Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, April 1, 2016

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 12వ.భాగమ్

Posted by tyagaraju on 8:11 AM
Image result for images of saibanisa
     Image result for images of rose flowers hd

01.04.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు, సాయిబానిసగారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని తెలుసుకుందాము.
Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 12వ.భాగమ్


19.12.2011

111.  ఎదుటివాని మతంలోనివారు తమ పూజలు తాము చేసుకుంటు ఉంటే నీవు వారి పూజా విధానాన్ని గౌరవించాలిఅదే విధంగా వారు నిన్నూ నీధర్మాన్ని గౌరవించాలిఅపుడు సమాజంలో గొడవలే ఉండవు.   

11.01.2012

                       Image result for images of shirdi sai baba kind look

112.  భగవంతుని అనుగ్రహం అనేది చల్లని పిల్లగాలిలా ఉంటుందిఅదే భగవంతుని ఆగ్రహం పెను తుఫాను గాలిలా ఉంటుందిఅందుచేత నీ జీవితంలో పిల్లగాలి వీచినపుడు భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేయి.    


19.02.2012

113.  భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, ఇవి పంచభూతాలువీటి కలయికే శరీరము శరీరంలో ఏఒక్కటి తీసి వేసినా శరీరములోని ప్రాణము పోతుంది.

                                    Image result for images of vishnusahasranama parayana

114.  ప్రతి గురువారము, శుక్రవారాలలో విష్ణుసహస్రనామము, లలితాసహస్రనామాలను మందిరంలో సామూహికంగా పఠించి దేవీ పూజ చేసిన దేవీ దేవతల అనుగ్రహం పొందవచ్చును.    
                                                                                                                                                                              ---  సాయిబానిస
                 Image result for images of vishnusahasranama parayana

16.05.2012

115.  ఈ లోకంలో నీ కంటికి కనిపించేదంతా మాయనీవు కళ్ళు మూసుకుని మనో నేత్రంతో చూడగలిగిందే శాశ్వతముఅందుచేత మాయను మర్చిపోయి శాశ్వతమయిన భగవంతుని అనుగ్రహాన్ని పొందు.   


02.06.2012

116.   తారాబలం, చంద్రబలం కన్నా, దైవబలం గొప్పదని నేను భావిస్తున్నాను.

27.06.2012

117.  పరమశివుడు రామారక్షాస్తోత్రమును బుధకౌశికఋషికి కలలో చెప్పినాడు కదాశ్రీసాయి  తన భక్తులకు కలలలో అనేక సందేశాలు యిచ్చినారని సాయి సత్ చరిత్రలో చెప్పబడిందిఈనాడు సాయి శరీరంతో లేకపోయినా తన అంకిత భక్తులకు స్వప్నాలలో సందేశాలు ఇచ్చి, తన భక్తులను సన్మార్గంలో నడిపిస్తున్నారు.     
                                                                                                                                                                           ---  సాయిబానిస
 ((శ్రీ ఎస్.పి.బాల సుబ్రహ్మన్Yఅం, శ్రీమతి ప్.సుశీల గానం చేసిన శ్రీరామ రక్షా స్తోత్రం యూ ట్యూబ్ లో వినండి)
https://www.youtube.com/watch?v=5A26_QtIjtw

09.07.2012

118.  నీ ఆధ్యాత్మిక ప్రయాణము నీ యింటినుంచే ప్రారంభించాలితిరిగి నీ ఇంటిలోనే పూర్తిచేసుకోవాలిబయటి ప్రపంచంలోని వారితో కలిసి ఆధ్యాత్మికంలో పయనిస్తే నీకు మిగిలేది తల నెప్పులేనీ మనసుకు అశాంతి మాత్రమే మిగులుతుందినీ గమ్యాన్ని చేరలేవు జాగ్రత్త.  


11.07.2012

119.  నాదగ్గిర పగ అనే పాముండేదిదానిని అడవిలో విడిచిపెట్టాను   తరువాత పగను ప్రేమగా మార్చుకున్నానుఅపుడు అదే పాము తిరిగివచ్చి నా మెడలో హారమయింది.   పరమశివుడు నా హృదయంలో నివసించసాగాడు

13.07.2001

120.  భగవంతుని ఆదేశానుసారము భగవంతుడు చూపిన కక్ష్యలోనే సూర్యచంద్రులు పరిభ్రమిస్తున్నారే అలాగే మన పాలిట భగవంతుడయిన మన గురువు చూపిన మార్గంలో మనం పయనిస్తూ భగవంతుని పాదాల వద్దకు చేరుకుందాము
                        Image result for images of shirdi saibaba lotus feet
(మరికొన్ని ఆధ్యాత్మిక సందేశాలు మరుసటి సంచికలో)


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List