Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 25, 2020

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు - బాబా సమాధానాలు - 2 వ.భాగమ్

Posted by tyagaraju on 12:15 AM
      vedas Archives - Page 11 of 42 - Sagar World

          Single Yellow Rose Flower Isolated On White Stock Photo, Picture ...

25.04.2020  శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులందరికి బాబావారి శుభాశీస్సులు

ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, దైదరాబాద్  ఫోన్.  9440375411  &  8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com


నా సందేహాలు – బాబా సమాధానాలు - 1  సాయి భక్తుల స్పందన
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై – చాలా మంచిప్రశ్న వేశారు.  అగ్గిపుల్లలను బాబాగారు అలా ఎందుకు చేసారో ఇప్పుడు మీద్వారా మేము కూడా తెలుసుకోగలిగాము. బాబాగారి ప్రతి చర్యలోను ఏదోఒక అర్ధమ్ ఉంటుంది అని అర్ధమయింది.
శ్రీ యఱ్ఱాప్రగడ ప్రసాద్ గారు, రాజమహేంద్రవరమ్ –
సుస్పష్టం గా... అత్యంత విశ్వాసం తో శ్రీ సాయి ఉండేవారు అని కాక.... ఉన్నారన్న భావంతో..
ఆయనతో భక్తి కంటే బాంధవ్యం పెంచుకున్నారు కాబట్టే ఒక్కోచోట ఒక్కో లా వచ్చింది. రిఫరెన్స్ లను ప్రోదిచేసి ప్రశ్న తానే అడిగించుకుని, సమాధానమూ తానే తెలిపి...
అన్నింటా తననే దర్శింపచేస్తున్న శ్రీ సాయి కి.. అందుకు ఆయన దగ్గర యోగ్యత పొందిన మీరు అదృష్టవంతులు..
*అన్వేషణ ఉంటేనే అంతరాత్మ అగుపిస్తాడు*

కేవలం సాయి చరిత్ర పరిచయము ఉన్న చాలామందికి అనుభూతి లేకపోవడానికి నాకు తెలిసిన కారణం...
*చరిత ను చదవడం కాదు..*
*పారాయణం చేయాలి* శ్రద్ద సబూరి అర్ధం అదే.
అలా పారాయణ చేస్తేనే కొద్దిగా కన్ఫ్యూషన్ గా కనిపిస్తూ అంతర్లీనంగ మనలో ఆయన చేరి ఆయన కధని మనకు ఆయనే వివరిస్తారు.. (మీ అనుభవం లా )...
కావలసిందల్లా శ్రద్ద సబూరి.. అమ్మయ్య వారంలో చదివేశా అనే ఒక పుస్తకం  కాదు వారం సాయితో గడపడం.. తెలిసే కాదు తెలియకుండా కూడా మనకు ఎన్నో మహిమలు జరుగుతాయి.
ప్రత్యక్షం గా కావాలంటే...

సాయి ఇంట్లో నే కాదు ఒంట్లో, ఉండాలి


శ్రీమతి శారద, ముంబాయి – అవధూతల గురించి మంచి వివరణ ఇచ్చారు.  బాలకరామ్ ఉదాహరణ సత్ చరిత్ర పాఠకులకు సులభంగా అర్ధమయ్యేటందుకు తోడ్పడుతుంది.  మీ సందేహం చిన్నదిగా కనబడుతూనే సాయి అవతార తత్త్వాన్ని తెలియచేసింది.  మీకు బాబా తెలిపిన విషయాన్ని మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు.

శ్రీ పార్ధసారధి గారు,  పాలకొల్లు – క్రమం తప్పకుండా వీటిని పంపిస్తూ ఉండండి..శ్రీ సాయిరామ్

శ్రీమతి కిరణ్మయి - షికాగో ఇల్లినాయిస్ -  చాలా మంచి ప్రశ్న అడిగారు...సాయిరామ్
శ్రీ దారా వెంకటరామయ్య - చెన్నై... ఈ రోజు మీరు పంపిన బ్లాగు చదివాను.  బి.వి. దేవును గూర్చి, అగ్గిపుల్లల గురించి చాలా బాగుంది.

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన
సందేహాలు -  బాబా సమాధానాలు  - 2 వ.భాగమ్

(ఈ సందేహాలు సమాధానాలను ఎవరైనా తమ స్వంత బ్లాగులో 
ప్రచురించుకోదలచినట్లయితే ముందుగా నాకు సమాచారం ఇవ్వవలసినదిగా
నా మనవి)

నా రెండవ సందేహానికి బాబా సమాధానమ్
  
తరువాత 4 .తారీకునుండి బాబాను నేను అడుగుతున్న ప్రశ్న.  శ్రీ సాయి సత్ చరిత్ర 10 .ధ్యాయంలో నాకు కలిగిన సందేహం.
నా సందేహమ్ :   బాబా నువ్వు చెక్కబల్లను బాగా పైకి కట్టి నిద్రించుటకు కారణం ఏమిటి?  బల్లను నేలమీదనే పెట్టి పడుకోవచ్చు కదా? నాకు కలిగిన సందేహాన్ని కూడా తీర్చు అని  ప్రతిరోజు ధ్యానంలో అడుగుతూనే ఉన్నాను.  అలా ప్రతిరోజూ అడుగుతూ ఉండగా 12 .తారీకున ఆయన సమాధానం ఇచ్చారు.
                     SHIRDI SAI BABA 22 | Temples in Tamil Nadu | Temple news

(అంతర్వాణి – Innever Voice) సమాధానమ్మాండూక్యోపనిషత్  అదే ఆయన ఇచ్చిన సమాధానమ్
అంటే మాండూక్యోపనిషత్ చదవమని ఆయన అభిప్రాయమ్ అని నేను అర్ధం చేసుకొన్నాను.  ఆ తరువాత ధ్యానంలోనుండి లేచి అంతర్జాలంలో మాండూక్యోపనిషత్ గురించి శోధించాను.  అసలు ఉపనిషత్ లు ఎన్ని ఉన్నాయో తెలియదు.  ఏవో రెండు మూడు పేర్లు తప్ప అన్నీ తెలియవు.    ( ఉప + ని+ షత్ --- ఉప అంటే సమీపంగా, ని అంటే కింద, షత అంటే కూర్చొనుట. గురువుముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించుట) అటువంటిది నన్ను మాండూక్యోపనిషత్ చదవమని చెప్పారు. 
(ఉపనిషత్ లు మొత్తం 108 వాటిలో ముఖ్యమయినవి 12)
సరే గూగుల్ లో శోధించినపుడు మాండూక్యోపనిషత్ మొదటగా ఆంగ్లంలో ఉన్న సమాచారం కనిపించింది.  విషయ సూచికలో చూసినప్పుడు, Sleep, Dreams, Deep Sleep” గురించి కనిపించింది. బాబాగారు భలే చూపించారే, అయితే సమాధానం ఇందులో ఉంటుందన్నమాట అనుకున్నాను. కాని,   ఆంగ్లపుస్తకం మొత్తం 390 పేజీలు ఉంది.  అసలు వేదాంతాన్ని అర్ధం చేసుకోవాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలేమో.  ఉపనిషత్ ఆంగ్లంలో ఉంది.  నిద్ర గురించి ఉన్న సమాచారం చదువుతుంటే అర్ధం చేసుకోవడం కాస్త కష్టం గానే ఉంది.  (The Mystery of Dream and Sleep,  Consciousness and Sleep దీని గురించి చాలా సమాచారం ఉంది) ఇక తెలుగులో ఉందేమోనని వెతికినప్పుడు అదృష్టం కొద్ది తెలుగు పి.డి.ఎఫ్ లభించింది.  అది తేట తెలుగులో చాలా సరళంగా ఉంది.  అది రాసినవారు ఎవరో పేరు లేదు.  కాని ఆవ్యక్తికి నేను సాదరంగా నా ప్రణామాలు అర్పించుకుంటూ అందులో ఉన్నదాన్ని యధాతధంగా మీముందు ఉంచుతున్నాను.  మాండుక్యోపనిషత్ కు భాష్యమ్ వ్రాసినవా వారు శ్రీ గౌడపాద గారు.  ఈయన శ్రీ ఆది శంకరాచర్యుల వారి గురువుగారికి గురువు.  శ్రీ ఆది శంకరాచార్యులవారు కూడా ఉపనిషత్ లకు భాష్యం వ్రాసారు.

( శ్రీ సాయి సత్ చరిత్ర 20 . అధ్యాయం  దాసగణుకి ఈశాస్యోపనిషత్ లొ ఒకచోట సందేహం కలిగినప్పుడు బాబా ఆయనతో కాకా సాహెబ్ ఇంటిలోని పనిపిల్ల నీ సందేహాన్ని తీరుస్తుందని బాబా ఆయనను అక్కడకి పంపించారు. )
శ్రీ సాయి సత్ చరిత్ర .20  ఒకప్పుడు దాసగణు ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలిడెను.  ఉపనిషత్తు వేదములయొక్క సారాంశము.  ఇది ఆత్మసాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఈశావాస్యోపనిషత్తును అర్ధము చేసుకొనుటలో తన కష్టములను చెప్పి, సరియైన అర్ధమును బోధించమని దాసగణు బాబాను వేడుకొన్నాడు.  బాబా అతనిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు.  తొందర పడవద్దు.  విషయములో నెట్టి కష్టము లేదు.  తిరుగు ప్రయాణములో విలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని ఇంటిలోని పనిపిల్ల నీ సందేహమును తీర్చును  అన్నారు. 
(బాబా గారు దాసగణుకు వచ్చిన సందేహాన్ని తీర్చగలరు.  కాని దాసగణుకు విధంగా చెప్పడంలోని ఆంతర్యం మనం గ్రహించుకోవాలి.  ప్రత్యక్షంగా మనంతట మనమే గ్రహించుకునేలా మనలని తీర్చి దిద్దుతారు.  ఒకరు చెప్పినది ఆకళింపు చేసుకున్నదానికి, స్వయంగా మనం చూసి, గ్రహించుకున్నదానికి భేదం ఉంటుంది.  స్వయంగా మనంతట మనమే గ్రహించుకున్నది మన మనసులో స్థిరంగా నిలిచిపోతుంది.

 (నాకు కలిగిన సందేహానికి నన్ను  మాండూక్యోపనిషత్ చదవమని బాబా ఆదేశించారు.  అన్ని ఉపనిషత్ లలోను ఇది ఒక్కటే అతి చిన్నది.  ఇక్కడ బాబాగారి శయన లీల గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి దానికి సంబంధించిన విషయాన్ని మాత్రమే పొందుపరుస్తున్నాను  త్యాగరాజు)

(మాండూక్యోపనిష త్ గురించిన వివరాలను ఇస్తూ వాటికి సంబంధించి శ్రీ సాయిచరిత్రలోని విషయాలను కూడా సోదాహరణంగా ఇస్తున్నానుబాబా వాక్కులు కూడా సుదీర్ఘ ప్రసంగాలు కాకుండా, శిల్ప సౌందర్యం లేకుండా నిగూఢంగాను, పొడి పొడి మాటలలాగ, కప్పల బెకబెకలు లాగా ఉంటాయని మనం గ్రహించుకోవచ్చు)

మాండూక్యోపనిషత్ :: (గూగుల్ నుంచి సేకరించిన విషయమ్)

అమ్మ కామాక్షీ ప్రసాదమే ఈ వ్యాఖ్య

సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమయిన ఓంకార తత్త్వమును స్తుతించుట గురించే మాండూక్యోపనిషత్ లో చెప్పబడింది.  అనుష్టుప్ ఛందస్సు మోక్షాపేక్షతో సాధన చతుష్టయ సంపద కలిగిన సాధకుడే ఉపనిషత్ అధ్యయనం చేయడానికి అర్హత కలిగిన అధికారి.  మాండూక్యోపనిషత్ కు పేరు ఎందుకు వచ్చింది?
ఆధ్యాత్మిక దృష్టితో పెద్దలచే అంగీకరింపబడి సత్య సాధకులైన వారిని సరైన మార్గంలో నడిపించటానికి ఉపయోగపడే విధముగా ఉన్న వివరణ సద్గురు శ్రీచలపతిరావు గారు ఇలా వివరిస్తున్నారు.   

  సంస్కృతంలో మండూకము అంటే కప్ప. కప్ప స్వభావానికి  సంబంధించిన శాస్త్రమే మాండూక్క్యోపనిషత్సాధారణంగా కప్ప 8 – 9 నెలలపాటు నీటిలో గాని, బురదలో గాని, రాళ్ళగుట్టల్లో గాని, మురికి గుంటల్లో గాని, రాళ్ళ మధ్యలో గాని, ఎక్కడయినా సరే అది అలాగే నివసిస్తుందిఅది అక్కడ ఎలా ఉంటుందంటే  తపస్సు చేస్తున్నదా అన్నట్లుగా నిశ్శబ్దంగా ఏపనీ చెయ్యకుండా ఏమీ కోరకుండా, అంటే నిష్క్రీయంగా , నిష్కామంగా ఉంటుంది తరువాత వర్షాకాలం వచ్చినప్పటికల్లా బయటకి వస్తుందివచ్చి కన్నీరు కారుస్తున్న ప్రాణులను, ఓదారుస్తున్నట్లుగా వర్షంలో మనోహరమయినటువంటి ద్వనితో బెకబెకలాడుతూ ఉంటుందినిజమయినటువంటి మహాత్ములది కూడా కప్ప స్వబావమేఎందుకని? ఎందుకంటే జనసమ్మర్దము లేని ఏకాంతప్రదేశాలలో హిమాలయ ప్రాంతాలలోనో ఏకాంత ప్రదేశాలను చూసుకొని, గుహలలోనో  ఏరహస్య ప్రదేశాలలోనో వారు ధ్యానమగ్నులై  ఆనందాన్ననుభవిస్తూ ఉంటారు.  
              Is it true that some spiritually enlightened yogis living in the ...
          Is it true that some spiritually enlightened yogis living in the ...
ఇలాంటి ఆత్మదృష్టి కలిగినటువంటి పరిపూర్ణ వ్యక్తులు ఆత్మయందే మనస్సుని నిలిపి ఆత్మలో రమిస్తూ ఏకోరికలు లేకుండా, కర్మలు చేయకుండా అంటే నిష్కామంగా, నిష్క్రీయంగా కేవలం ఆత్మతో అనుసంధానమై అంటే నేను ఆత్మని అనే భావముతోనే నిరంతరం ఆత్మానుభూతిని పొందుతూ ఉంటారువర్షాకాలం రావడంతోనే అంటే చాతుర్మాశ్యంలో (ఆషాడ పూర్ణిమ మొదలు కార్తికపూర్ణిమ వరకు) ధ్యాన నిష్ట వదలిపెట్టి బాహ్య ప్రపంచంలోకి వస్తారు

(శ్రీ సాయి సత్ చరిత్ర 10 .ధ్యాయం గమనించండిబాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగియుండెడివారుదీనికి సంబంధించిన సందర్బం క్రింద ఇచ్చాను చదవండి…  త్యాగరాజు)

 అలావచ్చి ధ్యాన నిష్టలో వారు కనుగొన్న సత్యాలను వారు పొందినటువంటి అనుభవాలను అంటే ఆత్మతో అనుసంధానమైతే కలిగే ఆనందమేదైతే ఉందో ఆనందానుభూతిని బాహాటంగా వారు ఇతరులకు బోధిస్తారుఐతే ఎలా బోధిస్తారుప్రపంచ విషయవ్యామోహాల్లో చిక్కి ఉన్న సామాన్యులకు వారియొక్క వాక్కులు, బోధలు ఎలా ఉంటాయంటే కప్పల బెక బెకల లాగ ఉంటాయటఎందుకు మహాత్ముల అనుభవాలు సామాన్యులకు కప్పల బెకబెకలలాగా ఉంటాయిమహాత్ములు కనుగొన్నటువంటి సత్య విషయాలు ఏవయితే ఉన్నాయో, వారు అనుభవించనటువంటి అనుభూతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనోహరంగా, సున్నితంగా చెప్పటానికి గాని, మనస్సును కరిగించి ఆహ్లాదధోరణిలో చెప్పటానికి గాని, వారికి చేతకాదుఎందుకంటే వారు ఆత్మానుభూతిని పొందుతున్నవంటి వారే గాని, వారు కవులు, పండితులు కారుసున్నితంగా మాట్లాడటం వారికి తెలియదువారి అనుభవాన్ని అలా మామూలుగా చెప్పేస్తారుకాబట్టి వారు తెలుసుకున్నటువంటి సత్య విషయాలకు ఏమాత్రం మెరుగులు దిద్దకుండా, శిల్పసౌందర్యం లేకుండా కుండ బద్దలుకొట్టినట్టుగా చెప్పటమే వారికి తెలుసుఅందుకనే సున్నిత హృదయం కలిగినటువంటి సామాన్యులకు మహాత్ములయొక్క సత్య వాక్కులు కప్పల బెకబెకలలాగా వినపడుతూ ఉంటాయిసాధారణంగా పురాణకధలు ఎంతో సున్నితంగా ఆహ్లాదకరంగా వినటానికి ఇంపుగా ఉంటాయికాని, ఆత్మజ్ఞానాన్ని అలా చెప్పుటకు వీలులేదుఎందుకంటే ప్రపంచ వ్యామోహాల్లో చిక్కి నేను పరమాత్మనేనన్న విషయం మరిచిపోయి, అపురూపంగా లభించిన మానవ జన్మను వ్యర్ధం చేసుకునేటటువంటి వారు సత్యాన్ని గ్రహించాలంటే మొత్తం మాటలతో చెబితే వారి చెవికెక్కదువారికి వైరాగ్యం ఆత్మ జ్ఞానం కలగాలంటే ఛెళ్ళుమనిపించాల్సిందే.

    (బాబా మాటలు పలుకులు ఎక్కడా శిల్ప సౌందర్యం లేకుండా కుండ బద్దలుకొట్టినట్లుగాను, వారి బోధలు కూడా సూటిగా మనసుకు హత్తుకునేలా ఉంటాయనే విషయాన్ని గ్రహించటానికి శ్రీ సాయి సత్ చరిత్రలోని కొన్ని సందర్భాలను కూడా ప్రస్తావిస్తున్నానుత్యాగరాజు)


(పూర్తిగా చదవడానికి లింక్ ద్వారా చదవండి)

ఈ ఉపనిషత్ లో ఓం కారము గురించి వివరింపబడింది.
(మాండూక్యోపనిషత్ పై శ్రీ సుందర చైతన్యస్వామీజీ గారి ఈ ఉపన్యాసం వినండి.  ప్రస్తుతానికి ఒక్కటె ఇస్తున్నాను..ఇవి 40వీడియోలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు యూ ట్యూబ్ లో వినచ్చు.)

( ఈ రెండవ ప్రశ్నకు సమాధానం ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)





Kindly Bookmark and Share it:

1 comments:

Pardhasaradhi on April 25, 2020 at 2:51 AM said...

ప్రత్యక్ష అనుభవం కల్పించి తద్వారా బోధించేవారే అసలైన గురువు.
అనే విషయాన్ని బాబా పదే పదే సచ్చరిత్రలో గుర్తు చేశారు. మీద్వారా మరలా తెలుసుకోవడంఆనందంగా ఉంది. ధన్యవాదాలు.
Ome Srisairam.

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List