07.09.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
సాయిభక్తులు - అబ్దుల్ - 2 వ.భాగమ్
ఒకరోజు రాత్రి నాకు బాగా
అలసటగా ఉండి నిద్ర ముంచుకు రావడంతో నా అఱచేతులను దోసిలిలా పెట్టుకుని నిద్రకు జోగుతున్న
నా ముఖం పెట్టుకొన్నాను. నా పరిస్థితిని చూసిన
బాబా “చంద్రుణ్ణి చూడటానికి ప్రయత్నిస్తున్నావా”? అని ప్రశ్నించారు.
ఆరోజు రాత్రి బాగా నిద్రమత్తులో బాబా మీద పడి నిద్రాస్థితిలోనే
ఆయన మీద ఒరిగిపోయాను. బాబా నాపాదాల మీద మెల్లగా
తట్టడంతో నిద్రనించి మేల్కొన్నాను. మరుసటి
రోజు ఒక విచిత్రం జరిగింది. నేను నా దోసిలిలోకి
నీళ్ళు తీసుకున్నాను. ఆ నీటిలో పూర్ణ చంద్రుడు
కనిపించాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం రెండు
గంటలయింది. ఈ దృశ్యం గురించే బాబా చెప్పారు.
నేను లెండీ ప్రదేశాన్ని,
బాబా వెలిగించిన అఖండ దీపాన్నీ సంరక్షిస్తూ ఉండేవాడిని. ఆరోజుల్లో ఆదీపం నేలలో రెండు అడుగుల తోతుకు త్రవ్వబడిన
గుంటలో ఉండేది. ఆ దీపం ఆరిపోకుండా దానిపైన
రక్షణగా పందిరి ఉండేది. ఆ పందిరిపైన రేకులు,
చుట్టూ 20 తెరలు కట్టబడి ఒక గుడారంలా కనిపించేది.
నేను ఆ గుడారంలోనే ఉంటూ మధ్యలో ఉన్న ఆదీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాడిని. ఇపుడా దీపాన్ని కొద్దిగా జరిపి, ఇటుకలు సున్నంతో
కట్టబడిన దిమ్మెలో అమర్చిన చిన్న గూడులోకి మార్చారు. బాబా లెండీకి వచ్చినపుడు దీపానికి దగ్గరగా కూర్చునేవారు. నేను రెండు బకెట్లతో నీటిని తీసుకుని వచ్చి బాబా
దగ్గరగా పెట్టేవాడిని. బాబా ఆనీటిని దీపం చుట్టూ
చల్లేవారు. ఆ తరువాత బాబా లెండీనుంచి లేచి
బయటకు వచ్చి అన్ని దిక్కులకు కొద్ది గజాలు నడిచి వెళ్ళి ఆ దిక్కువైపు తదేకంగా చూస్తూ ఉండేవారు.
నేను సాయికి చేసే సేవ
ఆయనకు మాత్రమే కాక అందరికీ చేస్తున్నట్లుగ భావించేవాడిని. షిరిడీ పొలిమేరలలో ఉన్న కాలువలో బాబా బట్టలను ఉతికేవాడిని. మసీదు, చావడి వాటి పరిసర ప్రాంతాలను బాగా తుడిచి
శుభ్రం చేసెవాడిని. అక్కడ దీపాలను వెలిగించి,
లెండీలో ఉన్న అఖండ దీపంలో నూనె పోసేవాడిని.
వీధులను శుభ్రం చేయడమే కాదు, రాత్రివేళ విడవబడ్డ మలాన్ని కూదా ఎత్తి పారేసేవాడిని. బాబా నన్ను ‘హలాల్ కుర్’ అని ‘మై మిరియాంబ్’ (నాపాకీవాడా)
అని పిలిచేవారు. బావినుండి నీటిని తోడి తెచ్చి,
చిల్లర మల్లర పనులు చేసేవాడిని. ఆయీ షిరిడీలో
నివసించే మొట్టమొదటి రోజులలో ఆమె వీధులను చిమ్మి శుభ్రం చేసేది. నేను ఆపనిలో ఆమెకు సహాయపడుతూ ఉండేవాడిని.
బాబా నాకు అవసరమైన ఆహారాన్ని
అందించి నా యోగక్షేమాలను బాబాయే చూసుకొనేవారు, చూస్తున్నారు.
1927 ప్రాంతంలో అనగా
రాధాకృష్ణ ఆయి చనిపోయిన తరువాత, బాబా మహాసమాధి అనంతరం నేను ఆమె నివసించిన ‘శాల’లో ఒకరోజు
ఖురాన్ లోని శ్లోకాలను మననం చేసుకుంటూ ఉన్నాను.
హటాత్తుగా శిధిలావస్థలో ఉన్న శాల యొక్క మూడు మట్టిగోడలు కూలిపోయాయి. నేను ఆ శిధిలాలలో నడుము వరకు కూరుకునిపోయాను. కాని నాకు ఎటువంటి దెబ్బలు తగలకుండా బాబా కాపాడారు. బాబా నన్ను ఆశీర్వదించి తన వద్దనే ఉంచుకున్నారు. మొదట నా గురువయిన అమీరుద్దీన్ బాబాను సేవించుకోమని
నన్ను ఆదేశించారు. నేను ఆయన చెప్పినట్లే చేశాను. ఒకసారి ఆయన షిరిడీ వచ్చి తనతో వచ్చేయమని చెప్పారు. బాబా ఆదేశమిస్తే వస్తానని చెప్పాను. కాని బాబా ఆదేశం ఇవ్వనందువల్ల నేను షిరిడీలోనే బాబా
వద్దనే ఉండిపోయాను. అందువల్ల నా మొదటి గురువయిన
అమీరుద్దీన్ షిరిడీనుండి వెళ్ళిపోయారు.
బాబా నన్ను ఆశీర్వదించే
పధ్ధతి చాలా విచిత్రంగా ఉండేది. ఒక్కొక్కసారి
వారి ఆశీర్వాదం తిట్లు, దెబ్బల రూపాలలో ఉండేది.
చాలా సార్లు నన్ను, జోగ్ ను కొట్టేవారు.
ఆయన నాతో ***
“తేరేకు దరియాకు పార్
ఉతార్ దియా”,
“తేరా మట్టి సోనా బనాదియా”
“క్యా బడీ మాడీ భాంధీయా”
అనేవారు.
(*** 1. నీవు భవసాగరాన్ని
దాటడానికి తోడ్పడ్డాను. 2. నీ మట్టిని బంగారంగా మార్చాను. 3. ఎంత పెద్ద భవనాన్ని కట్టి
ఇచ్చాను. మొదటిరెండూ నా ఆధ్యాత్మిక ప్రగతి
గురించి బాబా చెప్పివుండవచ్చు. మూడవది నా భవిష్యత్తును
సూచిస్తూ చెప్పినది అయి ఉండవచ్చు. బాబా సమాధి
చెందిన తర్వాత నేను సమాధి పూజ నిర్వహిస్తూ 8, 9 సంవత్సరాలు బూటీవాడాలోని గదిలో నివసించేవాడిని.)
బాబా ఉదయాన్నే చావడిలో
నా ముందు కూర్చొని పైవిధంగా నన్ను ఆశీర్వదించి
మసీదుకు బయలుదేరేవారు. బాబా నిరంతరం అవతారాల
గురించి ఎన్నో విషయాలను చెబుతూ ఉండేవారు. వారు
చెప్పిన విషయాలన్నిటినీ ఈ పుస్తకంలో వ్రాసాను.
(అబ్దుల్ ఒక పాత పుస్తకాన్ని
తీసి చూపించాడు. అందులో కొన్ని భాగాలు దేవనాగరిలో,
కొన్ని మోడీలో మరికొన్ని ఉర్దూలో ఉన్నాయి.
ఇవి ఎవరు వ్రాసారో చెప్పేందుకు అతను ఇష్టపడలేదు. తోటి భక్తుల అభిప్రాయం ప్రకారం ఇవన్నీ వ్రాయడానికి
కావలసిన పరిజ్ఞానం అబ్దుల్ కు లేదని తెలిసింది.
కానీ ఈ రచయిత (బి.వి.నరసింహస్వామి)
ప్రార్ధన మేరకు పుస్తకంలో వ్రాసి ఉన్న ప్రవచనాలను అబ్దుల్ చదివి వినిపించాడు).
బాబా అవతారాల గురించి
చెప్పినది క్రింది విధంగా వ్రాయబడి ఉంది :
బాబా మొదట చెప్పింది. ఓమాక్ర్, ఓంకార్ సే భవాకార్, భవాకార్ సే ఆద్, ఆద్
సే అలేక్, అలేక్ సే నిరంజన్, నిరంజన్ సే నిరాకార్, నిరాకార్ సే నీళ్, నీళ్ సే అనీళ్,
అనీళ్ సున్నే.
కేశవ్, అమ్రూ, ఉత్తర్,
పూర్వ్, పిర్ రక్ష్, పిర్ మత్స్యావతార్, మనాయత్, అస్మిత్ర్ జమ్రిద్, భగ్ రిధ్, (భగీరధ్?),
ఉచ్చాయత్ దేఖాయత్, భలింతర్, తిర్ మక్ర్, (త్రయంబకా?) కఛావతార్, ఖలీపత్, గోత్రం, విష్ణు,
హరితక్, బబ్రసేర్,
నరసింహావతార్, సేజ్ వార్
రేవక్, బన్దోపస్త్, బైల్ చంద్, కాసిప్ (కాశ్యప్), వామనావతార్.
షాన్, జాన్, మ్యాన్,
నూర్, తేజ్, కమల్, కాదరమ్, అద్ భుద్, గస్తత్వా, కబూబై, హరిపర్వా, అనార్ధ్, జయవ్, అవి,
ఆతస్తధర్మ్, మాంధాతా, విశ్రణ్, జమదగ్ని, పరశురామావతార్, రాజాజీ జాతీ, కవాదిక్, రాజా
దశరత్, రామ్ చంద్రజీ అవతార్, అంకుశ్, ఆజ్ఞాపురూష్, హిర్ పాల్, భజాల్, పిత్రూ (పుధు),
ఇదురత్ (యదు?), సుర్ సేన్, వాసుదేవ్, శ్రీకృష్ణాజీ అవతార్, ప్రతిమదన్, ప్రధ్యుమ్న్, అనురూదస్ (అనిరూధ్ధ్), ఇసితహర్ బధ్ధా (బుధ్ధా?), జలీ అవతార్ (కలీ).
బ్రాహ్మణ్ హువా, రాజపుత్
హువా, గౌలీహువా, బాద్ ముసల్మాన్ హువా, చతురూయుగ్మే చార్ అవతార్, (నిఖాల్ = కృతయుగ?),
తీర్ధామే తీన్ అవతార్ (=త్రేతాయుగ), ద్వాపర్ మే దోణ్, అధర్వణ్ మే ఏక్ అవతార్.
.
మస్య్, కచ్చ్, వరాహ్,
నార్ సింహ్, వామన్, పరశురామ్, కృష్ణాజీ బోధ్దో భీ కల్కీ.
యానే ఇబ్రహిం చార్ వేద్
కియే ఎటేరావూకు వాస్తే కలమ్ షరీఫ్ ఉతారా హై
ఖుదాకీ ఖుద్ రత్ ఖుదా
హీ జానే హర్ వేద్ మే హజారో అవతార్ నికాలే
మగర్ హర్ జమానేకీ ఇవాదత్
జుదా జుదా హై యుబీహై హిందుస్థాన్ గాడీపర్
ఆట్ బాద్ షాహా బాద్ షాహీ
కరేగా ఏ కబర్ అటారా పురాణ్ మే హై
(ఇంకా చాలా ఉన్నప్పటికీ
అబ్దుల్ చాలా నెమ్మదిగా చదవడంతో అదంతా చదవడానికి సమయం లేకపోయింది).
(అబ్దుల్ బాబా సమాధి దర్గా)
(సమాప్తం)
(సర్వం శ్రీసాయినాధార్పనమస్తు)
0 comments:
Post a Comment