03.04.2016
ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బందువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ
రోజు సాయిలీల మాస పత్రిక ఫిబ్రవరి, 1975 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన మరొక అద్భుతమైన
సాయి చమత్కారాలను చూద్దాము.
శ్రీ
సాయి లీలామృత ధార – శ్రీ సాయి దర్శనం
బెల్గాం
దగ్గిర హిడ్ కల్ డ్యామ్ దగ్గిర నేను నా ప్రాణ స్నేహితునితో కలిసి ఉంటున్నాను. అతను బ్రాహ్మిన్స్. అతని వల్లనే నాకు 1967 వ.సంవత్సరం
డిసెంబరులో సాయి ని పూజించడానికి ప్రేరణ కలిగింది.
మొదటిసారిగా
నేను గురుచరిత్ర వారం రోజులు పారాయణ చేసి అనుకున్న ప్రకారమే గురువారం నాటికి పూర్తి
చేశాను. అదే రోజు రాత్రి నాకు కలలో బాబా దర్శనమిచ్చి
మరుసటి రోజు ఇంటర్వ్యూకి వెళ్ళమని ఆదేశించారు.
బాబా నేను చేసే పూజను, నా నమ్మకాని స్వీకరించారని నాకు వచ్చిన కలను బట్టి గ్రహించుకున్నాను. మరుసటి రోజు శుక్రవారమ్. ఉదయాన్నే యధావిధిగా నా కార్యక్రమాలన్నిటినీ పూర్తి
చేసుకుని శివాలయానికి వెళ్ళి వచ్చాను. నేను
వచ్చేటప్పటికి ఒకతను నేను ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఒక పరిచయ పత్రం తీసుకుని వచ్చి నాకోసం
ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎటువంటి నియమ నిబంధనలు
(ఫార్మాలిటీస్) లేకుండానే నాకు ఉద్యోగం వచ్చింది.
నేను ఇంతకు ముందు చేసిన ఉద్యోగంతో పోల్చుకుంటే ఈ కొత్త ఉద్యోగం అంత ఆకర్షణీయంగా
ఏమీ లేదు. దానివల్ల నా మనసుకు తృప్తి లేకపోయింది.
వీటిని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించమని సాయినాధుని ప్రార్ధించాను. నేను సాయిని పూజించే పధ్ధతి కూడా చాలా సామాన్యంగానే
ఉంటుంది. ఎప్పుడూ ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఆయన రూపాన్ని గుర్తుంచుకుంటూ ఉంటాను అంతే. ఈ పధ్ధతి వల్ల నా ఆలోచన విధానాలు మారి నామనసు పరిశుధ్ధ
పడి, నా మానసిక పరిస్థితి ప్రశాంతత పొందింది.
సాయి ప్రేరణతో నాలో ఉన్న సందేహాలన్నిటినీ ప్రక్కన పెట్టి, క్రొత్త ఉద్యోగంలో
మనసు పెట్టి శ్రధ్ధగా పని చేయసాగాను. నా నిరంతర
ప్రయత్నం వల్ల ప్రాధమికంగానే ఎక్కౌంటింగ్ (ఖాతాల నిర్వహణ) లో నా నేర్పరి తనానికి సంస్థలో
మంచి గుర్తింపును తెచ్చుకున్నాను.
నల్ల
పిల్లి రూపంలో బాబా నైవేద్యాన్ని స్వీకరించుట.
మూడు
నెలల తరువాత నా వివాహం నిమిత్తమై కేరళ వెళ్ళాను.
పెళ్ళికి ముందు నేను ఉంటున్న ఊరిలోనే పారాయణ మరొక సప్తాహం చేశాను. ఆఖరి రోజున నా స్నేహితులని, బంధువులని అందరినీ ఆహ్వానించాను. ఆరతికి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు, సాయి ఫోటో
ముందు ఒక నల్ల పిల్లి వచ్చి, సాయికి సమర్పించిన నైవేద్యాన్ని ఒక్క గుటకలో మింగేసి మాయమయిపోయింది. ఆ దృశ్యం, ఆ చమత్కారం చూసి అక్కడున్నవారందరూ చాలా
ఆశ్చర్యపోయారు. మొదటిసారిగా అనుభవించిన ఈ ఆధ్యాత్మికానుభూతిని
వారందరూ అందరితోనూ పంచుకుని ఎంతో ఆనందాన్ని పొందారు. అన్ని ప్రాణులలోను సాయి ఉన్నారనే విషయాన్ని ఈ సంఘటన
ద్వారా సాయి మహిమను వీక్షించి ఆనందాశ్చర్యాలను పొందారు.
నా
పుట్టిన రోజునాడు సాయి పాముగా దర్శనమిచ్చుట
రోజు
రోజుకి సాయి మీద నా భక్తి పెరగసాగింది.
1969 వ.సంవత్సరంలో నా పుట్టిన రోజునాడు, సాయి మంత్రాన్ని జపిస్తూ నా భార్యతో
కలిసి సాయి ఫోటోకి ఆరతినిస్తున్నాను. అప్పుడు
అక్కడ సాయి వచ్చి ఉన్నారనే భావన కలిగింది.
అదే సమయంలో సాయి ఫోటో ముందు బంగారు రంగులో మెరుస్తున్నట్లుగ ఏదో కనిపించింది. మా దృష్టి అటువైపు మళ్ళింది. అది ఆరు అంగుళాల పొడవున్న పాము. నా ఆనందానికి అంతులేదు. ఆ సాయి లీలను చూసిన నా భార్య కి నోట మాట లేదు. పాముకి కాసిని పాలు తెమ్మని చెప్పాను. నా భార్య పాలు తీసుకు రాగానే దానికి సమర్పించాము. కొద్ది నిమిషాలలోనే అది మాయమయి పోయింది. నాలోని నమ్మకాన్ని, భక్తిని ఆయన ఆవిధంగా గుర్తించారు. అప్పటినుండి సాయి భక్తులందరికీ నా చిన్న పూజా గది ఒక పూజనీయ స్థలంగా మారిపోయింది. యజ్ఞాలు నిర్వహించడానికి వచ్చిన ఒక సాధువు ఇవి సాయినాధులవారు చూపించిన అపూర్వమయిన, అరుదైన సన్నివేశాలని
తెలియచేశారు.
కె.ఆర్. గోపీనాధ్, బీ.కామ్
హుబ్లి,
కర్ణాటక
మరికొన్ని
అమృత ధారలు తరువాతి సంచికలో
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment