Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, October 30, 2011

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి

Posted by tyagaraju on 7:25 AM







30.10.2011 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి

మానవ జీవితము గురించి శ్రీ షిరిడీ సాయి ఆలోచనలు

కూర్పు: సాయి.బా.ని.స. (రెండవభాగము)


షిరిడీ సాయి గురించి సాయి.బా.ని.స. చెప్పిన మాటలు ప్రత్యక్షంగా వినండి. ఇక్కడ ఇస్తున్న లింక్ క్లిక్ చేసి చూడండి.
http://youtu.be/1Z3dIeQvqZs


16. జీవితము ఒక కుస్తీ పోటీ వంటిది. మనము తప్పుడు కుస్తీ ఆడిననాడు రిఫరీ (భగవంతుడు) మన చేతులకు సంకెళ్ళు వేసి మన చేత కుస్తీ ఆడించుతూ మన ప్రత్యర్థుల చేతనే మనలను చితకబాదించి మనకు ఉన్న అహంకారము వదలిపోయేలాగ చేస్తాడు. జాగ్రత్త.

షిరిడీ సాయి 04.01.93

17. జీవితము అనే రైలు ప్రయాణములో భార్య, పిల్లలు నీతొటి ప్రయాణీకులు, నీవు, ఒక సారి రైలు దిగిపోయి యింకొక రైలు (ఆధ్యాత్మిక రైలు) ఎక్కడానికి ప్రయత్నము చేయవచ్చును. కాని, నీ తోటి ప్రయాణీకులు నీకు తోడుగా ఆధ్యాత్మిక రైలులో ప్రయాణము చేయటానికి రారు అని తెలుసుకో.

షిరిడీసాయి 06.01.93

18. జీవితములో లేనిది ముఖ్యము కాదు - ఉన్న దాంట్లో తృప్తి ఉన్నదా లేదా అనేది ముఖ్యము.

షిరిడీసాయి 16.12.92

19. జీవితములో ఆఖరి రోజులు భార్యతో పాత కారులో ప్రయాణము వంటిది. రోడ్డుకు అడ్డముగా మనవలు చేసే చిలిపి అల్లరి - రోడ్డు ప్రక్కన అమ్మబడే తినుబండారాలు తినాలి అనే జిహ్వ చాపల్యం, నీ ప్రయాణానికి ఆటంకాలు జాగ్రత్త.

షిరిడీసాయి 07.01.93

20. జీవితము సాథుజంతువులతో కూడిన అభయారణ్యము. సాథుజంతువులను జాగ్రత్తగా కాపాడాలి. వాటిని కష్ట పెట్టి పరుగులు తీయిస్తే ఎలుగుబంటి వచ్చి వాటిని చంపటానికి ప్రయత్నించుతుంది. అపుడు నీవు ఎలుగుబంటిని చంపడానికి నానా పాట్లు పడాలి. ఎందుకువచ్చిన పాట్లు. హాయిగా సాథుజంతువులను కాపాడుకో.

షిరిడీ సాయి 07.01.93

21. జీవితములో నీవు ఒక రిక్షాలాగేవాడివి. నీ భార్య పిల్లలు నీ రిక్షా ఎక్కుతారు. నీకు ప్రేమ అనురాగాలు అనే డబ్బు ఇచ్చి నీ రిక్షా నుండి దిగిపోతారు. నీలో ఓపిక తగ్గిపోతుంది. అపుడు నేను నిన్ను నీ రిక్షాలో కూర్చుండబెట్టుకొని రిక్షాలాగి నిన్ను నీ గమ్యము చేర్చుతాను.

షిరిడీ సాయి 12.01.93

22. జీవితము అనే లోహాన్ని కష్టాలు సుఖాలు అనే అగ్నిలో కాల్చబడని, సమ్మెట దెబ్బలు తగలనీ. దాని తర్వాత సాయి అనబడే ద్రావకములో ముంచి తీయి. అపుడు దాని రంగును, కాంతిని చూడు.

షిరిడీ సాయి 09.02.93

23. జీవితములో తీర్థయాత్రలు (భగవంతుని అన్వేషణ) చేయటము మంచిదే. అలాగ అని మొదటి ష్టేషన్ నుండే యాత్ర ప్రారంభించనవసరము లేదు. మధ్య ష్టేషన్ లో కూడా రైలు ఎక్కి యాత్రలు ప్రారంభించు.

షిరిడీ సాయి 01.02.93

24, జీవితములో గుడులు, గోపురాల చుట్టు ప్రదక్షిణలు చేయటము వలన నీవు భగవంతుని చుట్టు ప్రకక్షిణలు చేసిన అనుభూతిని మాత్రమే పొందగలవు. దానికంటే గొప్ప విషయము చెబుతాను విను. భగవంతుడు నీ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అంటే దిక్కులేనివానికి దేవుడే దిక్కు అనే మాట ప్రకా రము ఒక దిక్కులేని అనాథబాలుడిని నీ ఒడిలో చేర్చుకో, అపుడు భగవంతుడు అనాధ బాలుని చూడటానికి నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు.

షిరిడీ సాయి 13.02.93

25. జీవితములో నీవు ఒంటిఎద్దు బండినిలాగే ఒంటి ఎద్దువి. బండిని లాగి లాగి అలసిపోయినావు. కొంచము విశ్రాంతి తీసుకో. తిన్న తిండి (జ్ఞాపకాలను) నెమరు వేసుకో. తర్వాత అవసరము అయితేనే తిరిగి బండిని లాగటానికి ప్రయత్నించు.

షిరిడీ సాయి 14.02.93

26. జీవితము సినిమాను ప్రదర్శించే యంత్రములాంటిది. నీవు ఆయంత్రమును నడిపేవాడివి. తెరమీద బొమ్మను చక్కగా చూపించినంతకాలము ప్రేక్షకులు (భార్యాపిల్లలు) సినిమాను చూస్తూ అనందించుతూ నీ గొప్పతనాన్ని చూసి పొగడుతారు. ఒకవేళ సినిమా మధ్యలో ఫిలిం తెగిననాడు నీ చేతకానితనానికి నిందించుతారు. మళ్ళీ ఫిలుమును అతికించి తెరమీద "శుభం" అనే అక్షరాలు కనిపించేవరకు నీవు సినిమా యంత్రాన్ని నడుపుతూ ఉండాలి. ప్రేక్షకులను వదలి పారిపోలేవు.

షిరిడీ సాయి 02.03.93

27. జీవితము ఏడు అంతస్థుల మేడవంటిది. ;మొదటి ఆరు అంతస్థులలో నివసించకుండ ఏడవ అంతస్థులో ఏడు ద్వారాల గదిలో నీవు నాతో కలసి నివసించుతూ భగవంతుని దగ్గరకు చేరటానికి ప్రయత్నించు.

షిరిడీ సాయి 08.02.96

28. జీవితములో మనము ఎన్నిగాలిపటాలను పందాలలో తెగకోసినాము అనేది మంచిది కాదు. జీవితములో ఎన్నిగాలిపటాలు చిక్కుపడకుండ ఎగరవేయగలిగాము అనేది ముఖ్యము.

షిరిడీ సాయి 27.09.95

29. జీవితములో నీవు సంపాదించిన ఆస్థి పాస్థులను చూసి నిన్ను నీ బంధువులు గుర్తించుతారు. దొంగలు నీ ఆస్థి పాస్థులను దోచుకుంటారు. నీవు నానుండి ఆధ్యాత్మిక సంపదను సంపాదించుకో. ఎవరూ దానిని దొంగిలించలేరు. సంపాదనను పదిమందికి పంచిపెట్టి సాయి బంధువుల గుర్తింపు పొందు.

షిరిడీ సాయి 31.10.95

30. జీవితములో పంతాలకు పోరాదు. జీవితము మన ముందుకు ఏవిథముగా వస్తే దానిని సంతోషముగా స్వీకరించి ఒడిదుడుకులు లేకుండా జీవించాలి.

షిరిడీ సాయి 14.12.95

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

(ఇంకా ఉంది)




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List