31.03.2017
గురువారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
లీలా తరంగిణి –9 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల
రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనుబదింపబడినది)
సాయి
లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల
తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి
నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్
ఖైల్ గేట్, దుబాయి
Email
: tyagaraju.a@gmail.com
సప్త
సప్తాహం - బాబా లీలలు
విజయవాడ
మేరీస్టెల్లా కాలేజీ దగ్గర షిరిడీ సాయిబాబా మందిరం ఉంది. 1985 వ.సంవత్సరంలో హైద్రాబాద్ నుండి వచ్చిన శ్రీ
డి.శంకరయ్యగారి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరంలో ‘శ్రీసాయిబాబా సప్త సప్తాహం' కార్యక్రమం,
దత్తజయింతి రోజున ప్రారంభమయింది. ఆ కార్యక్రమానికి
పూజ్య మహల్సాపతి కుమారుడయిన శ్రీ మార్తాండ మహరాజ్ గారి వద్దనుంచి బాబా పాదుకలు, కఫనీ,
పెద్ద సైజు సాయిబాబావారి చిత్రపటం తీసుకుని వద్దామని నిర్ణయించుకున్నాము.
వాటిని తీసుకురావడానికి శ్రీ డి.శంకరయ్యగారితో కలిసి
షిరిడీకి వెళ్ళే అవకాశం లభించింది. మేమంతా
ఒక వ్యానులో బయలుదేరాము. మొదటగా మేము ఉమ్నాబాద్
లో ఉన్న శ్రీమాణిక్య ప్రభువులవారి సమాధిని దర్శించుకున్నాము. తుల్జాపూర్ లోని దేవి భవానీమాతను కూడా దర్శించుకున్నాము. అన్నీ అయిన తరువాత షిరిడీ చేరుకున్నాము.
(మాణిక్యప్రభు టెంపుల్)
(తుల్జాపూర్)
(భవానీ మాత)
మేమంతా
సమాధిమందిరానికి వెళ్ళి బాబాను ప్రార్ధించుకున్నాము. శ్రీమహల్సాపతిగారి పూజా మందిరం నుండి, బాబాగారు
ధరించిన పాదుకలను, కఫనీని తీసుకున్నాము.
ఆయన
మనుమడు (శ్రీమార్తాండ మహరాజ్ గారి కుమారుడు) శ్రీ అశోక్ మహల్సాపతి మాతో కూడా వచ్చాడు. తిరుగు ప్రయాణంలో మేము దత్తాత్రేయులవారి కల్లూర్
దత్తఘడ్ దేవాలయాన్ని, శ్రీసాయిబాబా మందిరాలను దర్శించుకున్నాము. అక్కడ భక్తులందరూ దత్తజయంతిని చాలా వైభవంగా జరుపుకొన్నారు. పరదసింగ నుంచి అవధూత అనసూయమాత కూడా ప్రతిసంవత్సరం
దత్త జయంతినాడు వస్తూ ఉంటారు.
త్రిమూర్తిస్వరూపానికి
గుర్తుగా ఒక పెద్దరాయి మూడు భాగాలుగా విడిపోయి ఉంది. అక్కడొక చిన్న గుహ ఉంది. భక్తులు ఆగుహలో ధునిని నిర్మించడానికి ముందే అక్కడ
‘హోమగుండం’ ఉన్నదనడానికి గుర్తులు కనిపించాయు. అక్కడ ఒక యోగి తపస్సు చేసుకొని సిధ్ధి పొందారని
చెబుతారు. అక్కడ ఎవరయితే ధ్యానం చేస్తారో వారికి
సాయి దర్శనం లభిస్తుందనే నమ్మకం ఉంది.
సూర్యాస్తమయానికి
మేము దత్తఘడ్ చేరుకొన్నాము. షిర్దీ నుండి తీసుకువచ్చిన
బాబా పాదుకలను, ఆయన కఫనీని పల్లకీలో ఊరేగిస్తూ గుడికి తీసుకునివెళ్ళాము. భక్తులందరూ గుంపులు గుంపులుగా వచ్చి బాబా పాదుకలను,
కఫనీని దర్శించుకున్నారు.
గుహలోని
ధునివద్ద నాభర్త ధ్యానం చేసుకునే సమయంలో కరెంటు కోత ఉంది. కొంతసేపటి తరువాత ఆయన గుహనుండి బయటకు వచ్చారు. గుహలోని గోడమీద బాబా కనిపించారని చెప్పారు. ఇంతకు పూర్వం వెళ్ళిన కొంతమంది భక్తులు, తమకు కూడా
బాబాచిత్రం కనిపించిందని చెపారు. బాబా చూపిస్తున్న
లీలలకు ఆశ్చర్యపోయాము. అదే రోజు రాత్రి హైదరాబాదుకు
మరలా ప్రయాణమయ్యాము.
శ్రీ
శంకరయ్యగారి ఆధ్యర్యంలో దత్తజయంతినాడు ‘సప్తసప్తాహ’ కార్యక్రమం మొదలయింది. కార్యక్రమమంతా చాలా బాగా జరిగింది. నామజపానికి వేలాదిమంది భక్తులు వచ్చారు. మేము కూడా ఆ నామసప్తాహంలో పాల్గొన్నాము. ఒక నెలరోజులపాటు అక్కడే ఉన్నాము. ఆ నెల రోజులలోను మాకు ఇంటికి తిరిగి వెళ్ళాలనిపించలేదు. సాయిభక్తులందరూ మా దగ్గరి బంధువులన్నంతగా భావన కలిగింది.
నామ
సంకీర్తన జరుగుతూ ఉండగానే ఒకరోజు సూర్యోదయానికి పూర్వమే నా భర్త పెద్దసైజు శ్రీసాయిబాబా
ద్వారకామాయి ఫోటో ముందు కూర్చుని ధ్యానంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. సరిగా మధ్యాహ్నం 12 గంటలకు కళ్ళు తెరిచారు. అది బాబాకు ఆరతి ఇచ్చే సమయం. బాబా తనముందు కూర్చున్నారని. తమ హస్తాన్ని తనతలపై
ఉంచడం వల్లనే తను కళ్ళు తెరవలేకపోయానని నాభర్త చెప్పారు. నాభర్త తలంతా మంచి సువాసనతో నిండిపోయింది. సాధారణంగా నాభర్త ఇంటిలో ధ్యానం చేసుకునేటప్పుడు
సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఆయనకు
బాబా దర్శనమిచ్చి దీవిస్తూ ఉంటారు. కాని ఇపుడు
బాబా సశరీరంగా దర్శనమిచ్చి నాభర్తను దీవించారు.
విజయవాడలో
జరుగుతున్న సప్తాహ కార్యక్రమంలో మూడు వారాలు పాల్గొన్న తరువాత కొన్ని అనుకోని కారణాల
వల్ల హైదరాబాద్ కి తిరిగిె వెళ్ళాల్సి వచ్చింది.
హైదరాబాదునుంచి మరలా విజయవాడ రావడానికి కాస్త బధ్ధకించాను. విజయవాడకి నాభర్త ఒక్కరినే వెళ్ళమని చెప్పాను. నాభర్త పదేపదే రమ్మని అడిగినా ఏమీ నిర్ణయించుకోలేకపోయాను. ఏసమాధానం చెప్పకుండా మవునంగా ఉండిపోయాను. ఆ రోజు రాత్రి బాబా నాకు కలలో కనిపించి “సప్తాహం
చివరి మూడు రోజులలో గొప్పగొప్ప సాధువులు వస్తారు.
నువ్వుకూడా వెళ్ళు. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకు. తప్పకూడా వెళ్ళు” అని ఆజ్ఞాపించారు. బాబా ఆజ్ఞ ప్రకారం నేను కూడా నాభర్తతో విజయవాడ వెళ్ళాను.
విజయవాడలో
మాచెల్లిలి కొడుకు చి.చంద్రమోహన్ ఇంటిలో దిగాము.
ఒకరోజు తెల్లవారుఝామున మూడు గంటలకి బాబా నాభర్తకి కలలో కనిపించి “తొందరగా లే వెంటనే మందిరానికి వెళ్ళి అక్కడ ధ్యానం చెయ్యి.” అని
ఆజ్ఞాపించారు. బాబా ఆదేశానుసారం నాభర్త స్నానం
చేసి గుడికి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నారు.
ఆరోజు మధ్యాహ్న ఆరతి కూడా అయిపోయింది.
నాభర్త ఇంకా ధ్యానంలోనే ఉన్నారు. కళ్ళుకూడా
తెరవలేదు. ఆయనని ధ్యానంనుండి లేపడానికి ప్రయత్నించాము. కాని ఫలితం లేకపోయింది. ఆయన తలనుంచి విభూతి సువాసన వస్తోంది. ఆ తరువాత ఆయన ధ్యానంనుండి లేచారు. తనకు ధ్యానంలో శ్రీదత్తాత్రేయులవారు, జీసస్ క్రైస్ట్,
శ్రీరామకృష్ణపరమహంస, వీరందరూ దర్శనమిచ్చారని చెప్పారు. సప్తసప్తాహం ఆఖరి రోజు రెండు రోజులముందు మేము ఉంటున్న
మాచెల్లెలి కొడుకు ఇంటికి ఒక సాయి భక్తుడు వచ్చాడు. అతను బాబా మీద పాటలు రచించి స్వరాలు కూర్చి పాడుతూ
ఉంటాడు. మేము అడిగినమీదట అతను పాటలు పాడాడు. మేము వాటిని రికార్డు చేసాము. ప్రతిపాట పూర్తయిన వెంటనే అతడు “ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి” అని నామం జపించేవాడు. అతను తను
అనుభవిస్తున్న దీన స్థితిని, అనుభవిస్తున్న కష్టాలను వివరించి చెప్పాడు.
తనకున్న సమస్యల కారణంగా సాయిని నిందిస్తూ ఒక పాటను కూడా రచించానని చెప్పాడు. మాముందు ఆ పాటను కూడా పాడాడు. అతడు పాడినపాటలన్నీటేప్ రికార్డర్ లో రికార్డు చేసిన తరువాత టేపు రివైండ్ చేసాము. అన్ని పాటలు రికార్డయాయి. విచిత్రమేమంటే అతను బాబాను నిందిస్తూ పాడినపాట మాత్రం
రికార్డవలేదు. ఇంకా విచిత్రమేమంటే రెండు పాటల
మధ్య టేపులో కాస్త ఖాళీ (టేప్ బ్లాంక్ గా) ఉండాలి ఎందుకంటే పాటకు ముందు పరిచయ వాక్యాలు
చెప్పిన తరువాతనే పాటలు పాడాడు. పాటకు ముందు పరిచయ వాక్యాల తరువాత పాటలు రికార్డు చెయ్యబడ్డాయి. కాని అతను బాబాను నిందిస్తూ పాడిన పాట రికార్డు
అవకుండా టేపులో రెండుపాటల మధ్యా ఖాళీ (గాప్) లేకుండా తరువాతి పాట రికార్డయింది. ఒక పాట పూర్తయిన తరువాత, బాబాను నిందిస్తూ పాడినపాట
గాక వరుసక్రమమంలో తరువాత పాడిన పాట రికార్డయింది.
సాయి లీలకు మేమంతా ఆశ్చర్యపడ్దాము.
సప్తాహం
చివరిరోజున నాభర్త చాలా బలహీనంగా ఉండటం వల్ల ఆయన జిప్ బ్యాగ్ నావద్దనే ఉంచుకున్నాను. సాయిబాబా వేషధారణలో ఒక ఫకీరు మందిరానికి వచ్చాడు. అతను కాస్త భారీ పర్సనాలిటీతో ఉన్నాడు. భక్తులంతా ఆయన చుట్టూ గుమిగూడారు. నేను నాదగ్గర ఉన్న జిప్ బ్యాగును నాభర్తకు ఇచ్చి,
ఆఫకీరుకు నమస్కారం చేసుకుందామని వెళ్ళాను.
కొంతసేపటి తరువాత తిరిగివచ్చాను. కాని
అక్కడ భక్తులంతా గుంపులు గుంపులుగా ఉండటంతో నాభర్త ఎక్కడ ఉన్నారో కన్పించలేదు. కాస్త విశ్రాంతి తీసుకుందామని మాచెల్లెలి కొడుకు
ఇంటికి వెళ్ళిపోయాను.
సాయంత్రం
నాభర్త తన జిప్ బ్యాగ్ గురించి అడిగారు. నేను
మీకు ఉదయాన్నే ఇచ్చేసాను కదా అన్నాను. ఆయనకి
నేను బ్యాగ్ ఇచ్చినట్లుగా అసలేమీ గుర్తుకు రాలేదు. నేనే పొరబాటున ఎక్కడో పెట్టాసాననుకున్నారు. ఆ బ్యాగ్ లో డబ్బేమీ లేదు కాని బాబా పుస్తకంఒకటి,
ఇంకా సాయిప్రభ పత్రికకి చందాలు కట్టినవారి వివరాలతో ఉన్న రసీదు పుస్తకం ఉన్నాయి. సప్తాహానికి వచ్చిన భక్తులు చాలా మంది సాయిప్రభకు
చందాలు కట్టారు. వాళ్ళ చిరునామాలన్నీ ఆ రశీదు
పుస్తకంలోనే ఉన్నాయి. ఇపుడా వివరాలేమీ లేకపోతే
వాళ్ళకి పుస్తకాలు పంపించడం సాధ్యం కాదు. పాపం వాళ్ళందరూ పత్రిక కోసం ఎంతో ఎదురుచూస్తూ
ఉంటారు. వాళ్ళకి సాయిప్రభ పత్రికలు అందకపోతే
మాగురించి ఏమనుకుంటారోనని చాలా కలత చెందాము.
సాయంత్రం మేము బాబా మందిరానికి వెళ్ళి బ్యాగ్ గురించి ఆరా తీసాము. కాని సంతృప్తికరమైన సమాధానాలు రాలేదు.
మందిరంలో
బాబా విగ్రహం వద్ద కూర్చుని, గోడకు తగిలించి ఉన్న బాబా ఫొటోవైపే చూస్తూ ప్రార్ధించాను. “బాబా, బ్యాగ్ పోగొట్టినందుకు నేను చివాట్లు తినడమేకాదు,
బ్యాగ్ పోయినందుకు నాభర్త చాలా వ్యాకులత పడుతూ ఉన్నారు. మామీద దయ చూపించండి బాబా. కనీసం సాయిప్రభ పత్రికకు
చందాలు కట్టిన భక్తులకోసమయినా ఆబ్యాగ్ దొరికేటట్లు చెయ్యి బాబా” అని ఆర్తితో వేడుకొన్నాను. ఆరోజు సప్తాహం చివరిరోజు. అందుచేత రాత్రంతా నామ సంకీర్తనలోనే గడుపుదామనుకున్నాము. ఆరోజు రాత్రి పది గంటలకు శంకరయ్యగారు వచ్చి మాకు
మాబ్యాగ్ ను అందచేస్తూ ఇలా అన్నారు “ ఎవరో వచ్చి నాకు ఈబ్యాగ్ ను ఇచ్చి దీనికి సంబంధించినవారికి
అందచేయమని చెప్పారు. కాని ఈబ్యాగ్ ఎవరిదో నాకు
తెలీదు” అన్నారు. నేను బ్యాగ్ తీసుకుని ఇది
మావారిదే అని చెప్పాను. బ్యాగ్ తెరచి చూసాను.
ఏమీ పోలేదు. అన్నీ సరిగానేఉన్నాయి. బ్యాగ్ ను తిరిగి ఇప్పించినందుకు బాబాకు కృతజ్ఞతలు
తెలుపుకుంటూ సాయినాధునికి సాష్టాంగపడి నమస్కారాలు తెలియచేసుకున్నాము.
చివరిరోజులలో
నామసప్తాహానికి నేను కనక రాకపోయి ఉంటే బాబా చూపించిన ఈ అధ్భుత లీలలను చూసే భాగ్యం కోల్పోయి
ఉండేదానిని. ఇంటిపనుల వల్ల నేను రాకూడదనుకున్నా బాబా నన్ను నామసప్తాహానికి రప్పించారు.
49
రోజులపాటు సాయినామం మామనస్సులకు ప్రశాంతతను కల్గించింది. మాహృదయాలలో ఎంతో భక్తిని కలిగించింది. సప్తాహానికి అదే ఆఖరి రోజనేటప్పటికి నాకళ్ళు నీటితో
నిండిపోయాయి. ‘సాయినామ’ సంకీర్తనలోని మధురామృతాన్ని
మరలా ఎప్పుడు రుచి చూస్తామా అని నామనస్సు తహతహలాడింది. ‘సాయినామ’ సంకీర్తన శ్రవణానికి మేము అలవాటు పడిపోయాము. సప్తాహ కార్యక్రమం అయిపోయిన చాలా రోజులవరకు మా చెవులలో
సాయినామం మార్మోగుతూనే ఉంది.
పోలీస్
డిపార్ట్ మెంటులో నాభర్త ఏడిషనల్ సూపరెంటెండెంట్ గా పొందలేని తృప్తి ఆనందం, బాబా భక్తునిగా
బ్రహాండమయిన తృప్తిని ఆనందాన్ని పొందుతున్నారు.
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment