04.04.2016 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
అందరిలోను నన్ను చూడు - నీ కోరిక ఎలా తీరెనో చూడు
సమయం కుదరనప్పుడు భక్తితో ఒక పుష్పం సమర్పించి మనస్పూర్తిగా ఆయనని భక్తితో వేడుకోవాలి. ఆయ్యో ఆయనకి నేననుకున్నట్టుగా సేవ చేయలేకపోయానే అని మనసుకి బాధ కలిగినప్పుడు ఆయన మన మనోవేదనని ఏవిధంగా దూరం చేస్తారో మనం ముందర గ్రహించలేము. గ్రహించుకున్న తరువాత బాబా ఎంత దయాళువో మనకి అర్ధమయి ఆయన మీద మనకి ప్రేమ, భక్తి రెట్టింపు అవుతుంది.
శ్రీమతి
కృష్ణవేణిగారికి ఈ అనుభవం ఈనెల ఒకటవ తారీకున జరిగింది. ఆవిడ పంపిన అనుభవాన్ని యధాతధంగా అందిస్తున్నాను. ఈ అనుభూతికి అడిగిన వెంటనే చిత్రాన్ని అందించినవారు
శ్రీమతి ప్రసూన, మియాపూర్, హైదరాబాదు. వారికి బాబా ఆశీర్వాదములు.
ఈ
రోజు రాత్రికి చపాతీలు చేశాను. మొదటి చపాతీ
బాబాకు పెడదామనుకున్నాను. కాని, పెద్ద పాప
ఆకలిగా ఉందని అడగటంతో మర్చిపోయి పాపకు చపాతీ తినిపించేశాను. అప్పుడు గుర్తుకు వచ్చింది. అయ్యో ! మొదటి చపాతీ బాబాకు పెట్టెలేదే అని బాధ
పడ్డాను. అపుడు మనసులో ఇలా అనుకున్నాను.
“మీకు ముందుగా చపాతీ నైవేద్యం పెట్టడం మర్చిపోయి పాపకు తినిపించేశాను. కాని మీరు, మేము తినేముందుగా చపాతీ ఎలా తింటారో చూడాలని ఉంది”.
“మీకు ముందుగా చపాతీ నైవేద్యం పెట్టడం మర్చిపోయి పాపకు తినిపించేశాను. కాని మీరు, మేము తినేముందుగా చపాతీ ఎలా తింటారో చూడాలని ఉంది”.
ఇంతలో మా ఇంటికి మా మామయ్య గారి స్నేహితులు వచ్చారు. ఆయన సాయి భక్తులు. ఆయన మా మామయ్యగారితో మాట్లాడుతూ కూర్చున్నారు. మా అత్తగారు చపాతీలు తీసుకుని వచ్చి టిపిన్ తినండి అనగానే ఆయన చపాతీ తిన్నారు.
ఆశ్చర్యం ఏమిటంటే ఆయన మా ఇంటికి ఎప్పుడు వచ్చినా ఏమీ తీసుకోరు మంచినీళ్ళు తప్ప. అలాంటి ఆయన టిఫిన్ తీసుకోండి అని అడిగిన వెంటనే తనడం ఆశ్చర్యమే కదా. ఆయన కేవలం ఒక్క చపాతీ మాత్రమే తిన్నారు. ఎందుకంటే నేను ఎప్పుడూ మొదటి చపాతీ మాత్రమే బాబాకి నైవేద్యంగా పెడుతున్నాను. కనక మా అత్తగారు అడిగిన వెంటనే ఒక్కటి మాత్రమే చాలు అన్నారు. అది కూడా ఆయన మేము తినబోయే ముందు బాబా గారి రూపంలో వచ్చారు. ప్రొద్దుటే మా అత్తగారు “రాత్రి ఆయన చపాతీ తినడం చాలా ఆశ్చర్యంగా ఉంది” అన్నారు. ఆయన ఎప్పుడు వచ్చినా 5 లేక 10 నిమిషాలు ఉంటారు. ఒక్కొక్కసారి బయటి నుండే పలకరించి వెళ్ళిపోతారు. చాలా మొహమాటస్థులు. సాయంత్రం 6 గంటలకే వచ్చారు. మా మామయ్యగారితో మాట్లాడుతూ కూర్చున్నారు. మా అత్తగారు యోగా క్లాసులకి వెళ్ళారు. ఆయన రాత్రి 8.30 వరకు ఉన్నారు. మా అత్తగారు రాగానే టిపిన్ తింటారా అని అడిగారు. ఆయన ఒక్క చపాతీ మాత్రమే తిన్నారు.
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment