Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, April 6, 2016

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మికమ్ – 14వ.భాగమ్

Posted by tyagaraju on 8:56 AM
Image result for images of shirdi sai after shej aarti
Image result for images of rose hd

06.04.2016 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిస గారికి బాబావారు ప్రసాదించిన మరికొన్ని ఆధ్యాత్మిక సందేశాలు మన కోసం.
Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరి -  ఆధ్యాత్మికమ్ – 14వ.భాగమ్


08.08.2012

131.  నీకు జన్మనిచ్చిన నీ తల్లిని నీ జన్మస్థలాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దునీ తల్లికి చేసే సేవ సాయికి సేవగాను, నీ జన్మస్థలమును షిరిడీగాను భావించి జీవించు
                                                                                                                                                                              సాయిబానిస

10.08.2012

                          Image result for images of doing bhajans in house

132.  కుటుంబంలో అందరూ భగవంతుని భక్తులయినా మంచిదేఅలాగని పనిపాటలు మానివేసి, నిత్యము పూజలు, భజనలు చేస్తూ ఉంటే జీవనవిధానంలో అనేకమయిన తలనొప్పులు రాగలవుఅందుచేత భగవతునిపై భక్తిని జీవితంలో ఒక భాగము మాత్రముగానే చూడు.  


19.08.2012

133.  ఆధ్యాత్మిక రంగంలో నీ స్వయం కృషిని (ఒక తపస్సులాగ) భగవంతుడు చూసి ఆయన సదా నీకు తోడుగా ఉండి నిన్ను నీ గమ్యానికి చేర్చుతాడు.  


20.08.2012
            Image result for images of atom

134.  అణుశక్తి సూక్ష్మమయిన అణువునుండి వస్తుందిఅలాగే ఆధ్యాత్మిక శక్తి సూక్ష్మమయిన ఆత్మనుండి ఉద్భవిస్తుంది.

                                   Image result for images of meditation

26.08.2012

                                      Image result for images of hen and eagle

135.  తల్లి కోడి తనపిల్లలకు ఆహారం తినడం నేర్పుతుందితన పిల్లలను కాపాడుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తుంది. తన పిల్లలపై దాడిచేయడానికి వచ్చే డేగతో కూడా దెబ్బలాడటానికి సిధ్ధపడుతుందితల్లికోడి నిజమయిన మాతృమూర్తిగా జీవిస్తుందిఅదే విధంగా సద్గురువు కూడా తన భక్తులను తల్లి కోడి లాగ కాపాడుతారు.   
                            Image result for images of saibanisa


20.09.2012

136.  వానప్రస్థాశ్రమంలో దేవాలయాలకి, తీర్ధయాత్రలకి వెళ్లవలసిన అవసరము లేదునీ దేహమే దేవాలయముభగవంతుడు నీగుండెలోనే ఉన్నాడని భావించి జీవించు
         Image result for images of baba in mans heart

(శ్రీమతి పీ.సుశీల గానం చేసిన నా దేహమే నీదేవళం  పాట వినండి..యూ ట్యూబ్ లింక్ ఇస్తున్నాను)
https://www.youtube.com/watch?v=EVOIEiS6ch8


27.09.2012

Image result for images of vinayaka chavithi palavelli

137.  వినాయకచవితినాడు పూజ అనంతరము పాలవెల్లికి కట్టిన మొక్కజొన్నపొత్తులను వినాయకుని పేర నోరులేని జీవాలకి పెట్టడానికి ఎవరూ ముందుకు రావటల్లేదే అని బాధపడుతున్నానువాటిని కాల్చుకుని తిని నోరులేని పశువులకు పశు గ్రాసమును లేకుండా చేస్తున్నారు

27.10.2012

138.   మనిషి అంతిమయాత్రలో ఆఖరిస్నానం చేయించి ఆ పార్ధివ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తారుఅదే మనిషి ఆత్మ తిరిగి పునర్జన్మ ఎత్తినపుడు శిశువు బాహ్యప్రపంచములోనికి వచ్చిన వెంటనే మొదటిస్నానం చేయిస్తారుఈ స్నానాలు శరీరానికి మాత్రమే కాని ఆత్మకు కాదు.  


29.10.2012

139.  నీ ఇంటి నిర్మాణము పూర్తయిన తరువాత ఈశాన్యంలో పూజా మందిరం నిర్మించాలి అని ఆలోచించేకన్నా జీవితానికి పనికివచ్చే ఈశావ్యాసోపనిషత్తు గురించి తెలుసుకో.

03.11.2012

                   Image result for images of shirdi sai baba in fields

140.  ఉదయం వేళలో నన్ను దర్శించడానికి నా మందిరాలకు రానవసరం లేదునీ  గ్రామంలోని పొలాల గట్ల మీద విహరిస్తూ ప్రకృతిలో నన్ను చూడు.

(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)





Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List