10.06.2011 శుక్రవారము
పిచ్చుక రూపంలో వచ్చిన బాబాఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఈ రోజు మనము శ్రీమతి ప్రియాంకా గారి ఆంగ్ల బ్లాగులోని ఒక బాబా లీలను తెలుసుకుందాము. బాబా సర్వాంతర్యామి. మనము యెక్కడవున్న, యేమి చేస్తున్నా, మన మన మనసులో యేది అనుకున్న ఆయనకి తెలుస్తుందని గ్రహించుకుంటే, బాబా మనతోనే యెప్పుడు ఉన్నారన్న అనుభూతి మనకి కలుగుతుంది.
సాయిరాం
భగవంతుడిని గురించి తెలుసుకోవడమనేది మన మనస్సుమీద ఆథారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆత్మ కనపడకుండా ఒక గట్టి తెర అడ్డుగా ఉండటంతో మనము ఆత్మ ని చూడలేకపోతున్నాము. మనం ఆ తెరని కనకఒక్కసారి అడ్డు తొలగించుకుంటే మనలో ఉన్న సాయిని సులభంగా చూడగలము. సాయి అంతటా నిండి ఉన్నాడు. ప్రేమ, నమ్మకం అనే గాజు ద్వారా ఆయన గోచరమవుతాడు. ఈ రోజు నేను షాలిని గారి మథురమైన బాబా అనుభూతినిప్రచురిస్తున్నాను. ఆమె అనుభవాన్ని చదివితే సాయి అంతటా నిండి ఉన్నాడని మనం అడ్డు తెరను తొలగించుకోవడమేఅని అర్థమవుతుంది. ... మీ అందరికోసం నేను షాలిని మైల్ ని జత చేస్తున్నాను.
ఓం సాయిరాం .. నమస్కారం ప్రియాంకా గారు, యెలా ఉన్నారు? ఈ మథ్యనే నేను మీ బ్లాగును చూడటంతటస్థించింది. షిరిడీ సాయిబాబా గారి శక్తి , ప్రేమని ప్రజలందరు తెలుసుకునేలా మీరు చేస్తున్న సేవకి నేను చాలాముగ్థురాలినయ్యాను. అప్పటినించి నేను ప్రతీరోజు రాత్రి పొద్దుపోయేదాకా అనుభవాలన్నిటినీ చదువుతూ ఉంటాను. అవై చదువుతుంటే నేను యెంతో సంతోషిస్తాను అది నా భాగ్యం అనుకుంటాను. బాబా తో నాకు కలిగిన అనుభూతినిచెపుతాను. వీలయితే దీనిని మీ బ్లాగులో ప్రచురించండి. ఒకవేళ ఇది పెద్దదిగా ఉంటే చెప్పండి, నేను దీనిని చిన్నదిగాచేసి పంపుతాను.
శ్రీ షిరిడీ సాయి బాబాతో నా స్వీయానుభవాన్ని మీఅందరితో కలిసి పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగాఉంది. ఇప్పుడు నేను యూ. ఎస్. లో ఉన్నాను. కాని నేను భారతదేశంలో హైదరాబాదు లో ని ఒక మథ్య తరగతికుటుంబం లోనిదానిని. మేము ముగ్గురం అక్కచెళ్ళెళ్ళం. మా తల్లితండ్రులు మాకు మంచి చదువులు చెప్పించటానికిచాలా కష్ట పడ్డారు., యింకా వాళ్ళు చేయగలిగినదంతా చేశారు. మా నాన్నగారు గొప్ప సాయి భక్తులు. అందుచేతచిన్నప్పటినించి ప్రతీ గురువారము మా యింటిలో పూజ చేస్తూ ఉండేవారము. నా చిన్నప్పటినించి నేను బాబాసాన్నిహిత్యాన్ని చవి చూశాను. ఆయన నా జీవితంలో ప్రతీ విషయంలోను నడిపించారు.
1) మా అమ్మగారు పాఠశాలలో ఉపాథ్యాయురాలు. యింటి దగ్గిర కూడా చదువు చెపుతూ ఉండేది. నా తల్లితండ్రులనుసంతోషపెట్టడానికి నేను కూడా యేదైనా చెయ్యాలి అనుకునేదాన్ని. ఆర్థికంగా కాకపోయినా యేదో కొంత చేద్దామని. ఫీజులేకుండా మంచి కళాశాలలో య్లింటర్మీడియెట్ లో చేరడానికి నాకు మంచి మార్కులు యిమ్మని సాయిబాబాని ప్రార్థించేదాన్ని. నా శాయశక్తులా నేను చేయగలిగింది చేసి మిగిలినదంతా బాబా కే వదలివేసేదాన్ని. ఆశ్చర్యకరంగాబాబా అనుగ్రహంతో నాకు ఎస్.ఎస్.సీ లో రాష్ట్రంలో మూడవ రాంక్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నించి నాకు నగదుబహుమతి, యింటర్మీడియెట్లో ఉచితంగా ప్రవేశం, ఉచితంగా పుస్తకాలు లబించాయి. 