26.11.2019 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులందరికి బాబా వారి శుభాశీస్సులు
సంకల్ప బలం - బాబా లీల
ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు తమకు జరిగిన అధ్భుతమయిన బాబా లీలను పంపించారు. దానిని యధాతధంగా ప్రచురిస్తున్నాను. మన మనసులో సంకల్పం ఉండాలే గాని, మనం అనుకున్నట్లు బాబాయే జరిపించుకుంటారు. మనకి సంకల్పం కలిగినపుడు మనం ఏవిధంగా చేయాలనుకుంటామో, ఆ సమయానికి ఆవిధంగా చేయడం ప్రారంభించాలి. కాలం ఎవరికోసం ఆగదు. మనం కూడా ఎవరికోసం ఆగకుండా బాబా పని మనం అనుకున్నట్లుగా ప్రారంభిస్తే జరిగే విధానం బాబా చూసుకుంటారు. ఈ సత్యాన్ని తెలిపే అధ్భుతమయిన లీల ఇప్పుడు మనమందరం తెలుసుకుందాము.
త్యాగరాజు
"ఓం సాయి రాం" సాయి బంధువులందరికి.
ఇప్పుడు నేను రాయబోయే లీల ఈ నవంబర్ 23 న సత్యసాయిబాబా జయంతి సందర్బంగా జరిగింది. ఈ అధ్బుతాన్ని చూసి నమ్మలేకుండా వున్నాను. బాబా ఎంత కృప చూపారో తలచుకుంటే ఒడలు గగుర్పొడుస్తుంది. ఆశ్చర్యం..ఆనందం కలుగుతుంది.
"ఆరోజున మేము విశ్వసాయి ద్వారాకామాయి సభ్యులందరము కలసి విశ్వశాంతి కోసము షిర్డీ సాయి గాయత్రీ మహా మంత్ర జపం చేసుకుంటున్నాము విశ్వవ్యాప్తంగా ఒక కోటి సాయి గాయత్రీ చెయ్యాలని,దత్తజయంతి (అనగా డిసెంబర్ 12th) లోపు..అని మా సంకల్పము. ఆ సందర్బంగా నేను భువనేశ్వర్ లో ఒక బాబా మందిరం లో చేద్దామనుకున్నాను. నాకు తెలిసిన వాళ్ళకు అందరికి ఆరోజున రమ్మని చెప్పాను. అందరూ వస్తామన్నారు. ఆరోజు అనగా ఈ నెల నవంబరు 23వ.తారీకున నేను ఎంతో నమ్మకంతో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ రాలేదు. నాకు చాలా దుఃఖం కలిగింది. అయ్యో,ఎవ్వరూ రాలేదు, సంధ్య ఆరతి సమయం కూడా దాటిపోయింది,ఇంక రారు అనుకొని కళ్ళు మూసుకొని ఒక్కదాన్నే నాకు వీలు అయినంత సాయి గాయత్రీ మంత్ర జపం చేసుకుంటాను అనుకొని మనసులో మొదలు పెట్టాను. 25 సార్లు చేసి ఉంటానేమో నాకు తెలీదు. కాని నేను ఒక్కమాల అంటే 108 చేసి కళ్ళు తెరిచేసరికి 20 మంది నా వెనకాల వున్నారు.ఎక్కడ నుంచి వచ్చారో...బాబా కే తెలియాలి.
వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. మనం ఏ పని చేయాలన్నా సంకల్పబలం ఉండాలి అంటారు పెద్దవాళ్ళు. మంచి సంకల్పబలం ఉన్నవాళ్లకు దైవం ఎప్పుడూ సహాయకంగా ఉంటాడు అన్నది అక్షరసత్యం. ఆరోజు బాబా నా కార్యాన్ని అలాగే జయప్రదం చేశారు. సత్యసాయిబాబా జన్మదినం రోజు షిర్డీ సాయి గాయత్రీ మంత్ర జపం అఖండంగా జరిగింది. వచ్చిన వాళ్లలో ఎవరో జీడిపప్పు కేక్ తెచ్చారు. అవి బాబాకు నైవేద్యంగా సమర్పించాను. బాబా తిన్నట్టుగా కేక్ మీద చీలికలు కూడా కనబడ్డాయి. అందరూ ఎంతో ఆనంద పడ్డారు.
బాబా ప్రసాదం తీసుకొని అందరూ వెళ్లిపోయారు. నేను ఆ బాబా మందిరం నుంచి బయటికి వచ్చేసరికి ఒక్కరు కూడా లేరు. ఎలా వచ్చారో, వాళ్ళు ఎవరో, అంత త్వరగా ఎలా వెళ్ళారో.. అంతా బాబాకే తెలియాలి. నా జీవితంలో జరిగిన అద్భుతమైన లీల ఇది. విశ్వశాంతి కోసం చేసే ఈ దైవకార్యం లో సాయి బాబా సహాయకారిగా ఉంటారని నేను ఘంటాపథం గా చెప్పగలను.

" సర్వం సాయి నాధార్పణమస్తు"....మాధవి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
4 comments:
సాయి రాం..🙏🙏
ఓం సాయిరాం..
If baba is with us he will arrange everything for us according to our wish.
Sairam
Post a Comment