27.02.2016 శనివారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబాగారు తాము జీవించి ఉన్నప్పుడు తన భక్తులెందరికో తన లీలలను చూపించారు, అలాగే తాను షిరిడీలోనే ఉండి ఎక్కడో దూరంగా ఉన్న తన భక్తులకు దర్శనం కూడా ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన సమాధి అనంతరం కూడా తన భక్తులకు దర్శనాలను ఇచ్చిన అద్భుతమైన సంఘటనలు కూడా మనకందరకూ తెలుసు. ఇంతకు ముందు కూడా నేను ప్రత్యక్షంగా అనుభవించిన అనుభూతులను కూడా మీరు చదివే ఉంటారు. ఈ రోజు, మొట్టమొదట భగవంతునిపై నమ్మకం లేని వ్యక్తి బాబా మార్గంలోకి ఏవిధంగా వచ్చాడో అతనికి బాబా తన దర్శన భాగ్యాన్ని ఏవిధంగా కలిగించారో చదవండి. ఈ అద్భుతమైన లీల సాయిలీల పత్రిక నవంబరు - డిసెంబరు 2003 వ.సంవత్సరం సంచికనుండి గ్రహింపబడింది.
శ్రీ
సాయి దర్శనం – రక్షించువాడను నేనే
నేను
సాయి భక్తుడిగా ఏవిధంగా మారానో నాఅనుభవాలే తెలుపుతాయన్నదే నా అభిప్రాయం.
నా ఈ అనుభవాలను చదివిన
పాఠకులు కూడా బాబా పై
భక్తిని మరింతగా పెంచుకుంటారనే నమ్మకం నాకుంది.
బాల్యంలో
ఉండగా నాకు దేవుడంటే నమ్మకం
ఉందేది కాదు. దేవుని
మీద నాకు నమ్మకం లేకపోవడంపై
నాకున్న ఆలోచనలకి మా నాన్నగారు నామీదెప్పుడూ
కోపగించుకుని పరుషంగా మాట్లాడలేదు. నా
ఆలోచనా పధాన్ని మార్చడానికి, ఆయన తెలివిగా తన
స్నేహితులద్వారా ప్రయత్నించారు. వారంతా
నాకు సహాయం చేయడానికి వచ్చారు. వారు, తమకి వృధ్ధాప్యం
వచ్చిందనీ, అందువల్ల తమకు కాస్త మత
గ్రంధాలను, పురాణాలను చదివి వినిపించమని నన్నడిగారు. దాని
ఫలితమే భగవంతుని గురించి, సాకార, నిరాకార విషయాలమీద నా అభిప్రాయాలలో మార్పు
వచ్చింది. నా
జీవితంలో భగవంతునిపై నమ్మకం లేని
రోజులలో పాలరాతి భగవంతుని
విగ్రహాలని వట్టి రాతి విగ్రహాలుగా
భావించేవాడిని. ఇపుడు
ఆవిగ్రహాలే నాజీవిత పరమావధిగాను, ప్రేరణగాను మారాయి.
అది
1927 వ.సంవత్సరం, అపుడు నాకు 16 సంవత్సరాల
వయస్సు. పాఠశాలలో
చదువుకుంటున్న రోజులవి. గుజరాత్
లో వచ్చిన భయంకరమయిన వరదల్లో చిక్కుకున్నాను. ఆ
సమయంలో నేను మానాన్నగారితో బరోడాలో
ఉన్నాను. వెల్లువెత్తుతూ వస్తున్న
వరదలు పట్టణాన్ని రెండు భాగాలుగా చేసి
ప్రవహింపసాగాయి. మా
నాన్నగారు, నేను ఒకవైపున ఉన్నాము,
మా అమ్మమ్మగారు, మా తమ్ముడు రెండవవౖపున
ఉన్నారు. నదిపై
ఎత్తుగా ఉన్న వంతెన మీదుగా నేను
మా నాన్నగారు వెళ్ళడానికి ప్రయత్నించాము. కాని
అక్కడ కాపలాగా ఉన్న పోలీసులు మమ్మల్ని
వెళ్ళనివ్వలేదు.
ఎలాగయితేనేం
మేము నీటిలోకి దిగి నడవసాగాము.
నీళ్ళు నామెడదాకా వచ్చి నీటిలో చిక్కుకుపోయి
వెనక్కు వెళ్ళలేని పరిస్థితిలో ఉండిపోయాము. అది
జీవన్మరణ సమస్య. ఆ
సమయంలో తలకు రుమాలు కట్టుకుని,
బాగా పెరిగిన గడ్డంతో 7అడుగుల
పొడవు ఉన్న ఒక వ్యక్తి
మా వైపు చూస్తూ ఎక్కడయితే ఉన్నారో అక్కడే నిలబడి ఉండండని అరుస్తూ అన్నాడు. ఆ
వ్యక్తి వరద నీటిలో నడచుకుంటూ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సురక్షితంగా అవతలి వైపుకు
మా చేయిపట్టుకుని నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళాడు. అప్పటికే అక్కడ మా అమ్మమ్మగారు, మా తమ్ముడు మాకోసం
ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని
ఆ వరద నీటిలో నడిపించుకుంటు క్షేమంగా చేర్చిన వ్యక్తి కోసం అంతటా వెతికాము కాని ఎక్కడా
అతను కనిపించలేదు. నేను చాలా ఆశ్చర్యానికి
లోనయ్యి అతను కనపడతాడేమోననే ఆశతో ఎంతగానో ప్రయత్నించాను కాని ఎక్కడా అతని జాడ లేదు. నా జీవితంలో 1927 వ.సంవత్సరంలో శ్రీసాయిబాబా నాకు
మొట్టమొదటగా ఇచ్చిన ఆధ్యాత్మిక దర్శనం అది.
1943 వ.సంవత్సరంలో
మా పెద్ద కుమార్తెకి టైఫాయిడ్ తిరగబెట్టి 42 రోజులు బాధపడింది. ముగ్గురు వైద్యుల బృందం పరీక్షించి అది చాలా ప్రాణాంతకమయినదని
నిర్ధారించారు. 41 వ.రోజున వారంతా ఇక దేవుడే
రక్షించాలి మనం చేయగలిగిందేమీ లేదని చెప్పారు. ఆ సమయంలో బరోడాలో ఉన్న నాస్నేహితుడికి
తెలిసిన ఒక వృధ్ధుడు చెన్నై నుండి మమ్మల్ని చూడటానికి రావడం తటస్థించింది. ఆయనకు గడ్డం ఉంది. ఆయన మా అమ్మాయిని చూసి ఏమీ భయపడవద్దని అన్నారు. నా జీవితంలో ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఆయన నోటంబట
ఈ మాటలు విని నాకాశ్చర్యం వేసింది. కాని ఆయన
నాకెంతో నచ్చ చెప్పి నాలోని భయాన్ని పోగొట్టాడు.
ఆయన వెళ్ళిపోయిన
తరువాత ఆరోజు రాత్రి మా అమ్మాయికి కలలో శ్రీసాయిబాబా దర్శనమిచ్చారు. ఆ తరువాతనించి ఆమె ఆరోగ్యం మెరుగవసాగింది. నేను బరోడాలో ఉన్న నా స్నేహితుణ్ణి, మమ్మల్ని చూడటానికి
వచ్చిన వృధ్ధుడి గురించి వాకబు చేశాను కాని
ఆయన వివరాలేమీ తెలియలేదు. ఆ వృధ్ధుని రూపంలో
వచ్చి భయపడవద్దని నాకు దైర్యాన్ని ప్రసాదించినది శ్రీసాయిబాబా తప్ప మరెవరూ కాదని నేను
ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఆ విధంగా నాకు శ్రీసాయిబాబా
రెండవసారి దర్శనమిచ్చారు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment