Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, March 28, 2016

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 11వ.భాగమ్

Posted by tyagaraju on 9:09 AM
Image result for images of shirdi sai baba in flower garden
         Image result for images of rose garden chandigarh
        
28.03.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బానిసగారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.
Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 11వ.భాగమ్

15.04.2011

101.  మనస్సుకు ప్రశాంతత కావాలని కోరుకునేవారు ఏకాంతవాసములో భగవంతుని పూజలు చేస్తారు ఏకాంతవాసంలో ఎటువంటి పూజా విధానం చేయాలనేది ఆ భక్తుడే నిర్ణయించుకోవాలి.
                           Image result for images of performing puja by man in puja room in house



28.04.2011
                   Image result for images of lord siva ganga on head

102.  ఆకాశ గంగ పరమశివుని జటాజూటములో మొదటి మజిలీ చేసి ఆతరవాతే భూమిపై ప్రవహించిందిమన బాబా పరమశివుని అంశముఅందుచేత మేఘుడు ఆయన శిరస్సుపై బిందెతో నీరు పోసినా శిరస్సు మాత్రమే తడిసినదిశరీరము తడవలేదు
                                                          సాయిబానిస                                              Image result for images of megha and baba  
                                                     

21.05.2011

103.  హరిద్వారమునకు ముందు వుండే ద్వారమే గురుద్వారముఅందుచేతనే ముందుగా గురుద్వారములోని గురువు యొక్క ఆశీర్వచనాలు తీసుకుని ఆ తరువాతనే హరిద్వారములో ప్రవేశించాలి.  


08.06.2011

104.  నీవు అభిమానించే సినీనటుడిలోను, నీవు పెంచుతున్న నీ  పెంపుడు కుక్కలోను, నీవు పనిచేస్తున్న నీ కంప్యూటర్ లోను ఉన్నది సాయి శక్తే సాయిశక్తి గతంలోను ఉంది, వర్తమానంలోను ఉంది, భవిష్యత్తులోను ఉంటుంది.   

24.06.2011

105.  బాబాకు నేను మాత్రమే అంకిత భక్తుడిని అనుకునేకన్నా, బాబాకు అనేకమంది అంకిత భక్తులున్నారు వారిలో బాబా నన్ను చేర్చుకోవడం నా అదృష్టము అని నేను భావిస్తున్నాను
                                                               సాయిబానిస                                                        
16.07.2011 
                                           Image result for images of lord shiva linga
106.  శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగమా లేక రావణబ్రహ్మ ప్రతిష్టించిన శివలింగమా అనే ఆలోచన మాని మహాశివునిపై మనసు లగ్నం చేసి శివలింగాన్ని పూజించు.  

03.09.2011

107.  కాశీలో కాలభైరవరునికి పూజచేసి నైవేద్యము సమర్పించినా, యాదగిరి గుట్టలో నరసింహస్వామికి పూజచేసి నైవేద్యము సమర్పించినా అది నాకే చెందుతుంది

23.11.2011

108.  రైలు ఇంజను నడవడానికి శక్తి అవసరముభగవంతుని ప్రేమను పొందడానికి భక్తి అవసరము.

10.12.2011

109.   నీవు గోదానం చేయలేకున్నా కనీసం గోవుకు తినడానికి ఆకు కూరను దానం చేయి.  

18.12,2011

110.  ఆధ్యాత్మిక రంగంలో నీవు నీ స్వధర్మాన్ని పాటించుఅంతేగాని పర ధర్మాన్ని పాటించే విదేశీయులతో కలిసి జీవించినా అది నీకు తలనొప్పిని కలిగిస్తుందిఅందుచేత నీవు నీ స్వధర్మాన్ని పాటించేవారితోనే కలిసి ప్రయాణం చేయి

(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List