01.06.2018 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ స్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ –21 వ.భాగమ్
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
అట్లాంటా (యూ ఎస్ ఎ) - ఫోన్ : 1 571 5947354
21.12.1971 : స్వామీజీ ఈ రోజు ‘సమత్వ’ భావం
గురించి ప్రసంగించారు. ‘సమత్వం
యోగ ఉచ్యతె…”
యోగస్థః కురుకర్మాణి
సజ్ఞ్గం త్యక్త్వా ధనంజయ
సిధ్ద్య సిధ్ధ్యోః సమో భూత్వాసమత్వం యోగ ఉచ్యతే అ.2 శ్లో.48
ఓ! అర్జునా !
జయాపజయములందు ఆసక్తిని విడనాడి విద్యుక్త ధర్మమును నిర్వహింపుము. అట్టి
సమభావమే యోగమనబడును.
సమత్వమనగా సమ దృష్టి.
ప్రతీదీ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. వచ్చినదానికి
సంతోషించకుండా, పోయిన దానికి విచారించకుడా సమభావం కలిగి ఉండటమే సమబుధ్ది లేక సమదృష్టి. అవిధంగా సమబావం ఉన్న వ్కక్తికి దేనియందూ యిష్టము గాని అయిష్టము గాని ఉండవు. అటువంటి
వ్యక్తి ప్రపంచంలో జరిగే సంఘటనలన్నిటినీ సమబావంతో వీక్షిస్తూ ఉంటాడు. అతని
మనసులో గాని ఆలోచనలలో గాని ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. వ్రతాలు
చేయడం గాని శృతులను శ్రవణం చేయడానికి
గాని గల ముఖ్యమయిన కారణం,
కోరికలను జయించి చివరికి సమభావాన్ని పెంపొందింపచేసుకోవటానికే.
సమత్వ భావం కలిగిన మానవుడు వైభోగాలలో తేలియాడుతున్నపుడు ఎక్కువ కాలం జీవించాలని గాని, కష్టాలలో ఉన్నపుడు చావు కావాలని గాని కోరుకోడు. ఇఛ్ఛ వచ్చినంత కాలం జీవించి ఆ తరువాత తాను కోరుకున్న ప్రకారం తనువు చాలిస్తాడు. అటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి ఉన్నతమయిన సంపద సమత్వం మాత్రమే. అటువంటి వ్యక్తికి ఉదాహరణే శ్రీరమణ మహర్షి.
ఆయన దృష్టిలో ఈ ప్రపంచంలో కనిపించేవాటి అన్నిటి మీద సమత్వ భావమే. దేనియందు అనుబంధాన్ని పెంచుకోలేదు.
ఆ విధంగా జీవనాన్ని సాగించినవారిలో శ్రీ చంద్రశేఖర బారతి, సాయిబాబా మొదలయినవారున్నారు. బాబా ఎప్పుడూ పెద్దపెద్ద భవనాలలో నివసించలేదు. అయినా ఎంతో సంతృప్తిగా జీవించారు.
అలాగే నువ్వు కూడా నీకున్న దానితో తృప్తి చెందాలి. ఇతరుల వైభోగాన్ని చూసి అసూయ చెందరాదు. వాస్తవంగా చెప్పాలటే ఈ అసూయకి అంతం అనేది లేదు. ఎవరికేది ప్రాప్తమో అది వారికి లభిస్తుంది. ఇతరులకు ఎన్నో సంపదలు వచ్చి చేరవచ్చు. దానిగురించి మనం అనవసరంగా అటువంటివారి మీద అసూయ చెంది మన శక్తిని వ్యర్ధం చేసుకోవడంలో అర్ధం లేదు. ఈర్ష్య, అసూయలను విడనాడమని మన శాస్త్రాలు మనకి నిర్దేశించాయి. ఈ ప్రపంచంలో అందరి క్షేమం కోరుకోమనే మనకి శాస్త్రాలు ఉపదేశించాయి. మనం ఇతరుల చెడు కోరుకుంటే మన మనస్సు కలుషితమయిపోతుంది. సమత్వ భావం ఉన్న వ్యక్తి ప్రతివారి క్షేమాన్ని నిజాయితీగా కోరుకొంటాడు. అటువంటి వ్యక్తి ఎంతో స్వతంత్రుడుగాను, ఉదారుడుగాను, నిజాయితీగాను ఉంటాడు. అటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో జరిగే ఏ సంఘటనలకి చలించడు. కష్టనష్టాలకి, సుఖ దఃఖాలకి అతీతంగా ఉంటాడు. అలాంటి వ్యక్తులను మితృలు, శతృవులు అందరూ యిష్టపడతారు. ఈ విశ్వంలో అటువంటి వ్యక్తి ఎవ్వరి చెడును కోరడు. ఎన్నో దుర్గుణాలు కలిగినవారు కూడా సమత్వ భావం ఉన్నవారిని ప్రేమిస్తారు. సమచిత్తం కలవారికి కూడా ఎంతో దూరదృష్టి ఉంటుంది. మనం వారి అడుగుజాడలలో నడవాలి. అందువల్ల ఈ ప్రపంచంలో మనకు లభించిన ఉత్తమమైన అవకాశం ఏమిటి? భగవంతునియందు ఆయన చర్యలయందు పరిపూర్ణమయిన విశ్వాసం నిలుపుకోమనే అధ్బుతమైన అవకాశం లభించింది. భగవంతునియందు అచంచలమయిన విశ్వాసం ఉన్న వ్యక్తి భగవదారాధనలో ఉన్నటువంటి అన్ని ఆచార వ్యవహారాలనుండి తనకు తానే విముక్తి పొందుతాడు. అటువంటి వ్యక్తిలో ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకాశవంతంగా గోచరిస్తుంది. నీ హృదయంలోనే భగవంతుడు నివసిస్తున్నాడనే భావం నీలొ బలంగా ఉన్నపుడు యిక కర్మయొక్క ప్రభావం ఎందుకుంటుంది?

ఇక గృహస్థాశ్రమంలో ఉన్నవారి
కోసం స్వామీజీ చెప్పిన మాటలు. “నీ
భార్యా పిల్లలతో నువ్వు జీవించినంత కాలం నీధర్మాన్ని నీవు నిర్వర్తించాలి. వారికి
కావలసిన అవసరాలన్నీ సమకూర్చాలి. అది
కూడా భగవంతునికి నీవు నిర్వర్తిస్తున్న విధేనని తెలుసుకో. అనుబంధాన్ని
పెంచుకోకుండా ఉండాలి. ప్రతీదీ
కూడా ‘పరమేశ్వర ప్రీత్యర్ధం’ అని
అనుకుంటూ ఉండాలి. నిజమయిన
భక్తుడు ‘అంతా ఆయనదే’ అనే
భావంతొ ఉంటాడు. అలా
అనుకున్నపుడె భగవానుడు మనకి అభయమిచ్ఛిన మాట ‘యోగక్షేమం వహామ్యహం’ నిజమవుతుంది. ఇదే
సమత్వ భావానికి స్ఫూర్తి.
24.12.1971 : ఈ రోజు స్వామీజీ
తనకు ఈ మధ్యనే వచ్చిన
స్వప్నం గురించి చెప్పారు.
“కలలో
నా ప్రక్కనే వ్యాస
మహాముని నుంచుని ఉన్నారు. వ్యాసులవారు
నన్నిలా ప్రశ్నించారు. ‘మానవుడు పాపపుణ్యాలకు అతీతంగా ఏవిధంగా పయనించగలడు? వ్యాసులవారినుంచి
ఈ ప్రశ్న రాగానే నా చుట్టురా ఒక
పెద్ద నది ఒడ్డు కనిపించింది. అది
చాలా అందంగా ఉంది. అక్కడ
నది ఒడ్డున ఒక వ్యక్తి తన
గుఱ్ఱాన్ని నీటితో కడుగుతున్నాడు. ఆవ్యక్తి
అర్జునుడు అయి ఉండవచ్చనిపించింది నాకు. ఆ
గుఱ్ఱం తన శరీరాన్ని విదిలించుకుంటూ
ఉంది. వ్యాసులవారు
ఆ గుఱ్ఱాన్ని నాకు చూపించారు. గుఱ్ఱం
తన శరీరాన్ని విదిలించుకుంటున్న విధంగానె, భగవంతుని గురించి తెలుసుకోవడం ద్వారా పాపపుణ్యాలను విదిలించుకోవచ్చని వివరించారు. ఈ
అనుభవాన్ని చూపించిన తరువాత విషయవాసనలనించి ఏవిధంగా బయటపడాలి అని వ్యాసులవారు అడిగారు. దీనికి
సమాధానంగా వ్యాసులవారు స్వామీజీకి పడగమీద మణి ఉన్న సర్పాన్ని చూపించారు. ఆ సర్పం
నేలమీద ప్రాకుతూ ఉంది. దాని
అర్ధం విషయవాసనలనేవి సర్పంలాంటిది. జన్మజన్మలకు
వెంటాడుతూనే ఉంటాయి. సర్పం
పడగమీద ఉన్న మణి జీవాత్మ. అందుచేత
ఆత్మజ్ఞానం ద్వారా వాసనలను తొలగించుకున్నచో జీవాత్మకు మోక్ష లభిస్తుంది.
29.12.1971 : ఈ రోజు వైకుంఠ
ఏకాదశి. భగవన్నామ
స్మరణ, దానియొక్క విలువ గురించి స్వామీజీ వివరించారు. నిరంతరం
భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండటం వల్ల మన హృదయంలో ఒక
బలమయిన కోటను నిర్మించుకోగలం. భక్తి
మార్గంలో మనకు ఎదురయే ఐహిక ప్రభావాలనుండి మనలను రక్షించుతుంది. ప్రగాఢమయిన
నమ్మికతో భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ ఉండటం వల్ల అది మనలని సంసార సముద్రాన్ని సులభంగా దాటడానికి దోహదపడుతుంది. ఈ
కలియుగంలో మోక్షాన్ని సాధించాలంటే భగవన్నామస్మరణే అత్యుత్తమమయిన, సులభమయిన పద్ధతి.
గాయత్రి మంత్రోపదేశం ఉన్నవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా జపిస్తూ ఉండాలి. అది వారి లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. ఈ రోజుల్లో కనీసం రోజుకు పదిసార్లయినా గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నాము అని ఎవరయినా ధైర్యంగా చెప్పగలరా? మేధావులు కూడా మందమతులుగా ఉండటానికి కారణమేమిటో తెలుసా? వారు నిత్యం గాయత్రి మంత్రాన్ని జపించకపోవడం వల్లనే. అందరికీ తినడానికి, వినోదాలకి, అనవసరమయిన చర్చలకి అన్నిటికీ సమయం ఉంటుంది. కాని, ప్రతిరోజు కనీసం పది నిమిషాలయినా గాయత్రి మంత్ర జపానికి కాని, భగవన్నామ స్మరణ చేయడానికి గాని సమయం కేటాయించలేకపోతున్నారు.

(స్వామీజీ గారి సంభాషణలు రేపటితో ఆఖరి భాగమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment