21.02.2023 మంగళవారమ్
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓమ్ శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
ఓమ్ శ్రీ సాయినాధాయనమః
శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే
శ్రీ సాయి సత్ చరిత్ర –15 వ.భాగమ్
ప్రేరణ ; గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు
ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి
ఆలయమ్
సమన్వయ కర్త ; ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744వ.
శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ – 7 జ్ణాన – విజ్ణానయోగము
శ్లోకం – 3
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిధ్ధయే
యతతామపి సిధ్ధానాం కశ్చిన్మాం వేత్తి
తత్త్వతః
వేలకొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే
నన్ను గూర్చి తెలిసికొనుటకు ప్రయత్నించును.
అట్లు ప్రయత్నించినవారిలో కూడ ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్త్వమును అనగా
నా యధార్ధ స్వరూపమును ఎఱుంగును.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 25
దామూ అన్నా ఒకనాడనేకమందితో కలిసి బాబా
పాదముల వద్ద కూర్చొని ఉన్న సమయంలో అతని మనసులో రెండు సంశయములు కలిగెను.
(రెండవ సంశయము అతని వ్యక్తిగతానికి సంబంధించినది కనుక ఇక్కడ నేను వివరించడం లేదు)
1)
సాయిబాబా
వద్ద అనేకమంది గుమిగూడుచున్నారు. వారందరు బాబా
వలన మేలు పొందెదరా?
దానికి బాబా సమాధానము ---
“మామిడి చెట్ల వయిపు పూత పూసి
ఉన్నపుడు చూడుము. పువ్వులన్నియు పండ్లు అయినచో,
ఎంతమంచి పంట అగును? కాని అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును. కొన్ని మాత్రమే మిగులును.”
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్
– 32
“నా సర్కారు ఖజానా (ఆధ్యాత్మిక
ధనము) నిండుగానున్నది. అది అంచువరకు పొంగిపోవుచున్నది. నేను, “త్రవ్వి
ఈ ధనమును బండ్లతో తీసుకుపొండు. సుపుత్రుడైనవాడు
ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలెను” అనుచున్నాను.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ 16 – 17
“నా ఖజానా నిండుగానున్నది. ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత కలదా లేదా? అని నేను
మొదట పరీక్షించవలెను.”
పైన బాబా చెప్పిన వివరణలను
బట్టి సాయి బంధువులమైన మనమందరము మనకు మనమే విశ్లేషించుకోవాలి. మనము సాయి మార్గంలో పయనిస్తున్నామా లేదా అని ఎవరికి వారే ఆత్మ
విమర్శ చేసుకోవాలి. సాయి సత్ చరిత్రను మనమందరం
పారాయణ చేస్తున్నవాళ్ళమె. కొంతమంది సప్తాహం
చేస్తున్నవారయితే ప్రతిరోజు ఒక అధ్యాయమైనా పారాయణ చేస్తున్నవారు కూడా ఉన్నారు. షిరిడీ వెళ్ళి ఆయన దర్శనం కూడా చేసుకుంటున్నాము. కాని మనమందరం బాబా చెప్పిన మంచి సందేశాలను ఎంతవరకు
పాటిస్తున్నాము? చదివినవన్నీ ఎంతవరకు గుర్తుంచుకుంటున్నామని
మనకు మనమే ఆత్మ విమర్శ చేసుకోవాలి.
మన సద్గురు శ్రీ సాయినాధులవారి మీద మనకు అచంచలమయిన విశ్వాసం ఉన్నపుడు ఎవరు ఆయనకి వ్యతిరేకంగా చెప్పినా మన విశ్వాసం సడలకూడదు. ఆ నమ్మకం ఎలా వస్తుంది? ఆయన చరిత్రను బాగా జీర్ణించుకున్నపుడే మనం ఇతరులు ఆయనకు వ్యతిరేకంగా చెప్పినపుడు వారి వాదనను ఖండించగలము.
ఈ విధంగా శ్రీమద్భగవద్గీతలో
శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన గీతా బోధన, శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా చెప్పిన మాటలు
రెండింటికి సమన్వయం కుదిరింది కదా!
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment