05.04.2016 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
అందువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు సాయిబానిసగారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.
శ్రీ
సాయి పుష్పగిరి - ఆధ్యాత్మికమ్ – 13వ.భాగమ్
14.07.2012
121. కోతి
పిల్లకు పాలు పట్టాను . తల్లి
కోతి తన పిల్లకు ఏమి ప్రమాదం జరుగుతుందోనని
చూడసాగింది. నేను
అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాను కోతి
పిల్ల తన తల్లి పొట్టను
గట్టిగా పట్టుకొంది. తల్లి,పిల్ల చెట్టు మీదకు వెళ్ళిపోయాయి. ఇది
మర్కటకిశోర న్యాయమని
నేను భావించాను. మనం
కూడా మన గురువు పాదాలను
విడవరాదు. మన
గురువు మన బాధ్యతలను స్వీకరించి
మనలను మన గమ్యానికి చేరుస్తారు.
18.07.2012
122. బీదవారయినా,
గొప్పవారయినా వారి వారి మత సాంప్రదాయాలను వారు
సక్రమముగా నిర్వహించి భగవంతుని చేరుకోవాలి. మత మార్పిడులకు అన్య మతాల జోలికి వెళ్ళటానికి నేను అనుమతించను.
19.07.2012
123. సంసార
జీవితంలో భార్యాభర్తలు కలిసి ఉండాలి. తమ బాధ్యతలను నిర్వహించాలి. జీవిత
ఆఖరి దశలో భార్యపై వ్యామోహం పెంచుకోరాదు. శరీరముపై
వ్యామోహము,
భార్యాపిల్లలపై వ్యామోహము నీవు నీ గమ్య స్థానానికి
చేరటానికి ఆటంకాలు కలిగిస్తాయి.
23.07.2012
124. మానవుడు
చంద్రమండలానికి వెళ్ళగలిగాడే కాని, విశ్వమంతా వ్యాపించి
ఉన్న భగవంతుడిని మాత్రం చూడలేకపోయాడు.
24.07.2012
125. ముళ్ళ
జాతికి చెందిన ఖర్జూరపు చెట్లు, రేగు చెట్లను మనము కౌగలించుకోరాదు.
ఆ చెట్ల కింద పడ్డ తీయటి పండ్లను
తీసుకొని ఆస్వాదించాలి. అలాగే
నీ శత్రువులను నీవు కౌగలించుకోరాదు.
వానిలో ఏదయినా మంచి గుణాలుంటే వాటిని అలవరచుకోవాలి.
29.07.2012
126. పుట్టబోయే
బిడ్డకోసం తల్లి ఎలాగయితే ఆలోచిస్తుందో
అదే విధంగా నేను నా భక్తుల
మరు జన్మల గురించి ఆలోచిస్తాను.
03.08.2012
127. ఆధ్యాత్మిక
జ్ఞానాన్ని పుస్తకాల ద్వారా పొందలేము. దానిని
సాధన, స్వయం కృషి ద్వారానే పొందాలి.
128. శరీరముపై
వ్యామోహము ఉండరాదు అని భావించినపుడు మురికినీటిలో
స్నానము చేయవలసినా చేయాలి. చిన్నపిల్లలు
(అవధూతలు) మలమూత్రాలతో ఆడుకున్న విధంగా ఆడుకోవాలి. (అవధూతల లక్షణములు)
04.08.2012
129. నేను
చేయని తప్పులకు, ఇంటిలో తల్లి, అక్క, తమ్ముడు, చెల్లిలితో
గొడవలుపడి బయటకు వచ్చాను. ఇది నా
ఆధ్యాత్మికప్రయాణానికి మొదటి మైలురాయిగా ఉపయోగపడింది.
--- సాయిబానిస
04.08.2012
130. రాత్రికి
రాత్రి కట్టుబట్టలతో రైలు స్టేషన్ కి వెళ్ళాను.
అక్కడ రైలు లేదు కాని
ఆస్టేషను నుంచి యింకొక కొండమీదకి
యినప తాడుతో కట్టబడి చక్రాలమీద ప్రయాణం చేసే ఒక తొట్టి
ఉంది. నేను
ఒక్కడినే ఆ తొట్టెలో కూర్చున్నాను. వెంటనే
ఆయంత్రం తిరగడం ప్రారంభమయింది. నేను
ఆ దూరపు కొండకు చేరుకొన్నాను. ఆ
కొండ మీదకు దిగి నన్ను నేను
చూసుకున్నాను. నా
వంటిమీద బట్టలు లేవు. చీకటి
తొలగిపోయి సూర్యోదయమవుతున్నది. తిరిగి
నా నూతన జీవితం ప్రారంభించాను.
సాయిబానిస
(మరికొన్ని
ఆధ్యాత్మిక సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment