Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, July 30, 2020

రుద్రాద్యాయం యొక్క ప్రభావమ్ – శ్రీ సాయి సత్ చరిత్ర 11వ.అధ్యాయమ్ 3 వ.భాగమ్

Posted by tyagaraju on 11:41 PM
Sri Sathya Sai Baba Wallpapers & Photos- free download- computer ...
Lotus Flower History, Significance & Growing Tips

31.07.2020  శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిభక్తులందరికి వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు
రుద్రాద్యాయం యొక్క ప్రభావమ్ – 
శ్రీ సాయి సత్ చరిత్ర 11.అధ్యాయమ్ 3 .భాగమ్
శ్రీమతిమాధురి అంబేలాల్ దాంగ్ గారి అనుభవమ్ (అంధేరీ వెస్ట్, ముంబాయి)  సాయిలీల ద్వైమాసపత్రిక మార్చ్ఏప్రిల్ 2019 సంచికలో ప్రచురింపబడింది. 
శ్రీ సాయి సత్ చరిత్రలోని 11.అధ్యాయానికి, అనుభవానికి సంగ్రహంగా వివరణ మరాఠీ లో వ్రాసినవారు శ్రీమతి ప్రియంవద ప్రకాష్ కరాండే. వడలా వెస్ట్, ముంబాయి
ఆంగ్లానువాదమ్ --- శ్రీమతి మీనల్ తుషార్ దేశ్ పాండే
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411  &  8143626744
మైల్ .డి.  tyagaraju.a@gmail.com
(నిన్నటి రోజున బ్లాగులో సమస్య ఏర్పడిన కారణం వల్ల ప్రచురించడం సాధ్యంకాలేదు.)

శ్రీ సాయిబాబా తన భక్తులపై అవ్యాజ్యమయిన ప్రేమను కనబరుస్తారు.  వారికేది మంచిదో వారికే తెలుసు.  వారి యోగక్షేమాలపై శ్రధ్ధవహిస్తారు.  భక్తులమీద ప్రేమజల్లులను కురిపించే సద్గురువు ఆయన.   తనవద్దకు ఎవరు వచ్చినా సరే సాయిబాబా వారి యోగక్షేమాలను తనె వహిస్తారు.  11 .అధ్యాయంలో సాయిబాబా తన భక్తులకు చేసే బోధ, ఆయన ప్రేమవంటి విషయాలన్నీ మనం గమనించవచ్చు.
 
          
ఒకసారి షిరిడీలో వాతావరణం మారిపోయి అకస్మాత్తుగా పెద్ద తుఫాను చెలరేగింది.  విపరీతమయిన వేగంతో గాలివీస్తూ ఉరుములు, మెరుపులతో భయంకరమయిన కుండపోత వాన భీభత్సంగా కురవడం మొదలయింది.  అటువంటి భయంకరమయిన తుఫాను చూసి షిరిడీ ప్రజలు భీతి చెందారు. సమస్త జంతు జాలాలు అన్నీ బెదిరిపోసాగాయి.  షిరిడీలో ఇంకా ఇతర దేవాలయాలు ఉన్నాయి.  కాని, ఏదేవుడు షిరిడీ ప్రజల ప్రార్ధనలకు చలించలేదు.  హేమాడ్ పంత్ వివరించిన ప్రకారం….

ఇటువంటి కష్ట సమయంలో సాయి వారందరినీ ఆదుకొన్నారు.
ప్రజల మనసుల్లో చెలరేగుతున్న భయాందోళనలని సాయి గమనించారు.  ఆయన హృదయం చలించింది.  ఎటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడింది?  నా పిల్లలను నేను కాక మరెవరు రక్షిస్తారు?” అని అనుకున్నారు.  సాయిబాబాకు పంచభూతాలపై ఆధిపత్యం ఉంది.  సాయిబాబాకు తన ప్రాణం కన్నా తన భక్తులందరినీ తనవారిగా భావించి ప్రేమను కురిపిస్తారు.  సాయిబాబా ఆకాశంవైపు చూస్తూ ఎలుగెత్తి బిగ్గరగా అరిచారు..”ఆగు! నీ తీవ్రతను తగ్గించు”.  
              Shirdi Sai Kadas -old and new: Controlling the Fury of storms ...
బాబా అరిచిన అరుపుకి మసీదు కూడా వణికి పోయిందా అన్నట్లుగా కనిపించింది.  వెంటనే వర్షం ఆగిపోయింది.  ఉరుములు, మెరుపులు గాలి వేగం అన్ని నెమ్మదించాయి.  భగవంతుడు కూడా ఆయన మాటని మన్నించాడు.  చివరికి ఇంద్రుడు కూడా బాబా మాటకి కట్టుబడి తుఫానుని ఆపేశాడు.

ఇంకొక సందర్భంలో ఒక రోజు మధ్యాహ్న సమయంలో ధునిలో ఉవ్వెత్తుగా అతి ఉధృతంగా జ్వాలలు పైపైకి లేవసాగాయి.  అక్కడున్నవారందరూ చాలా భయపడిపోయారు.  ఏమిజరుగుతుందోననే ఆందోళనతో భయం భయంగా చూస్తున్నారు. ప్రచండంగా అగ్నిజ్వాలలు ద్వారకామాయి పైకప్పును తాకుతున్నాయి.  మసీదు దహనమైపోతుందేమోనని అంతా విచారగ్రస్తులై ఉన్నారు.  కాని బాబా ఏమాత్రం చలించలేదు.  నీళ్ళు తెచ్చిపొయ్యండని కొందరు సలహా ఇచ్చినా బాబా సటకాతో కొడతారేమోనని ఆవైపు వెళ్ళటానికి కూడా ఎవరూ సాహసించలేదు.  ఎవ్వరికీ కూడా సాయిబాబాను అడిగే ధైర్యం చేయలేకపోయారు.  అపుడు బాబా జ్వాలలవైపు చూస్తూ ధుని దగ్గర స్థంభంపైన సటకాతో ఒక్కోదెబ్బ వేస్తూవెనక్కు వెళ్ళు -  శాంతించుఅంటుంటే దెబ్బదెబ్బకు మంటలు తగ్గిపోయి ధుని శాంతించింది.  భక్తులందరిలోను భయాందోళనలు తొలగిపోయాయి.  అక్కడున్నవారందరికి సాయిబాబా వారి శక్తి ఎంతటిదో అర్ధమయింది.  ఈశ్వరుని అవతారమయిన సాయిబాబా పాదాలపై శిరసుంచితే, వారు తమ కృపాహస్తాన్ని మన తలపై ఉంచి ఆశీర్వదిస్తారు.  స్వస్థచిత్తులై శ్రధ్ధాభక్తులతో నిత్యం అధ్యాయాన్ని పారాయణ చేసినవారి ఆపదలు తొలగిపోతాయి.  వారి కోరికలు నెరవేరుతాయి.  అధ్యాయాన్ని పారాయణ చేసిన భక్తులకు బాబావారి కృపాకటాక్షం అనుభవమవుతుంది.

ఇక అంధేరీ ముంబాయిలోని శ్రీమతి మాధురి అంబేలాల్ గాంగ్ గారు తమ కుమార్తె శ్రీసాయి సత్ చరిత్రలోని 11 వ.అధ్యాయాన్ని పారాయణ ప్రారంభించిన తరవాత జరిగిన ఒక అధ్భుతమయిన అనుభవాన్ని వివరిస్తున్నారు.


“నా చిన్న కుమార్తె తనూజకి ఎప్పటినుండో పైలట్ అవాలనే కోరిక.  12 వ.తరగతి పూర్తిచేసిన తరువాత ఎలక్ట్రానిక్స్ లో డిగ్రీ పూర్తిచేసింది. డిగ్రీ అయిన తరువాత బొంబే ఫ్లైయింగ్ క్లబ్ లో చేరింది.  ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో పైలట్ గా లైసెన్స్ వచ్చింది.  లైసెన్స్ వచ్చిన తరువాత లక్నో వెళ్ళి ఇందిరాగాంధి నేషనల్ ఏవియేషన్ అకాడమీ (ఇందిరాగంధి రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ) లో ప్రవేశం లభించింది.  అందులో చేరిన తరువాత పరీక్షలో ఉత్తీర్ణురాలయింది.  తను కోరుకొన్న రంగురంగుల కలలప్రపంచం సాకారమయిందని ఎంతగానో సంతోషించింది.  1997వ.సంవత్సరంలో కమ్మర్షియల్ పైలెట్ లైసెన్స్ శిక్షణకి తన పేరు నమోదు చేయించుకుంది.  మార్చ్ 1999 లో లైసెన్స్ కూడా వచ్చింది.  మేమంతా చాలా సంతోషించాము…
(మిగిలిన పూర్తి భాగమ్ రేపటి సంచికలో)
(శ్రీ సాయి సాగరంలోనుండి వెలికితీసిన ఆణిముత్యాలు 8 వ.బాగాన్ని
www.teluguvarisaidarbar.blogspot.com లో చదవండి.)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List