06.10.2013 ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 89వ.శ్లోకం, తాత్పర్యం
శ్రీవిష్ణుసహస్రనామం
శ్లోకం : సహస్రార్చిః సప్తజిహ్వా సప్తైధాః సప్తవాహనః |
అమూర్తిరనఘో చింత్యో భయకృద్భయనాశనః ||
తాత్పర్యం: పరమాత్మను వేయి కిరణములు గలవానిగా, ఏడు నాలుకలు గలవానిగా, ఏడు సమిధలుగా, అమరియూ ఏడు వాహనములు గలవానిగా ధ్యానము చేయుము. ఆయనకు రూపము లేదు. మరియూ పాపమంటనివాడు. ఆయన మనస్సుకందడు. ఆయన పాపులకు భయమును కలిగించి, పుణ్యాత్ములకు భయమును పోగొట్టును.
శ్రీసాయితో మధురక్షణాలు - 22
శ్రీసాయిబాబా అనుగ్రహం
ప్రియమైన పాఠకులారా! పూజ్య శ్రీనరసిం హస్వామీజీ గారు ఆంగ్లంలో తను వ్రాసిన పుస్తకాల ద్వారా, వార్తా పత్రికలలో ప్రచురించిన కధనాలు, యింకా సమావేశాలలో ప్రసంగాలద్వారా, మరాఠీభాష తెలియని భక్తులందరికి శ్రీసాయిని పరిచయం చేశారు.
మనందరికీ కూడా బాబావారి అనుగ్రహం లభించుగాక. ఆంగ్లభాషలో శ్రీసాయి సత్ చరిత్ర వ్రాసిన శ్రీనగేష్ వి.గుణాజీగారు ఆంగ్లభాష తెలిసిన వారందరికీ ఆపుస్తకం ద్వారా ఎంతో సహాయం చేశారు. లేకపోతే మనకి శ్రీసాయిబాబా గురించి తెలిసేదే కాదు. ఆయనకు కూడా మనమందరం నమస్కారాలు తెలియచేద్దాము. ఆయనకూడా తమ అనుభవాన్ని సాయిసుధ (జూలై 1951) ఎడిటర్ గార్కి ఈ క్రింద వివరించిన విధంగా తెలియచేశారు.
మనందరికీ కూడా బాబావారి అనుగ్రహం లభించుగాక. ఆంగ్లభాషలో శ్రీసాయి సత్ చరిత్ర వ్రాసిన శ్రీనగేష్ వి.గుణాజీగారు ఆంగ్లభాష తెలిసిన వారందరికీ ఆపుస్తకం ద్వారా ఎంతో సహాయం చేశారు. లేకపోతే మనకి శ్రీసాయిబాబా గురించి తెలిసేదే కాదు. ఆయనకు కూడా మనమందరం నమస్కారాలు తెలియచేద్దాము. ఆయనకూడా తమ అనుభవాన్ని సాయిసుధ (జూలై 1951) ఎడిటర్ గార్కి ఈ క్రింద వివరించిన విధంగా తెలియచేశారు.
శ్రీసాయి సత్ చరిత్ర ఆంగ్లంలో చదివిన కొంత మంది నాస్నేహితులు, సాయిబాబాపై నేను పొందిన అనుభూతులేమిటని నన్నడిగారు. నేను చాలా ఉన్నాయని చెప్పాను. కాని, అవన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకున్నందువల్ల లాభమేమిటి? ఆంగ్ల భాషలో ఉన్న శ్రీసాయి సత్ చరిత్రలోనుండి ఒకదానిని ఉదాహరణగా తీసుకొందాము. నాకు ఆంగ్లభాషలో ప్రావీణ్యం లేదు. నేనసలు ఆపుస్తకం రాద్దామనుకోలేదు. కాని, సాయిబాబా నాచేత వ్రాయించారు.
ఇక యిటీవలే జరిగిన అనుభవానికొస్తే, ఏప్రిల్ నెల 1951వ.సం.గురువారం, 12వ.తారీకు ఉదయం 8 గంటలకు తలకవాడి కాంగ్రెస్ రోడ్డునుండి నాస్నేహితునితో కలసి వస్తున్నాను. అతని యిల్లు తలకవాడిలో తూర్పువైపున ఉంది. వెంకటేష్ విలాస్ టీ క్లబ్ ముందున్న రైలు గేటును దాటుకొని తన యింటికి వెళ్ళిపోయాడు. ఆరోజు గురువారం కాబట్టి హారతయిన తరువాత సాయిబాబాకు నైవేద్యం పెట్టడానికి కోవా కొనడానికి మిఠాయి దుకాణానికి తిన్నగా నడుచుకొంటూ వెళ్ళాను. కొన్ని అడుగులు వేసిన తరువాత నాకెదురుగా ఒక కారు నామీదకు రావడం గమనించాను. దానినుండి తప్పించుకోవడానికి నేను కుడివైపుకు వెళ్ళాను. కాని, కారు డ్రైవరు కూడా అదే దారిలో కుడివయిపుకు నాకెదురుగా వచ్చి నన్ను గుద్దడంతో క్రిందకు పడిపోయాను. కొద్ది క్షణాలు నాకు స్పృహతప్పింది. తరువాత మామూలుగా లేచి నిలబడ్డాను. రోడ్డుమీద వెడుతున్నవారందరూ నేను పోయాననే అనుకున్నారు. కాని, నేను లేచి నిలబడగానే చాలా ఆశ్చర్యపోయారు. నామీదుగా పోయేలా కారునెందుకు నడిపావని డ్రైవరునడిగాను. తనకారుకెదురుగా కొంతమంది ఉన్నారని వారిని తప్పించడంకోసం కారును కుడివయిపు పోనిచ్చానని చేప్పాడు. తరువాత నేను మిఠాయి దుకాణానికి వెళ్ళి కోవా కొని, యింటికి వెళ్ళి బాబాకు హారతినిచ్చి కోవా నైవేద్యం పెట్టాను. మంచం మీద పడుకొని సుఖంగా నిద్రపోయాను. మరునాడు డాక్టర్ వద్దకు వెళ్ళి పరీక్ష చేయించుకున్నాను. నాశరీరానికి ఎక్కడా దెబ్బలు తగలలేదని ఆరోగ్యంగా ఉన్నానని పూర్తిగా పరీక్షించి చెప్పాడు.
బాబా అనుగ్రహం వల్లనే నేనా ప్రమాదం నుండి తప్పించుకొన్నాను. నాకు ఎటువంటి గాయాలు తగలకుండా రక్షించి ఆరొగ్యంగా ఉంచారు.
ఎన్.వీ.గుణాజీ
సాయిసుధ
జూలై 1951
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment