Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, June 19, 2020

గురుభక్తి – 3 వ.భాగమ్

Posted by tyagaraju on 7:12 AM
   Shirdi Sai Baba - Lord Dattatreya Incarnate | Shirdi Sai Baba Life ...
    3 Yellow Roses Personal Chef - Home | Facebook
19.06.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – 
బాబా సమాధానాలు – 10 (3)
గురుభక్తి – 3 .భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

కర్మచేతను, మనసు చేతను, వాక్కు చేతను అన్ని వేళలయందు త్రికరణ శుధ్ధిగా గురుదేవుని ఆరాధించవలెనుపొడవైన దండమువలె సాష్టాంగ దండ ప్రణామము చేసి, అభిమానమును వదలి చరించవలెను

                                    ---  గురుగీతశ్లో. 51
        Pin on BHAGAVATAM



(శ్రీ సాయి సత్ చరిత్ర అ.43-44  సాయిబాబా పెక్కుసారులు మసీదులో ఈవిధమయిన మధుర వాక్యములు పలికిరి.  “ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడు నన్ను దర్శించెదరునేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యమునా కధలు తప్ప మరేమియు చెప్పడుసదా నన్నే ధ్యానము చేయునునా నామమునే యెల్లప్పుడు జపించుచుండునుఎవరైతే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానింతురో వారికి నేను ఋణస్థుడనువారికి మోక్షమునిచ్చి వారి ఋణము దీర్చుకొనెదనుఎవరయితే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరయితే నాకర్పించనిదే యేమియు తినరో అట్టివారిపై నేను ఆధారపడి యుందునుఎవరయితే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురుకనుక నీవు గర్వము అహంకారము లేశమైన లేకుండ, నీ హృదయములోనున్న నన్ను సర్వస్యశరణాగతి వేడవలెను.”)

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.24 మనము గురుని స్మరించనిదే ఏవస్తునును పంచేంద్రియములతో ననుభవించరాదుమనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడు బాబాను జ్ఞప్తియందుంచుకొనెదము.)

బ్రహ్మ, విష్ణు శివాత్మకమగు ప్రపంచమంతయు ఒక్క గురుదేవుని స్వరూపమే అయి ఉన్నదిగురుదేవునికంటెను అన్యమైన శ్రేష్టవస్తువు లేదుకనుక గురుదేవుని పూజింపవలెను.                                                                 --- గురుగీతశ్లో 53
                Shirdi Sai Baba - Shraddha Saburi: The Avatar of Lord Dattatreya
( శ్రీ సాయి సత్ చరిత్ర అ. 10 గురువొకడే దేవుడుసద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన యదృష్టమును బాగుచేయగలరువారిని శ్రధ్ధగా సేవించినచో సంసారబంధములనుండి తప్పించుకొనగలము. )

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.16 – 17  సద్గురువును భగవంతునివలె కొలువవలెను.)

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.18 – 19 గురువే సర్వమును చేయువాడనియు, కర్తయనియు పూర్తిగా నమ్ముముఎవరయితే గురువుయొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే గురుని బ్రహ్మవిష్ణుమహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు.)

నిజగురువునకు సేవచేయుటవలన కులము పవిత్రమగుచున్నదిగురువు తృప్తి చెందిన బ్రహ్మాది దేవతలందరు తృప్తి చెందుచున్నారుఇది సత్యము.  
                            ---  గురుగీత -  శ్లో. 300
      The Greatest Guru Dakshina by Swami Chidananda – Antaryamin's Blog

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.24 బాబా తన భక్తులకు వారివారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెనుఅణ్ణా చించనీకర్, బాబా ఎడమచేతిని తోముతూ సేవ చేసెడివాడువేణుబాయి కౌజల్గి (మావిశీబాయి) కూడా బాబాకు సేవ చేస్తూ ఉండేదిఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వ్రేళ్ళు అల్లి బాబా ఒళ్ళు పట్టేది.)

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.7 భాగోజీ షిండే ప్రతిరోజు ఉదయము బాబా వారి కాలిన చేతి పట్టీలను విప్పినేతితో తోమి, తిరిగి కట్లు కట్టేవాడుబాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెనుతన భక్తుడైన భాగోజీ యందు  గల ప్రేమచే అతడొనర్చు ఉపాసనను బాబా గైకొనెనుబాబా లెండీకి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివాడుప్రతిరోజు ఉదయము బాబా ధునియొద్ద కూర్చొనగనే, భాగోజీ తన సేవాకార్యము మొదలిడువాడు.)
                           Oshi - Shirdi Sai Baba Fine Art (2) Paper Print - Religious ...
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 35 బాలాజీ పాటి నెవాస్కర్ బాబాకు గొప్ప భక్తుడు.  ఇతడు ఫలాపేక్ష లేకుండ చాలా మంచి సేవ చేసెను.  ఇతడు షిరిడీలో బాబా యేయే మార్గముల ద్వారా పోవుచుండెనో వానినన్నింటిని తుడిచి శుభ్రము చేయుచుండెను.  అతని యనంతరము ఈపని రాధాకృష్ణమాయి అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను.  ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను.  బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగనే దానినంతయు దెచ్చి బాబాకర్పితము చేయుచుండెను.  అతడు బాబా ఇచ్చినదానితో తన కుటుంబమును పోషించుకొనువాడు.  ఈ ప్రకారముగా నతడు చాలా సంవత్సరములు చేసెను.  అతని తరువాత అతని కుమారుడు దానినవలంబించెను.)

( శ్రీ సాయి సత్ చరిత్ర అ. 42 … లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెనుబాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివారుఅందులో కొంత తాను తిని మిగత రాధాకృష్ణమాయికి పంపుచుండెనుఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడు తినుచుండెను.)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List