అక్కడ అతను బీడీ కాల్చి వదలిన బూడిద, అంత పెద్ద వర్షం కురిసినా
ఏమాత్రం తడవకుండా పొడిగా ఉంది.
మా నాన్నగారు
ఒక పోలీసు ఆఫీసరు. అటువంటిది ఆయన కూడా ఈ అద్బుతాన్ని
చూసి చాలా ఆశ్చర్యపోయారు. అప్పటినుండి ఆయన
కూడా శ్రీసాయిబాబాని పూజించడం మొదలుపెట్టారు.
తన భక్తులలో
నమ్మకాన్ని పెంచడానికి ఇది బాబా చేసిన లీల కాదా?
*****
*(సాయి బంధువులు ఈ లీల చదివారు కదా. బాబా లీలలు విచిత్రంగా ఉంటాయి. వెనువెంటనే ఆయన లీలలను అర్ధం చేసుకోవడం మానవ మాత్రులమైన మనకి సాధ్యం కాదు. ఆయన తన లీల చూపించి అదృశ్యమయిన తరువాత మనకి గ్రహింపుకొస్తుంది. వచ్చినది బాబాయేనేమో అనిపించి, తరువాత అవును నిజమే వచ్చినది బాబాయే, ఎంత అజ్ఞానులము. ఆయన వచ్చిన వెంటనే గుర్తించలేకపోయాము కదా అని బాధ పడతాము. అందుకనే బాబా అందరిలోనూ నన్ను చూడు, అందరి హృదయాలలోనూ నేనున్నాను అన్నారు. మీరు చదివిన లీలలో సాధువు గోనె సంచి అడిగాడు. శ్రీ సయి సత్ చరిత్ర 5వ.అధ్యాయం ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాము. బాబా దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చొనేవారు అన్న గుర్తు చేసుకుంటె బాబాయే సాధువు రూపంలో వచ్చారని మనకి బోధ పడుతుంది. ఓం సాయిరాం. )
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment