29.04.2019 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –23 వ.భాగమ్
YOU
BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP
WITH GOD
LORRAINE
WALSHE RYAN & FRIENDS
Lorren Walsh e mail.
shirdi9999@hotmail.com
బాబాతో సాన్నిహిత్యమ్ - డైరీ లో ప్రచురించిన
సాయి భక్తుల అనుభవాలు - 23
(అనువాదం చేసి
ప్రచురించడానికి బాబా గారు కూడా తమ అనుమతిని లోరెన్ వాల్ష్ గారి ద్వారా ప్రసాదించారు)
ఫోన్ .. 9440375411 , 8143626744
ఈ రోజు కీర్తన చెన్నై గారు వివరిస్తున్న అత్యధ్భుతమైన బాబా
తీర్చిన కోరిక మనమందరం చదివి ఆనందిద్దాము.
నా చిన్న తనంలో మా అమ్మగారు బాబా కధలను చదివి వినిపిస్తూ
ఉండేవారు. అవి నాకు ఎంతో ఆనందాన్ని
కలిగిస్తూ ఉండేవి. నేను
నా బాల్యాన్ని పూర్తి సంతోషంతో గడవలేదు.
మా యింటిలో ఎన్నో సమస్యలు ఉండేవి. నా తల్లిదండ్రులు ఎప్పుడూ
ఎందుకనో బాధపడుతూ ఉండేవారు. నేను వారికి ఏవిధమయిన సహాయం చేయలేనందుకు నాకు కూడా బాధగా ఉండేది.
అయినప్పటికీ నేను భగవంతుడిని
సహాయం చేయమని కన్నీటితో ప్రార్ధిస్తూ ఉండేదానిని. ఒక రోజున మా మామయ్య మాయింటికి
వచ్చాడు. ఆయన
తనతోపాటు సాయిబాబా ఫోటోని తీసుకుని వచ్చాడు. అప్పటినుంచి నాకెప్పుడు బాధ కలిగినా,
అశక్తురాలినయినా బాబా ఫోటో ముందు కూర్చుని నా సమస్యలన్నీ చెప్పుకుని
ఆయన సహాయాన్ని అర్ధిస్తూ ఉండేదానిని.
ఆ సమయంలో భగవంతుడు నాప్రక్కనే కూర్చుని ప్రేమతో నన్ను
ఓదారుస్తున్నట్లుగా అనిపించేది. అటువంటి కష్టసమయాలలో బాబా నన్ను ఓదారుస్తూ ఉండేవారు. నేను పెద్దదాన్నవుతున్న కొద్దీ
బాబా మీద నా నమ్మకం కూడా వృధ్ధి
చెందసాగింది.
షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవాలనే కోరిక నాకు కలుగుతూ
ఉండేది. ఆఖరికి 2007వ.సంవత్సరంలో మా కుటుంబమంతా
షిరిడి వెళ్ళాము. ప్రయాణానికి
ముందు రోజు రాత్రి నేను బాబాతో ఎంతో ఉద్వేగంతో మాట్లాడుతూ ఆయనని “బాబా, నిన్ను
విగ్రహ రూపంలో చూడటం నాకిష్టం లేదు.
చాలా సంవత్సరాల క్రితం ద్వారకామాయిలో నువ్వు ఏవిధంగా ఉన్నావో
అదే రూపంలో నిన్ను ప్రత్యక్షంగా చూడాలని ఉంది నాకు. నిన్ను ఆవిధంగ చూసే అవకాశం నాకు
కలిగిస్తావా? నాకు
నువ్వు ప్రత్యక్షదర్శన భాగ్యం కలిగిస్తావా? నిన్ను చూడకుండా నేను
షిరిడీనుంచి సంతోషంగా తిరిగి రాలేను.
నాకు నిన్ను ప్రత్యక్షంగా దర్శించుకునే అదృష్టం ఉందో లేదో
నాకు తెలియదు. కాని
నేను మాత్రం నిన్ను సజీవంగా చూడాలి అంతె.
ఒక్కసారి నువ్వు నాకు కనిపిస్తే చాలు. నాకు నువ్వు కనిపించాలి బాబా”
అని వేడుకొన్నాను.
మరుసటిరోజు మేము షిరిడికి బయలుదేరాము. కోపర్ గావ్ లో దిగిన తరువాత
షిరిడీ వెళ్ళడానికి ఆటో కోసం చూసాము.
చివరికి
బేరమాడి ఆటోలో షిరిడీకి బయలుదేరాము. షిరిడీ చేరుకున్న వెంటనే మాకు
అందుబాటు ధరలో దొరికిన హోటల్ లో బసకు
దిగాము. సాయిబాబా
తోడుగా ఉండి మాకు అన్నివేళలా సహాయపడుతున్నారనిపించింది. ఆ విధమయిన తలంపు రాగానే నా మనసు
ఆనందంతో నిండిపోయి నా పెదవులపై చిరునవ్వు మెరిసింది.
మరునాడు మొట్టమొదటగా మేము ద్వారకామాయికి వెళ్ళాము. ధునిని దర్శించుకున్న తరువాత ఒక
పక్కకు వచ్చాము. అక్కడ
తలుపు ఎదురుగా ఒక మూల ఒక ఫకీరు కూర్చుని ఉన్నాడు. అతను పరిశుభ్రమయిన తెల్లని
దుస్తులు ధరించి ఉన్నాడు. తలకు తెల్లని గుడ్డ చుట్టుకుని ఉన్నాడు. ముఖంమీద ముడతలు ఉన్నాయి. కళ్ళు
నీలంగా ఉన్నాయి. ఒక
చేతిలో పళ్ళెం ఉంది. వణుకుతూ ఉన్న మరొక చేతి వ్రేలును పైకెత్తి చూపుతూ ఉన్నాడు. ఆ ఫకీరు సూటిగా నా కళ్ళల్లోకి
చూసాడు. ఆ నీలి
కళ్ళు ఇప్పటికీ నాకు బాగా గుర్తే. అతను చూసిన చూపులు ఎలా ఉన్నాయంటే అతనికి నేను బాగా తెలుసన్నట్లుగా ఉన్నాయి. అతని వదనం ఎంతో ప్రశాంతంగా ఉంది. అతనిని చూసిన వెంటనే ఆ ఫకీరే
బాబా అని నామనస్సు చెప్పినట్లుగా అనిపించింది. కాని నా మనస్సులో ఏదో చిన్న
అనుమానం. నేను
కోరుకున్నంతనే ఆయన నాకు కనిపిస్తారా?
నేను కోరుకున్నంతనే బాబా నాకు సశరీరంగా కనిపిస్తారా, ఏమో అలా జరగకపోవచ్చు అనే శంక నాలో కలిగింది. కాని బాబా అందరిలోను ఉన్నారనే
విషయం జ్ఞప్తికి వచ్చి, ఆ ఫకీరు బాబాకు నమస్కరించి వచ్చేసాను.
షిరిడీనుంచి వచ్చిన తరువాత అందరూ సంతోషంగా ఉన్నారు. కాని నాకు మాత్రం ఎటువంటి సంతోషం
కలగలేదు. ప్రతిక్షణం
నేను బాబా గురించే ఆలోచిస్తూ ఉన్నాను.
బాబా నువ్వు నాకు షిరిడీలో సశరీరంగా ఎందుకని కనిపించలేదని
ఆయనని అస్తమానూ అడుగుతూనే ఉన్నాను.
ఈ విధంగా ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా నామనస్సులో
నేను చూసిన ఫకీర్ బాబా రూపం తళుక్కున మెరిసింది.
వెంటనే నేను మా అమ్మగారు, సోదరి దగ్గరకు వెళ్ళి
ద్వారకామాయి లోపల తలుపుమూలన కూర్చున్న ఫకీర్ బాబాను చూసారా అని అడిగాను. వాళ్ళు చూడలేదని చెప్పారు. వాళ్ళలా చూడలేదని చెప్పగానే
బాబాను గుర్తించలేనందుకు నేనెంత మూర్ఖురాలినో అర్ధమయి బాగా ఏడుపు వచ్చింది. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి
బాబా యొక్క అసలు రూపంలో ఉన్న ఫోటో చూసాను.
నా వైపు చూస్తున్నది ఫకీర్ బాబా. నా ఎదురుగా బాబా కనిపించినా
ఆయనెవరో గుర్తించలేకపోయాను. ఒక సామాన్య మానవునిలా బాబా కూర్చుని ఉన్నారు. నా తల్లిదండ్రులు, నా సోదరి కూడా ఆ ఫకీర్ బాబాని చూసారనుకున్నాను. కాని ఆయన వాళ్ళకి కనిపించలేదు. బాబా నాకు మాత్రమే కనిపించారు. కాని, నేను
ఆయనే అని గ్రహించుకోలేకపోయాను. నా అజ్ఞానానికి మన్నించమని
బాబా ముందు ఎంతగానో రోదించాను. కాని బాబాను నేను చూసానన్న ఆనందం నాకు అప్పుడప్పుడూ కలుగుతూ ఉండేది.
బాబా తన భక్తుల కోరికలను నెరవేరుస్తారు. ఆయన మన ప్రక్కనే ఉన్నారు. మనలో ఉన్నారు. ఎల్లప్పుడూ ఉంటారు.
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
`
0 comments:
Post a Comment