Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, November 27, 2019

నేనే నీ చెంతకు వస్తాను

Posted by tyagaraju on 7:35 AM
      Image result for images of shirdi wale sai baba      
 Image result for images of  pink rose hd

27.11.2019  బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి గారు పంపించిన మరొక అధ్భుతమయిన బాబా చమత్కారాన్ని తెలుసుకుందాము.  మనసులో  బాబాను చూడాలి, చూడాలి అనే తపన ఉండాలే గాని బాబా స్పందించకుండా ఉండగలరా?  ఆయన ఏదో విధంగా, మనం ఊహించని రీతిలో దర్శనమిస్తారనే విషయం ఇప్పుడు మీరు చదవబోతున్న లీల ద్వారా గ్రహించగలరు.


నేనే నీ చెంతకు వస్తాను

" ఓం సాయి రాం" సాయి బంధువులు అందరికి.
  ఇప్పుడు నేను చెప్పబోయే బాబా లీల నేను సంబల్పూర్ లో ఉద్యోగం చేస్తున్న రోజులు.  మా ఆఫీస్ లో పనిచేసే అబ్బాయికి బాబా కలిగించిన అధ్భుతమయిన అనుభవం. సాయి సర్వాంతర్యామి,అని,సర్వభూతాత్మకుడని  చెప్పకనే చెప్పిన లీల.





పోయిన సంవత్సరం అనగా 2018 సాయిబాబా వారి శతాబ్ది ఉత్సవాలకు ముందు జరిగిన లీల.  2018 సెప్టెంబర్ నెలలో చంద్రునిలో బాబావారు కనపడ్డారని అందరూ చూసారు. వాట్సాప్ లో ఫేస్ బుక్ లో అన్నిటిలో వచ్చింది. అది మన అందరికి తెలుసు. అప్పుడు నేను సంబల్పూర్ లో ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం చేస్తున్నాను. సదాశివ అని ఒక అబ్బాయి,చాలా బీదవాడు. మా ఆఫీస్ లో పని చేసేవాడు. బాబా వారికి చాలా భక్తుడు. సెప్టెంబర్ నెలలో చంద్రునిలో బాబాను అందరూ చూసారు. 
     Image result for images of baba in moon
నేను కూడా చూసాను. అతనికి కూడా ఫోన్ చేసి, "సదాచంద్రునిలో బాబావారి దర్శనం అవుతూవుందినువ్వు కూడా  చూడు"  అని రాత్రి 9 గంటలకు చెప్పాను.  వాడు చూడటానికి బయటికి వచ్చాడు. పాపం వాడికి కనపడలేదు.  అదే బాబా వారి లీల. అతను చాలా  బాధ పడ్డాడు తరువాత రోజు ఆఫీస్ లో కనపడినప్పుడు  మేడం, నాకు కనపడలేదునేను మంచి భక్తుడిని కాదేమో" అని వేదన పడ్డాడు. నేను వాడి బాధ చూడలేక " ఏదో రూపంలో రేపు కనపడతాడులే,బాధ పడకు" అని చెప్పాను.  కాదు,బాబానే నాతో చెప్పించారేమో మరి.  వాడికి ఒక చిన్న లేడీస్ కార్నర్ షాప్ ఉంది.  ఉదయం 6 .00 గం. నుంచి మధ్యాహ్నం  2.00. వరకు ఆఫీస్ లో పని చేస్తాడు.  మధ్యాహ్నం 3 గం. నుంచి  రాత్రి 9 గం. వరకు షాప్ లో ఉంటాడు. తరువాత రోజు సంబల్పూర్ లో కుండపోతగా వర్షం పడింది.  రెండు రోజులు అలా పడుతూనే ఉంది. ఇంక చంద్రుడు రాలేదు. బాబావారు రాలేదు. వాడి కోరిక అలాగే ఉండి పోయింది. అలా బాధ పడుతూనే వున్నాడు. ఇంతలో వాడు షాప్ లో కూచొని ఉండగాషాప్ ముందు ఒక పెద్ద సైజ్ బ్యానర్ ఒకటి ఆ వాన నీటిలో తేలుతూ వచ్చి వాడి షాప్ ముందు ఆగింది.  వాననీళ్లు విపరీతంగా కాలువలై ప్రవహిస్తున్నాయి. కానీ ఆ బ్యానర్ మాత్రం వాడి షాప్ ముందు ఆగిపోయింది.  వాడు అంత వానలో షాప్ తెరిచి చూసాడు" ఏమిటి ఇదిఅస్సలు పోవటం లేదు అని,చూస్తే అది పెద్ద బాబా ఫోటో" ఇంక వాడు ఆ ఫోటో చూసి ఆగలేక పోయాడు. కళ్ళలో నీళ్లతో నాకు ఫోన్ చేసి అంతా వివరంగా చెప్పాడు. అప్పుడు నేను అన్నాను,"చంద్రుడిలో చూడకుంటే ఏమి సదా,బాబా ప్రవహించే నీటిలో నీ చేతికి అందినాడు,ఇంక బాధ పడకు" అన్నాను. 
            Image result for images of baba poster in rain water
ఈ లీలను ప్రతి వాళ్ళు అర్థం చేసుకోండి. బాబా తత్వం అర్థం అవుతుంది. ఇంతకన్నా నేను ఏమి చెప్పలేను." ఓం సర్వాంతర్యామినే నమః" అని మాత్రం బాబా ను నమ్ముదాము..
 "సర్వం సాయి నాధార్పణ మస్తు."

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List