2) బాబా దయ వల్ల నాకు మంచియింజనీరింగ్ కళాశాలలో ప్రవేశం లబించింది. కళాశాలనించి వచ్చిన తరువాత నేను యింటిదగ్గిర హైయ్యర్ స్టూడెంట్స్కి పాఠాలు చెపుటు ఉండేదాన్ని. నేను చేయగలిగిన ఈ చిన్న సహాయం మా కుటుంబానికి చేసేదాన్ని. ఒకసారి మాయింటిలో కరెంట్ బిల్లులు చెల్లించని కారణంగా ఒకటి తరువాత ఒకటిగా 3 నెలలలపాటు కరెంట్ లేని సందర్భంకలిగింది. ఈ పరిస్థితినించి బయట పడవేయమని, సహాయం చేయమని నేను బాబాని ప్రార్థించాను. బాబాప్రేమానురాగాలతో నాకు యూనివర్సిటీనించి బ్రాంచ్ టాపర్ మరియు కళాశాల టాపర్ గా వచ్చినందుకు రెండు బంగారుపతకాలు వచ్చాయి. మంచి మల్టి నేషనల్ కంపనీలో నాకు కాంపస్ ప్లేస్మెంట్ కూడా వచ్చింది. నా తల్లితండ్రుక కళ్ళలోసంతోషాన్ని చూశాను. యివన్ని కూడా బాబా అనుగ్రహంతోనే జరిగాయి. ఒకసారి ఉదయం మా అమ్మగారు నాకుగింజలు లేని యెండు ద్రాక్షపళ్ళు (షిరిడీనించి తెచ్చినవి) సాయంత్రం ఆఫీసునించి తిరిగి వచ్చాక తినడానికి యిచ్చారు. సాయి సచ్చరిత్రలోని అథ్యాయం మీకు గుర్తుండే ఉంటుందని అనుకుంటున్నాను. అందులో బాబా గింజలున్న యెండుద్రాక్షపళ్ళని గింజలు లేనివిగా మారుస్తారు. నేను ఈ లీలని గురించి ఆలోచిస్తూ, నామీద కనక ప్రేమ ఉంటే నేనుతినబోయే తరువాతి దానిలో గింజ ఉండాలని బాబాని ప్రార్థించాను. నేను సంతోషంలో మునిగిపోయాను యెందుకంటేనేను తరువాత తిన్న పండులో గింజ ఉంది. అంతకుముందు తిన్న వాటిల్లోనూ, తరువాత తిన్నవాటిల్లోనూ దేనిలోకూడా ఒక్క గింజ కూడా లేదు.
2) నువ్వు కనక స్వచ్చమైన హృదయంతో, మనస్సుతో నమ్మితే, చిన్న సంఘటనలలో కూడా బాబా తన ఉనికినిచాటుతారు.
3) 3. ఇప్పుదు యూ.ఎస్. లొ నా బాబా అనుభూతి ప్రారంభమవుతుంది. నాకొచ్చే జీతం సరిపోదు కాబట్టి నాకుటుంబానికి సహాయపడటానికి పై చదువుల కోసం అమెరికా వచ్చాను. బాంక్ నుంచి అప్పు తీసుకుని బాబా దయతోడిసెంబరు 2008 లో నేను మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాను. ప్రస్తుత పరిస్థితులలో మార్కెట్ యెలా ఉందో మీకు తెలుసు. అప్పటినుంచి నాకు ఉద్యోగం రాలేదు, రోజు రోజుకీ నేను కృశించిపోతున్నాను. అమెరికాలో కూడా తన ప్రేమని, ఉనికినిచూపించమని బాబా ముందు రోదించాను. నేను భారతదేశంలో ఉన్నప్పుడు ఆయన చిన్న విషయాలలో కూడా నేనుకోరినప్పుడు తన లీలలను చూపెడుతూ ఉండేవారు.
4) కాని ఇక్కడ ఇక్కడ నాకు సహాయం చేయడానికి. యూ. ఎస్ చుట్టుపక్కల బాబా లేరేమో అని యెందుకనో ఆ భావంకలిగింది. తన ఉనికిని చూపమని నేను బాబాని ప్రార్థించినప్పూడు ఆ రోజు నా గదిలోకి ఒక పిచ్చుక యెక్కడినించోవచ్చింది. నా గదిలో పిచ్చుకని చూసి నేను ఆశ్చర్యపోయాను. అది నా గదిలో కూర్చుంది. నేను కొంచెం భయపడిబయటకు వెళ్ళి హాలులో కూర్చున్నాను. అప్పుడు బాబాని ప్రార్తించాను....నువ్వే కనక పిచ్చుకగా నా గదిలోకి వస్తే, ఆకాశంలోకి క్షేమంగా వెళ్ళిపో".. నా మదిలో ఈ ఆలోచన వచ్చిన మరుక్షణమే పిచ్చుక బయటికి వచ్చియెగిరిపోయింది. ఇది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. బాబా నా కళ్ళు తెరిపించి తాను సర్వంతర్యామిననినేను గ్రహించేలా చేశారు. ఆయన తన భక్తులకోసం సప్తసముద్రాలనైనా దాటి రాగలరు. యింతవరకు నాకు ఉద్యోగంరాలేదు. కాని నాకు తెలుసు యేది జరిగినా అది మనమంచి కోసమే జరుగుతుందని. సాయిబాబాకి తెలుసు మనకుయెప్పుడు యేది ఇవ్వాలో. ఇక్కడ నాకు పీ.హెచ్.డీలో ప్రవేశం దొరికింది మంచి థన సహయం కూడా లభించింది.
5) మన గురించి బాబా మనసులో యేముందో మనకి తెలియదు. బాబా తన బిడ్డలనెప్పుడు ప్రేమిస్తారు తనుఇవ్వగలిగినది ఇస్తారు.
6)
7) నా అనుభవాని మీరందరూ చదివినందుకు థన్యవాదాలు. బాబా తన ప్రేమతో, అభిమానంతో మిమ్ములనందరినిదీవించు గాక.
8)
9) ఓం సాయినాథ్ మహరాజ్ కీ జై
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment