యునైటెడ్ కింగ్డం నుండి ఒక సాయి భక్తురాలి బాబా లీలను ఈ రోజు తెలుసుకుందాము. ఈ లీలను సుకన్యగారు సేకరించి పంపించారు. యునైటెడ్ కింగ్డం నుండి ఒక సాయి భక్తురాలి, బాబా లీలను ఈ రోజు తెలుసుకుందాము. ఈ లీలను సుకన్యగారు సేకరించి పంపించారు.
నా మొఱ ఆలకించి పరీక్ష కాలంలొ బాబా చేసిన సహాయమునా కథ నేను 9 గురువారముల వ్రతము చేస్తున్నప్పుడు, జరిగిన అనుభవాల వర్ణన. పరీక్షలు జరుగుతున్న సమయంలో నేను విపరీతమైన పీరియడ్స్ నొప్పితో బాథ పడడం జరిగింది. నాకు యెప్పుడూ అపనమ్మకం. నాకు యేకాగ్రత లేదు ఒకోసారి స్థిర నిర్ణయం కూడా ఉండేది కాదు. నాకసలు నమ్మకం లేదు, దీనిని బట్టి నా మన స్థితి యెలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. నేను పరీక్షకి యేమి పున్శ్చరణ చేయలేదు దాని వల్ల నేను చాలా ఒత్తిడితో వెళ్ళాను. నేను పరీక్ష హాలులో సాయిబాబా విగ్రహాన్ని చూశాను. నేను నిర్ఘాంతపోయాను, యెందుకంటే విదేశాల్లో, పరీక్ష హాలులో దేవతల విగ్రహాలుంటాయని ఊహించం. బాబా దయ వల్ల నేను పరీక్ష లో ఉత్తీర్ణురాలినయ్యాను.
నాకెప్పుడు సమస్యలే కాబట్టి నాకు మంచి జరుగుంతదనే నమ్మకం లేదు. నా తరువాతి కథ కూడా పరీక్షల గురించే. నేను శ్రీ సాయి సచ్చరిత్ర, భగవద్గీత ఒకదాని తరువాత ఒకటి చదువుతూ ఉండేదాన్ని. రెండూ కూడా నువ్వు భగవంతుడితో సమ్మమనే చెపుతున్నాయి. ఇది చదివాక, నువ్వు కనక ఫలితాన్ని భగవంతునికి వదిలేస్తే ప్రతీదీ సాథ్యమే అని నమ్మాను. నీలో యేదైనా నైపుణ్యం ప్రకటితమైతే అది పూర్తిగా నీలో ఉన్న భగవంతుని శక్తి. అందుచేత ప్రతీవారు సమానమే అన్నిటికీ సమర్థులే. యింతకుముందు చెప్పినట్లుగా నేనింకా చాలా సమస్య్లలతో బాథపడుతున్నాను, కాని యింతకుముందు చెప్పినట్లుగా నేను రెండు గ్రంథాలనూ చదవడం ప్రారంభించాక శాంతంగా ఉన్నాను. నేను ఇంక యెక్కువగా యేమీ ఆశించటంలేదు, పరీక్షా ఫలితం గురించి కూడా పట్టించుకోలేదు, నాకు తెలుసు సాయిబాబా యేది నిర్ణయించినా అది మంచి కోసమేనని. ఆయన దయవల్ల నేను ఊహించని మార్కులతో ఉత్తీర్ణురాలినయ్యాను. ఇది నా తోటివారిని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.
యింతే కాకుండా, నేను ఉద్యోగం సంపాదించడానికి కూడా చాలా కష్టపడ్డాను. సాయి సచ్చరిత్ర చదవడం పూర్తి అయేంతవరకు నేను రోజంతా సాయిబాబా మందిరంలోనే ఉన్నాను. ఈ సమయంలో నేను కడుపు నింపుకోవటానికి చిరుతిళ్ళు తిన్నాను. అక్కడే నేను నా ఫోన్ లో మెయిల్ చూసుకున్నాను. అందులో ఒక కంపనీ నన్ను తిరస్కరించినట్టుగా చదివాను. నా స్థితి మారి పోయి వ్యాఖ్యలు చేశాను :" యేమి చేసినా గాని అన్ని సమస్యలే అవుతుంటే మం చిగా ఉండి లాభం యేమిటి, యింకా యెవరైతే న్యాయబథ్థంగా వ్యవహరించరో, యెవరైతే యితరులనించి సహాయం పొంది, వారికి కృతజ్ణత తెలపరో, యితరుల ప్రతిభని తమ ప్రతిభగా చాటుకుని విరుథ్థంగా ప్రవర్తిస్తారో, వారికిన్నా, వివేకవంతులైన వారు, స్వచ్చంగా ఉన్నవారే యెక్కువ సమస్యలను యెదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని నేనొకవ్యక్తితో చర్చించినప్పుడు, అతను మామూలుగా చెప్పాడు "శ్రథ్థ, సబూరీ" (నమ్మకము, విశ్వాసము). నేను సచ్చరిత్ర చదవడం కొనసాగించాను, ప్రతీసారి కొంచెం ఆపి, బ్రేక్స్ కి వెళ్ళినప్పుడు ప్రతిసారి నాకు ఒక కొత్త మైల్ వస్తూండేది. ఆరోజు ఒకేసారి మూడు కంపనీలనించి యింటర్వ్యూకి రమ్మని మైల్స్ వచ్చాయి. అదొక్కటే విచిత్రం కాదు, నేను మళ్ళీ నా అప్లికేషన్ తిరిగి చదివినప్పుడు, నా ఫారం లో చాలా పెద్ద పొరపాటు చేసానని అనుకోకుండా గ్రహించాను. ఎడిటిం గ్ ప్రాసెస్లో రెండు వేరు వేరు ప్రశ్నలకి ఒకే సమాథానం రాయడం జరిగింది. నాకు చాలా వణుకు వచ్చింది. నా అప్ప్లికేషన్ చదివినట్టుగా ఇంటర్వ్యూ చేసేవారు చెప్పారు, కాని యెవరూ కూడా వదలివేయడానికి వీలులేని ఈ తప్పుని గమనించలేదు. తనని నమ్మితే కనక యేదైనా సాథ్యమే అని బాబా నిరూపించారు. భగవంతుడు అందరికోసం ఇక్కడే ఉన్నారు అనె కాకుండా, తన లీలలు నమ్మశక్యం కానంతగా ఉంటాయని అర్థం చేసుకోవడానికి సహాయం చేశారు.
యింకొక మంచి అనుభూతి యేమిటంటే రాత్రి నేను శివుడి గుడినించి వస్తున్నప్పుడు, నా వెనకాల ఒక ముసలాయన నడుస్తున్నాడు. అతని గడ్డం తెల్లగా ఉంది, తెల్లని దుస్తులు, చిన్న తెల్లని టోపీ, కఱ్ఱ కూడా ఉంది. అది రాత్రివేళ కాబట్టి నేను యింకా వేగంగా నడవడం మొదలుపెట్టాను, కాని అదే సమయంలో నేను నా వెనకనే నడుస్తున్న మనిషి గురించే ఆలోచిస్తున్నాను. నేను గమనించింది మీరనుకుంటున్నట్టు అది ఆథునికమైన వాకింగ్ స్టిక్ కాదు, కాని బాగా పాత కఱ్ఱ. వేగంగా నడుస్తున్నప్పుడు, నావెనక కఱ్ఱ చప్పుడు వేగం విన్నాను. నేనప్పుడు సాయిబాబాని ప్రార్థించాను, "నాకు యిప్పుడు భయంగా ఉంది, బాబా నాకు సాయం చెయ్యి" అని. కఱ్ఱ యొక్క శబ్దం ఆగిపోయింది. నేను చుట్టూ చూసేటప్పటికి యెవరూ లేరు. నేను నడుస్తున్న రోడ్డు సన్నగా ఉంది. అతను కనపడకపోవటానికి యింకెవరూ నడుస్తున్నవాళ్ళు లేరు. ఆయన సాయిబాబా అని నేను నమ్ముతున్నాను, ఆయనప్రేమకి నేను కృతజ్ణురాలిని.
ప్రతీవారికి కూడా, సాయి సచ్చరిత్రళొ ఒక అథ్యాయాన్ని చదివే అవకశం లభిస్తుంది. నేను ముందర "నో" అని చెప్పాను. మనం బిగ్గరగా చదవాలేమో అనుకున్నాను, యెందుకంటే నాకు మొహమాటం, యింకా నాకు నమ్మకం లేదు. యేమైనప్పటికీ అది నా తప్పు. నీకు బాబా ఉంటే భయపడవలసిన అవసరం లేదు. కాని అటువంటి మంచి అవకాశానికి కొంతమంది తమ అజ్ణానం వల్ల దురదృష్టం వల్ల "నో" అని చెపుతారు. అదే రోజు నేను గుడికి వెళ్ళాను, అక్కడ పారాయణ కొనసాగుతోంది, కాని యెవరూ కూడా పైకి బిగ్గరగా చదవటల్లేదు. నన్ను క్షమించమని నేను సాయిబాబాని ప్రార్థించాను. అక్కడ చదివేవారి జాబితా నిండిపోయిఉందని నాకు తెలుసు. యేమైనా గాని నేను బాబాని నన్ను క్షమించమని అడిగాను, ఆయన నన్ను క్షమిస్తే కనక, ఒక అథ్యాయం నన్ను చదివేలా చేయమని బాబాని అడిగాను. నేను ఇది అడగగానే ఒకాయన సాయిబాబా సచ్చరిత్రలో ఒక అథ్యాయం చదవడానికి ఒక ఖాళీ ఉందని చెప్పారు. క్షమించినందుకు నేను బాబాకి థన్యవాదాలు తెలుపుకున్నాను. యింకొక లీల గురువారమునాడు పల్లకీ ఉత్సవం. బాబాకి పళ్ళాలు పట్టుకోవడానికి కొంతమంది అమ్మాయిలని సెలెక్ట్ చేశారు. బాబా దయవల్ల ఈ ఉత్సవంలో పాల్గోడానికి నేను అనుమతించబడ్డాను.
యేమైనప్పటికి నేను అందులో ఎక్స్ ట్రా ఉన్నాను. నేను పట్టుకోవడానికి యే పళ్ళెమూ మిగలలేదు. ఆ సమయంలో నాకు చాలా బాథ వేసింది. కాని బాబా దయ వల్ల ఒకరు నాకోసం కొన్ని పరికరాలు లార్డ్ శివా మందిరానికి తీసుకువెళ్ళడానికి ఇచ్చారు, తిరిగి వచ్చేటప్పుడు మోసుకురావడానికి కొబ్బరికాయలు ఇచ్చారు. బాబాగారు నాకు, తన వద్దకు వచ్చే భక్తులందరికి చేసినట్లుగానే, యెల్లప్పుడు మన మనసులోని మాటలను విన్నట్లుగానె ,తన నిరంతర సహాయాన్ని కనపరిచారు. (బాబా థన్యవాదములు)
నిజానికి నేను శేజ్ ఆరతిలో పాల్గొందామనుకున్నప్పుడు, ఈ పల్లకీ ఉత్సవంలో పాల్గొనడానికి బాబా గారు అనుమతించి తన లీలను చూపారు. అలా చేయడానికి నాకు అవకాశమిచ్చారు (కొంతసేపు వేచి ఉన్నాక). పరుగెత్తుకుని వచ్చే భక్తులు ఆయనకి చాలా మంది ఉన్నారు. నేనెప్పుడూ ఆయనకి కృతజ్ణురాలిని. బాబా మాయింటికి భిక్షకు కూడా వచ్చినందుకు థన్యవాదములు, దయ చేసి మా అందరి యిళ్ళకు యెల్లప్పుడూ రండి.
నేను అందరికీ సలహా ఇచ్చేదేమంటే, సచ్చరిత్ర, భగవద్గీత కలిపి చదివితే, రెండిటికీ పూర్తి సంపూర్ణత కలిగి మంచి అనుభవాన్నిస్తుంది.
బాబా మనలనెప్పుడూ ఆశీర్వదించుగాక. బాబా మామీదెప్పుడు కోపగించవద్దు.
***
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
షిర్డీ దర్శించే భక్తులకు వసతి గురించి ఒక గమనిక ::షిరిడీలో ద్వారకామాయికి దగ్గరలో ఉన్న హోటల్ యొక్క చిరునామా ఇస్తున్నాను. గమనించండి.
Hotel sai vishwakarma
Dr headgewar nagar,
Behind nagar panchayat, shirdi - 423109
Rahata dist. Ahmednagar
Mob- 9975886066
02423-255818
Price is 500 for double bed
Nice rooms at reasonable price
0 comments:
Post a Comment