25.04.2024
గురువారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బందువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు
2023 సంచికనుండి గ్రహింపబడినది.
ఆంగ్ల
మూలం : డా.క్షితిజ రాణే
తెలుగు
అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.
9440375411, 8143626744
సాయి
అనుగ్రహం అపారమ్ – 7 వ.భాగమ్
కేడూ బాపూలో రేగుతున్న ఆలోచనలు పూర్తయే ముందుగానే భావూ మహరాజ్ అతనిని తన దగ్గరకు రమ్మన్నారు. కేడూ బాపు, భావు మహరాజ్ ముందుకు వచ్చి నిలబడగానే కేడూ బాపుతో “రేపటినుంచి నువ్వు నీ దుకాణానికి వెళ్ళి తిరిగి వ్యాపారం ప్రారంభించు. నీ ఆర్ధిక సమస్యలన్నీ తప్పకుండా తీరిపోతాయి” అన్నారు. తన సమస్య ఏమిటో చెప్పకుండానే తన మనసునే చదివేసి సమస్యను తెలుసుకున్న ఆయన శక్తికి ఆశ్చర్యపడ్డాడు.
భావు మహరాజ్ ఇచ్చిన సలహాను పాటించడంలోని కష్టం ఎటువంటిదో కేడు బాపు వివరంగా
చెప్పాడు. “భావు మహరాజ్, మీరిచ్చిన సలహా పాటించడం
నాకంత సులభం కాదు. ఎందుకంటే నేను దుకాణం దగ్గరకు
వెళ్లగానే నాకు అప్పు ఇచ్చినవాళ్ళందరూ నన్ను కొట్టడానికి వస్తారు. ఆ విషయం మీకు తెలియదు. అందుచేతే మీరిచ్చిన సలహా పాటించడమంటే చాలా విపత్కర
పరిస్థితిని ఎదుర్కోవడమే” అన్నాడు.
ఇది
వినగానే భావూ మహరాజ్, కేడూ బాపుతో “నీకు ఎవరయితే అప్పు ఇచ్చారో వారందరినీ రేపు రమ్మని
పిలు. నేను నీకున్న అప్పులన్నీ తీర్చేస్తాను. ఆ తరువాత నిన్ను నేను ఎప్పటికీ కలుసుకోను. నీకు నేను కావాలో, నీ అప్పులన్నీ తీర్చడం కావాలో
నువ్వే తేల్చుకో” అన్నారు. ఒక్క క్షణం కేడూ
బాపూ చాలా సందిగ్ధంలో పడ్డాడు. చాలా జాగ్రత్తగా
ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చి భావు మహరాజ్ పాదాల మీద పడి, “భావూ నాకు మీరే కావాలి”
అన్నాడు.
ఆమాట
వినగానే భావు మహరాజ్ ఎంతో ప్రేమతో “బాపూ, రేపటినుండి నువ్వు దుకాణానికి వెళ్ళి నీ వ్యాపారాన్ని
తిరిగి ప్రారంభించు. నీకు అప్పు ఇచ్చినవారు
ఎవరయినా నిన్ను కొట్టడానికి వస్తే వారికి నీవు కనిపించవు. ఆవిధంగా నువ్వు రక్షింపబడతావు. కొద్ది రోజులలోనే నీ అప్పులన్నీ తీరిపోతాయి. ఇక నీకు అప్పుల బాధ అనేదే ఉండదు” ఈ విధంగా అంటూ
భావూ మహరజ్ చేయెత్తి కేడూ బాపూని ఆశీర్వదించారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment