05.04.2019 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –18 వ.భాగమ్
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
బాబాతో సాన్నిహిత్యమ్ - డైరీ లో ప్రచురించిన
సాయి భక్తుల అనుభవాలు - 7
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్ ఫోన్ : 9440375411
8143626744
సాయి బంధువులందరికీ బాబా వారి ఉగాది
శుభాకాంక్షలు
సంతోషకరమయిన వార్త ఏమిటంటే ఒక సాయి భక్తురాలు ఇందులో అనగా శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ లో
ప్రచురించినవి వాట్స్ ఆప్ లో పోస్టు చేయవచ్చా అని అడిగారు. నేను లోరెన్ వాల్ష్ గారికి మైల్ ఇచ్చి
అడుగుతానని చెప్పి ఆమెకు మైల్ ఇచ్చాను.
ఆవిడ బాబాని అడిగి చెపుతానని చెప్పారు. బాబా వారు కూడా తమ అనుమతిని
ప్రసాదించారని ఆవిడ నాకు మైల్ ద్వారా సమాధానమిచ్చారు.
ఇందులో ప్రచురించినవి saayileelas.com
Wats App లో కూడా ప్రచురింపబడుతున్నాయి.
బాబాకు మనమందరం ధన్యవాదాలు తెలుపుకొందాము.
ఇప్పుడు మరొక అధ్బుతమయిన బాబా చూపిన లీల
గురించి మనమందరం తెలుసుకుందాము.
బాబా తన బిడ్దలను ఆకలితో ఉంచగలరా?
రవీంద్ర మాధుడి…బెంగళూరు
వారు చెపుతున్న అనుభవాన్ని చదవండి.
రెండు సంవత్సరాల క్రితం నేను షిరిడీ
వెళ్లాను మధ్యాహ్న ఆరతి చూసిన తరువాత తిరిగి వస్తుండగా బయట ఎవరో బాబాకు నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాన్ని పంచుతుండటం కనిపించింది. నాకు కూడా వారు పంచుతున్న
ప్రసాదాన్ని తీసుకోవాలనిపించి, ఎంతో
ఆశగా వరుసలో నిలబడ్డాను.
అది నా అదృష్టమో లేక మరేదయినానో నాకు తెలియదు గాని, నా
వంతు వచ్చేసరికి వారు పంచుతున్న ప్రసాదం అయిపోయింది. నా దురదృష్టానికి నన్ను నేనే నిందించుకుంటూ ఇక చేసేదేమీ లేదని
చాలా బాధపడ్దాను. తిన్నగా నేను బసకు వెళ్లిపోయి నిరాశతో భోజనం కూడా చేయకుండా నిద్రపోయాను.
సాయంత్రం మెలకువ
వచ్చింది. నా నోటికి
రెండు ప్రక్కలా ఏదో అంటుకున్నట్లుగా అనిపించింది. ఏమిటోనని చేతితో తీసి చూసాను. నా నోటి దగ్గర అంటుకున్నది ఏదో
కాదు అన్నం, పప్పు మెతుకులు. అవి ఎండిపోయి ఉన్నాయి. అవి ఎలా అంటుకున్నాయా అని నాకు
చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా పరీక్షగా చూద్దామని అద్దంలో చూసుకున్నాను. నా నోటికి ఇరుప్రక్కలా ఎండిపోయిన
కిచిడీ తాలూకు మెతుకులు కనిపించాయి.
మందిరం నుంచి తిరిగి బసకు వచ్చిన తరువాత నేనేమీ తినలేదు. అది ఖచ్చితం. మరి అటువంటప్పుడు కిచిడీ
తిన్నట్లుగా ఈ మెతుకులు ఎలా వచ్చాయో నాకే అర్ధం కాలేదు. రూము సర్వీసువాళ్ళని అడిగితే
నేనేమీ భోజనం తెమ్మని చెప్పలేదని చెప్పారు వాళ్ళు. మెల్ల మెల్లగా గుర్తు
చేసుకుంటుంటే స్ఫురించింది. ఎవరో నేను పడుకున్న మంచం దగ్గరకు వచ్చి, మెల్లగా నా
తలమీద తట్టారు. ఆ
తరువాత నాకేదో తినిపించారు. అదంతా కలే కల తప్ప మరేమీ కాదు అనుకున్నాను. కలలో నా ప్రక్కన నుంచుని నా చేత తినిపించిన దయామయుడయిన ఆవ్యక్తి
సాయిబాబా తప్ప మరెవరూ కాదని అర్ధమయింది.
సాయిబాబాకు నేను పస్తుండటం ఇష్టంలేక నాచేత కిచిడీ
తినిపించారు.
మనం చూసేదానికి, చూడనిదానికి
మధ్య ఒక విధమయిన స్థితి ఉంటుంది. కొన్ని కొన్నిటిని మనం గ్రహించుకోలేము, వాటిని
వివరించలేము. అది
అనుభవించినవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది.
బాబా మనని ప్రేమించే మాతృమూర్తి, తండ్రి. ఆయన కాకులని గాని, కుక్కలను గాని ఎపుడూ ఆకలితో ఉంచేవారు కాదు. అటువంటప్పుడు
ఆయన తన పిల్లలు ఆకలితో ఉంటే చూస్తూ ఊరుకోగలరా?
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment