27.04.2024
శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బందువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు
2023 సంచికనుండి గ్రహింపబడినది.
ఆంగ్ల
మూలం : డా.క్షితిజ రాణే
తెలుగు
అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.
9440375411, 8143626744
సాయి
అనుగ్రహం అపారమ్ – 8 వ.భాగమ్
ఒక్క
క్షణం భావూ మహరాజ్ స్థానంలో బాపూకి శ్రీ సాయిబాబా వారి దర్శనమయింది. ఆ అధ్భుత దృశ్యాన్ని తిలకించి బాపూ మ్రాన్పడిపోయాడు. ఆ దివ్యదర్శనం తరువాత భావూ మహరాజ్ మీద నమ్మకం మరింత
పెరిగింది. ఆ తరువాత సంవత్సరం బాపూ యొక్క తొమ్మిది
లక్షల రూపాయల అప్పు తీరిపోవడమే కాక అతని వ్యాపారం బాగా అభివృధ్ధి చెందింది. భావూ మహరాజ్ అనుగ్రహానికి బాపూ ఎల్లప్పుడూ కృతజ్ణతతో
ఉండేవాడు.
రెండవ
దృష్టాంతం… శ్రీ జగదీష్ జాదవ్, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (విశ్రాంత అధికారి) వారిది. ఆయన 15 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్ (వాయుసేన) లోను
23 సంవత్సరాలు పోలీస్ ఫోర్స్ లోను పని చేశారు.
ఎంతో న్యాయబధ్ధంగా జాతికి సేవ చేసిన తరువాత అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్
(నవీ, బొంబాయి) గా పదవీ విరమణ చేసారు. ‘వటవృక్షచాయ
చాయేత్’ పేరుతో ఆయన తన ప్రియ సద్గురు శ్రీ భావు మహరాజ్ గారి జీవిత చరిత్ర వ్రాసారు. ఆయన శ్రీ బావూ మహరాజ్ కి మానస పుత్రుడు.
పన్వెల్,
వాసీ ప్రాంతాలలో ఆర్ధిక నేరాలు చాలా పెద్ద ఎత్తున జరిగాయని సమాచారాలు వచ్చాయి. మోసపోయినవారందరూ నిందితుని గురించి ఇచ్చిన వివరాలు
అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. నేరం జరిగిన ప్రాంతం
చుట్టు ప్రక్కల ఉన్నవారందరూ చెప్పిన సమాచారం ఆధారంగా శ్రీ జగదీష్ జాదవ్ నేరపరిశోధన
చేసారు. పాన్వెల్ లో ఒక లాడ్జిలో ఒక వ్యక్తిని
అరెస్టు చేసి అతని వద్దనుండి మూడు లక్షల రూపాయలు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీ జాదవ్ ఆవ్యక్తిని బాగా (పంచనామా) విచారించారు. ఆ అనుమానిత వ్యక్తి , స్వాధీనం చేసుకోబడిన డబ్బు గురించి
గాని, పత్రాల గురించి గాని సంతృప్తికరమయిన వివరాలు ఇవ్వలేకపోయాడు. అందుచేత జాదవ్ అతనిని అరెస్టు చేసి అతని వద్ద ఉన్న
డబ్బు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అతనిని
పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. ఇంకా మరింతగా
వివరాలు రాబట్టాలనే ఉద్దేశ్యంతో శ్రీ జాదవ్ అతనిని పోలీస్ కష్టడీలోనే ఉంచాలనుకున్నారు. కాని ఆయన పై అధికారులు ఆవిధంగా చేయడానికి శ్రీ జాదవ్
గారికి అనుమతి ఇవ్వలేదు.
జాదవ్
గారు ఆ అనుమానితుడిని వదిలిపెట్టదలుచుకోలేదు.
తనకు వచ్చిన క్రైమ్ రిపోర్టుల ఆధారంగా తను అరెస్టుచేసిన అనుమానితుడే నేరస్థుడని
జాదవ్ గారికి ఖచ్చితమయిన నమ్మకం. అందువల్లనే
అతని మీద కేసు పెట్టకుండా తను స్వాధీన చేసుకున్న డబ్బు, పత్రాలతో సహా అనుమానితుడిని
చాప్టర్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనిని
రెండు రోజులు జైలులో ఉంచి ఆ తరువాత బెయిల్ మీద విడుదల చేసింది.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment