02.04.2016
శనివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయి వైభవం - అన్నీ నేనే, అంతా నేనే
ఈ రోజు ‘ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి’ 31.03.2016 వ.సంచికలో ప్రచురింపబడిన లీల 96 కు తెలుగు అనువాదం.
శ్రీ
డీ.జె. జోగ్లేకర్ దాదర్ ముంబాయిలో ఉంటాడు.
అతను వాసుదేవ సరస్వతి టెంబేస్వామి వారి భక్తుడు. (టెంబేస్వామి గురించిన వివరణ శ్రీసాయి సత్ చరిత్ర
50 వ.అధ్యాయంలో గమనించవచ్చు) 1914 వ.సంవత్సరంలో అతను వాసుదేవ సరస్వతిగారిని దర్శించుకోవడానికి
గరుడేశ్వర్ కు వెళ్ళారు.
అతను అక్కడ ఉన్న రోజుల్లో,
టెంబెస్వామిని “స్వామీజీ, మీ మహాసమాధి తరువాత నా బాగోగులు ఎవరు చూస్తారని” అడిగాడు.
“షిరిడీ వెళ్ళు, అక్కడ నా సోదరుడు సాయిబాబా ఉన్నారు” అని సమాధానమిచ్చారు టెంబేస్వామి. ఆయన దర్శనంతోను, ఆయన ఇచ్చిన సమాధానానికి సంతృప్తుతుడయి
ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాడు.
1916
వ. సంవత్సరంలో షిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకుని షిరిడీకి ప్రయాణమయ్యాడు. కోపర్ గావ్ లో చిన్న గది అద్దెకు తీసుకుని ప్రతిరోజు
షిరిడీకి నడిచి వెళ్ళేవాడు. ద్వారకామాయికి
చేరుకోగానే అక్కడ ఒక మూల కూర్చుని బాబా తనని పిలుస్తారనే ఆశతో ఎదురు చూస్తూ ఉండేవాడు.
బాబా పిలుపు కోసం రోజూ ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆఖరికి సాయంత్రమయేటప్పటికి కోపర్ గావ్ కి
తిరిగి వెళ్ళిపోయేవాడు.
ఈ విధంగా అయిదు మాసాలు
గడిచినా కూడా బాబా పిలవలేదు, అనుగ్రహించలేదు అంతే కాక అతను వచ్చి కూర్చున్నాడన్న విషయం
కూడా గమనించలేదు. తెచ్చుకున్న డబ్బుని చాలా
పొదుపుగా వాడుకుంటూ కిచిడీ మాత్రమే తినేవాడు.
తొందరలోనే ఉన్న డబ్బు కాస్తా ఖర్చయిపోయింది. మరుసటి రోజు షిరిడీ వెళ్ళాడు. ఈసారి ఎలాగయినా సరే ద్వారకామాయి లోపలికి వెళ్ళి,
బాబాకు నమస్కరించాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. ద్వారకామాయి మెట్లెక్కుతుండగానే బాబా అతనివైపు సూటిగా
చూస్తూ, “చల్ జావో, చల్ జావో (వెళ్ళు, వెళ్ళు) అన్నారు. మరునాడు కూడా ద్వారకామాయి మెట్లెక్కుతుండగా ఆవిధంగానే
జరిగింది. బాబా అతనితో “ఇక్కడికెందుకు వచ్చావు
నువ్వు, వెళ్ళిపో” అన్నారు. అయినా గాని అతని
మనసంతా బాబా మీద ప్రేమ భక్తితో నిండిపోయింది.
తను
రెండవసారి బాబా దగ్గిరకి వెళ్ళే ప్రయత్నం చేయడం తెలివితక్కువ పనేమీ కాదనుకుని, ఇక ఇంటికి
తిరిగి వెళ్ళిపోదామనుకున్నాడు. ఆ సమయంలో అతని
వద్ద కేవలం అయిదు అణాలు మాత్రమే మిగిలాయి.
ఇంకా అవసరమయిన డబ్బు కావాలంటె ఏదారీ లేదు.
అందువల్ల టెక్కెట్ లేకుండానే రైలెక్కి వెళ్ళిపోదామనుకున్నాడు. రైలు స్టేషన్ లో రైలెక్కుతుండగా ఒక కూలీ అతని చొక్కా
పట్టుకుని లాగాడు. కూలీ తన చొక్కా పట్టుకుని
లాగడమేమిటని ఎక్కబోతున్న రైలు నుండి దిగాడు.
కూలీ అతని చేతిలో ఒక ఒక టిక్కెట్టు, అయిదు అణాలు పెట్టాడు. ఆశ్చర్యపోతూ “ నువ్వెందుకు ఈ టిక్కెట్టు కొన్నావు?
ఎప్పుడు? ఎవరు కొనమన్నారు నిన్ను” అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. కూలీ దిగ్భ్రమ చెంది, “నిన్న మీరే కదా నాకు డబ్బిచ్చి
టిక్కెట్టు కొనమన్నారు, టిక్కెట్టు కొని మిగిలిన అయిదు అణాలు మీకిచ్చాను” అని కూలీ టిక్కెట్టు, చిల్లర అతని చేతిలో కుక్కి ముందుకు
వెళ్ళి జనంలో అదృశ్యమయిపోయాడు.
సంవత్సరాలు
దొర్లిపోయాయి. తనను రక్షించినది బాబాయే అని
అతనికి తెలుసు. 1952 వ.సంవత్సరంలో ఒకసారి దాదర్
లో ఉన్న విద్యాపది మందిరానికి వెళ్ళాడు. అక్కడ
ఉన్న బాబా చిత్రపటంలో బాబా అతనికి టెంబేస్వామిగా, స్వామి సమర్ధగా, దత్తాత్రేయునిగా
దర్శనమిచ్చారు. షిరిడీ వెళ్ళమని ఆదేశించిన
టెంబేస్వామి ఆదేశం వ్యర్ధం కాలేదు. అంతకన్నా
అతను కోరుకోవలసినదేముంది?
(మరికొన్ని
వైభవాలు ముందు ముందు)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment