29.03.2011 మంగళవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి చరణాలుసాయి బంథువులందరికి సాయి శుభాశీశ్శులు.
క్రితం సారి మనము సాయి భక్తుడు గురించి కొంతవరకు తెలుసుకున్నాము. సాయి భక్తుడైనవాడు బాబా మీద అచంచలమైన విశ్వాసాన్ని ఉంచాలి. అంటే నీ భక్తి చంచలంగా ఉండకూడదు. యెవరేమి చెప్పినా నీ భక్తి సడలనంతగా ఉండాలి. బాబాని నమ్మని వారు నీతో "ఆ బాబా మహత్యం యేముందండీ, రామ నామ జపం చెయ్యి, లేదా ఆంజనేయస్వామిని పూజించు నీ కష్టాలన్నీ తీరతాయి అన్నా కూడా మన మనస్సు మరల కూడదు. అలా చెప్పేవారికి మనం యెమి చెప్పాలీ? శ్రీ రామ శివ మారుత్యాది రూపాలన్నీ ఆయనేనండీ అని బాబా లీలలు ఆయన చెప్పిన మాటలు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. నేనొక పుస్తకంలో చదివాను, బాబాని పూజించడం మొదలు పెట్టినవాడు ఇంక మరే యితర దేవుళ్ళనీ పూజించడని. అంటే మిగతా దేవుళ్ళని వదిలివేయమని కాదు ఇక్కడ. బాబా గారు మరి అంత భక్త సులభుడు. ఒక్కసారి స్మరించితే చాలు యేదో ఒక లీల చూపించి తనవాడిగా చేసుకుంటారు. మరి అటువంటప్పుడు ఆయనని వదలి వెళ్ళగలమా? ఆయనతో పాటు మిగతావారినీ పూజిస్తూ బాబా మీద కూడా యెక్కువ నమ్మకం శ్రథ్థ ఉంచుకుంటాము.
బాబా చెప్పినదేమిటి? నా చరణాలను ఆశ్రయించండి అని. అవి యెటువంటి చరణాలు? పవిత్రమైన గంగా యమునలను ప్రవహింపచేసిన చరణ కమలాలు. మరి అటువంటి చరణాలను మనం, మన అహంకారాన్ని అంతటిని ఆయన పాదాల ముందు పెట్టి సర్వశ్య శరణాగతి చేయాలి. ఆయన ముందు సాష్టాంగపడి నమస్కరించడానికి మన అహం అడ్డు రాకూడదు. మన సాయి బంథువులు గాని బాబాని పూజిస్తున్నవారు గాని యెటువంటి అహం లేకుండా బాబావారి ముందు సాగిలపడి నమస్కరిస్తారు.
నాకు ఇంతకు ముందు, అంటే బాబా సత్సంగంలోకి రాక ముందు, గుడిలో గాని, యింటిలో గాని సాష్టాంగ నమస్కారం చేయడానికి కొంచెం బిడియంగా ఉండేది. యెవరన్నా యేమన్నా అనుకుంటారేమో? ఇలా కొంచెం అభిమానంగా మొహమాటంగా ఉండేది. కాని సత్సంగంలోకి వచ్చాక సాయి తత్వం అర్థం చేసుకున్నాక ఆ బిడియం అవీ అన్ని మాయమైపోయాయి. అదే బాబా చరిత్ర మహిమ.
కొంతమంది అనుకోవచ్చు. నేను బాబాని యెంతోకాలంగా పూజిస్తున్నాను. నా కోరికలేమీ తీరటంలేదు. బాబా కి నామీద కోపం వచ్చిందా, యేమిటి నన్ను పట్టించుకోవటల్లేదు అని. ఆయనకు తెలుసు మనకు యెప్పుడు యేది ఇవ్వాలో. మనకు యేది తగునో అదే ఇస్తారు. ఆయనతో దెబ్బలాడడమే.
ఒక్కొక్కసారి మనకి బాబా గుడికి కాని, యేదయిన ఉత్సవాలకి కానివెళ్ళే అవకాశం లేకపోవచ్చు. అంటే ఈ రోజు వారి కార్యక్రమాలలో తలమునకలుగా ఉండి, అయ్యొ బాబా గుడికి వెళ్ళలేకపోయామే అని బాథ పడి బాబా ని మనసులో ఒక్కసారి తలుచుకున్నా చాలు. ఆయన అనుగ్రహం తప్పక ఉంటుంది. ఆయనకు తెలియదా నువ్వు యేపరిస్థితుల్లో రాలేకపోయావో. నువ్వు యేక్షణంలోనయితే మనసులో అలా బాథ పడ్డావో ఆక్షణంలోనే ఆయన దృష్టి నీమీద ప్రసరిస్తుంది. ఎందుకంటే అవకాశం లేక నువ్వు వెళ్ళలేకపోయావు. కాని అవకాశం ఉండీ వెళ్ళకుండా అనుగ్రహం కావాలంటే యెల్లా కుదురుతుంది.
నాకు తెలిసున్న విషయం చెపుతాను. ఒక పెద్ద పట్టణంలో చిన్న బాబా గుడి వుంది. గుడి చుట్టు పక్కల చాలా యిళ్ళు ఉన్నాయి. గుడిలో యెవరయినా ఉపన్యాసం యిస్తుంటే వారు ఇంటిలోనే కూర్చుని టీ.వీ. చూస్తూ ఉంటారట. ఉపన్యాసం చెప్పే ఆయన యేమండి గుళ్ళొకి రాలేదు అంటే మైకు లో వినపడుతోంది కదండీ అనే సమాథానం చెప్పారట. అంటే దగ్గిరగా ఉన్న గుడికి వెళ్ళడానికి మసొప్పదు. ఆయన అనుగ్రహం మాత్రం కావాలంటే యెలా?
మీభక్తిని మీరే ప్రకటించుకోవాలి. అంటే గుడికి వెళ్ళి మీరుచేసే నమస్కారం మీరే అర్పించాలి కాని మరొకరికి చెప్పి నానమస్కారాలు బాబా కి చెప్పు అని అనడం కూడా పథ్థతి కాదు. అలా చెప్పారంటే భగవంతుని మీద సంపూర్ణమైన భక్తి లేదని మాట.
ఒకవేళ యెవరయినా షిరిడీకి గాని యేదయిన్న పుణ్య క్షేత్రానికి కాని వెడుతున్నారనుకోండి. మీరు వెళ్ళలేకపోవచ్చు. అప్పుడు మీరు మీ నమస్కారలని ఆ బాబాకి లేక దేవునికి చెప్పమని చెప్పండి. అటువంటప్పుదు మనం అలా చేసినా తప్పు లేదు.
ఒకసారి నేను బస్సు కోసం ఒక చెన్న పల్లెటురులో నిరీక్షిస్తూ నుంచున్నాను. పక్కన చిన్న ఆంజనేయస్వామి గుడి వుంది. గుడి దగ్గిరనించి నలుగురు ఆడవాళ్ళు వెడుతున్నారు. అందులో ఒకామె గుడిలో కి విళ్ళి నమస్కారం పెట్టుకొస్తాను అంది. వారిలో ఒకామె నా నమస్కారం కూడా నువ్వే పెట్టు అని ముందుకు సాగిపోయింది.
గుడిలో కి వెళ్ళి నమస్కారం పెట్టుకోవడం రెండు క్షణాలు కూడా పట్టదు. ఆ రెండు క్షణాలు కూడా దేవునికోసం వినియోగించలేనివారికి భగవంతుడు ఇచ్చేవి మాత్రం ఉచితంగా కావాలి. మానవ నైజం ఇక్కడే ప్రకటితమవుతూ ఉంటుంది.
మనకి యిటువంటి విషయాలు, బాబా తత్వం అన్ని అర్థం కావాలంటే సత్సంగం ద్వారానే తెలుస్తాయి.
యింతకుముందు సత్సంగము గురించి తెలుసుకున్నాము. సత్సంగము ద్వారానే కాస్త మంచి మాటలు చెప్పడం వినడం వల్ల చాలా వరకు మనకు బాబా తత్వం బోథ పడుతుంది. సత్సంగములో అందరూ సమనమే. ఒకకరు తక్కువ ఒకరు యెక్కువ కాదు. బాబా గారు యెవరిని యేవిథం గా ఉపయోగించుకోవాలో అంతా ఆయన దయ. చెప్పేవాడు యెక్కువా కాదు, శ్రోతలు తక్కువ వారూ కాదు. ఒకరికి వ్యాఖ్యానం చెప్పే పని అప్పచెపుతే యింకొకరికి వినే అదృష్టాన్ని కలిగించారు. సత్సంగంలోకి రావడం కూడా బాబా అనుగ్రహంతోనే కదా జరిగేది.
మనకోరికలు తీరలేదని యెప్పుడు తీరుతాయో కదా అని మనోవేదని పడకూడదు. అందుకే ఆయన ఓర్పుతోను, సహనంతోను, ఉండమన్నారు. కష్టాలు తీరాలంటే రోజూ 15 అథ్యాయాన్ని చదవాలిట.
మన బ్లాగు కూడా ఒక సత్సంగంలాంటిదే. సత్సంగంలో అందరూ కలిసి ఒక నిర్ణీత ప్రదేశంలో నిర్ణీత సమయానికి కూరుచిని సత్సంగం చేస్తారు. మన బ్లాగు చదివే వారుకూడ ప్రతివారు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటారు. అందరూ ఒకే సమయంలో చదవకపోయినా, బాబా గారు తన లీలలని తత్వాన్ని చదివి తెలుసుకునే భాగ్యాన్ని, అదృష్టాన్ని కలిగించారు.
యిక ఈ రోజు మనము నెల్లూరునించి సుకన్య గారు సాయి చరణాలు అనే ఆంగ్ల కవిత పంపించారు. దానికి తెలుగు అనువాదం ఇప్పుడు మీముందు ఉంచుతున్నాను.
సాయి చరణాలు
నీకు బాథ కలిగినప్పుడు
సాయి చరణాలను ఆశ్రయించు
నువ్వు యెవరినయినా బాథిస్తే
ఆ పాపం నిన్ను బాథిస్తూ ఉంటే
సాయి చరణాలను ఆశ్రయంచు
నీ దారులన్నీ మూసుకుపోయినప్పుడు
నీ హృదయాంతరాళము నలిగిపోయినప్పుడు
నీ ప్రయత్నాలన్నీ నిష్ప్రయొజనమైపోయి
నువ్వుతీరని వేదనలో ఉన్నప్పుడు
సాయి చరణాలనాశ్రయించు
నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు
జీవితం నీకేమీ ఇవ్వక
నువ్వేమీ చేయలేనప్పుడు
నువ్వు సాయి చరణాలనాశ్రయించాలి
జీవితం అంతమైపోతున్నప్పుడు
నీకింకా బతకాలనిఉన్నప్పుడు
శరీరాన్ని వదిలివెళ్ళిపోయే క్షణాన
నువ్వింకా జీవించాలనుకున్నప్పుడు
సాయి చరణాలనాశ్రయించు
నువ్వు పనిచేసినా
నష్టపోతూ ఉంటే
కన్నీళ్ళతో నిండిపోయినప్పుడు
తాత్కాలిక భయాలతో
సహనం నశించినప్పుడు
నువ్వు సాయి చరణాలనాశ్రయించాలి
నువ్వు మోసపోయినప్పుడు,
ఓడిపోయినప్పుడు
క్రోథంతో అశాంతిగా ఉన్నప్పుడు
నువ్వు సాయి చరణాలనాశ్రయించాలి
దీవెనలకి
న్యాయానికి
ప్రేమకి
నువ్వు సాయి
చరణాలని
ఆశ్రయించాలి
0 comments:
Post a Comment