28.11.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 6 వ.భాగమ్
శ్రీ సాయిబానిసగారు నిజజీవితంలో 1993 లో షిరిడీ యాత్ర చేసారు. షిరిడీలో చావడిలో శ్రీశివనేశన్ స్వామీజీ గారిని దర్శించుకొన్నారు.
ఆయన చావడిలో భజన చేస్తున్న సమయంలో ఆయన శిష్యురాలు ఒక నల్ల జాతి స్త్రీ, పేరు క్రిస్టియాన సాయిబానిసగారితో మాట్లాడుతు తనకు ఆకలిగా ఉన్నది అని తనకు ప్రక్కనేఉన్న హోటల్ లో పూరీ, కూర కొనిపెట్టమని కోరింది.
సాయిబానిసగారు ఆమె చిన్న కోరికను తీర్చారు. ఆమె సంతోషముగా తిరిగి శివనేశన్ స్వామీజీ గారి వద్దకు వచ్చి శ్రీసాయి భజనలు చేయసాగింది. ఆ స్త్రీ తిరిగి 2019 వ సంవత్సరములో సాయిబానిసగారికి స్వప్నదర్శనము ఇచ్చి తనతో ఆయనను ఆఫ్రికా ఖండములోని కాంగో అనే చిన్నదేశానికి తీసుకొనివెళ్లింది. ఆ అడవిలోని గ్రామము తన పూర్వీకులది అని చెప్పి అక్కడి అడవిజాతివారికి మరియు గ్రామవాసులకు పరిచయము చేస్తూ వీరిపేరు సాయి కృపానందజీ అని తెలియచేసింది. ఆ గ్రామములో కొందరు తెలుగు భాష తెలిసిన నల్లజాతీయులు ఉన్నారు. ఆగ్రామవాసులు సాయిబానిసగారికి సకల మర్యాదలు చేసారు. ఆ తరవాత అక్కడ సత్సంగము ఏర్పాటు చేసారు.
ఆ సత్సంగములో ఆయన తూర్పుదిక్కు ఎటువైపు అని వారిని అడిగారు. కొందరు దిక్సూచి తేవడానికి వెళ్లారు. ఇంతలో ఆ సత్సంగములో కాళ్ళకు పోలియోవ్యాధితో బాధపడుతున్న ఒక యువకుడు తెలుగుభాషలో సాయిబానిసగారితో భగవంతుని గురించి మాట్లాడేవారికి దిక్కులు, తిధి, వార నక్షత్రాలు అవసరములేదు. మీరు మీఉపన్యాసమును ప్రారంభించండి అని గట్టిగా అరచాడు. సాయిబానిసగారు ఆశ్చర్యముతో ఆ యువకుడి దగ్గరకు వెళ్ళి చూసారు. ఆ యువకుడు పూర్వజన్మలో ఆంధ్రరాష్ట్రములోని ముమ్మిడివరం బాలయోగి.
సాయిబానిసగారు ఆ పోలియోగ్రస్తుడయిన యువకునికి పాదనమస్కారము చేసి అక్కడ ఉన్న గ్రామవాసులకు భగవంతుడు ఈయువకుని రూపములో మీమధ్యనే ఉన్నాడు. మీరు ఈ యుకుని ఆదేశాలు పాటించుతూ భగవంతుని దర్శించండి అన్నారు.
అక్కడ ఉన్న షిరిడీసాయి భక్తురాలు క్రిష్టియానా సాయిబానిసగారిని మీరు శ్రీసాయి కృపానంద్ గా మరుజన్మలో ఆఫ్రికా ఖండములో శ్రీషిరిడీసాయి తత్త్వప్రచారము చేయాలి అని ఆదేశించారు.
ఈ మానవాళిలో మానవత్వానికి మారుపేరు శ్రీషిరిడీసాయిబాబా. తన భక్తురాలు బయిజాబాయి ఋణము తీర్చుకోవడానికి ఆమె కుమారుని ప్రాణాన్ని కాపాడటానికి తన ప్రాణాన్ని ఇచ్చిన మహాత్యాగి శ్రీసాయి. ఈ విషయాలు శ్రీసాయి సత్ చరిత్రలో విపులముగా చెప్పబడినది.
ఇక సాయిబానిస జీవితంలో ఒకనాటి రాత్రి కలలో బాబావారు శ్రీసాయిబానిసను హిందీ సినిమా గైడ్ ను చూడమని ఆదేశించారు.
బాబా ఆదేశానుసారం సాయిబానిస గారు సికింద్రాబాద్ లో ప్రదర్శించబడుతున్న గైడ్ హిందీ సినిమా చూడటానికి వెళ్ళారు. ఆ సినిమాలో కధానాయకుడు రాజస్థాన్ లో వర్షాలు లేక పంటలు లేక కరువు కాటకాలతో బాధపడుతున్న ఆ గ్రామప్రజలను చూసి వారికోసం దైవప్రార్ధనలు చేస్తూ తను ఉపవాసదీక్ష చేస్తు ఆఖరులో భగవంతుని దయతో వర్షాలు పడుతున్న సమయంలో ఆ కధానాయకుడు తన ప్రాణాలను వదిలాడు.
(గైడ్ చిత్రంలో దీనికి సంబంధించిన సన్నివేశాన్ని చూడండి)
మానవత్వముతో తోటిమానవుల ప్రాణాలు కాపాడినవారు 1918 వ.సంవత్సరములో తన శరీరాన్ని వదలిన శ్రీషిరిడీసాయినాధుల వారిని గైడ్ సినిమాలో కధానాయకుడు రాజు పాత్రలో శ్రీసాయిని చూడగలిగానని సాయిబానిసగారు స్వయంగా చెప్పారు. ఆయన దృష్టిలో గైడ్ సినిమాలో కధానాయకుడుగా నటించిన ప్రఖ్యాత నటుడు శ్రీదేవానంద్ ధన్యజీవి. గైడ్ సినీకధను రాసిన రచయిత చిరంజీవిగా నిలిచిపోతాడు.
(ఇంకా ఉన్నాయి)
(తరువాయి భాగం వచ్చే ఆదివారమ్)
మానవత్వముతో తోటిమానవుల ప్రాణాలు కాపాడినవారు 1918 వ.సంవత్సరములో తన శరీరాన్ని వదలిన శ్రీషిరిడీసాయినాధుల వారిని గైడ్ సినిమాలో కధానాయకుడు రాజు పాత్రలో శ్రీసాయిని చూడగలిగానని సాయిబానిసగారు స్వయంగా చెప్పారు. ఆయన దృష్టిలో గైడ్ సినిమాలో కధానాయకుడుగా నటించిన ప్రఖ్యాత నటుడు శ్రీదేవానంద్ ధన్యజీవి. గైడ్ సినీకధను రాసిన రచయిత చిరంజీవిగా నిలిచిపోతాడు.
(ఇంకా ఉన్నాయి)
(తరువాయి భాగం వచ్చే ఆదివారమ్)
0 comments:
Post a Comment