29.03.2017 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి భక్తులందరికి ఉగాది శుభాకాంక్షలు
శ్రీసాయి
లీలా తరంగిణి –7 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల
రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనుబదింపబడినది)
సాయి
లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల
తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి
నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్
ఖైల్ గేట్, దుబాయి
Email
: tyagaraju.a@gmail.com
బాబావారి
అనంతమైన ప్రేమ – కొన్ని సంఘటనలు
1986వ.సంవత్సరం,
డిసెంబరు 10 వ.తారీకున ఒక చిన్న పిల్లవాడు మాయింటికి వచ్చాడు. తిన్నగా నాభర్త దగ్గరకు వచ్చి “నాకు బాబాని చూడాలని
ఉంది. నేను మిమ్మల్ని డబ్బు ఏమీ అడగటల్లేదు.
బాబా ఎక్కడ ఉన్నారో చూపించండి చాలు” అని ఎంతో ఆత్రుతగా అడిగాడు.
నా భర్త ఆ పిల్లవానితో “ఆయనను చూపించడానికి నేనెవరిని?
నేను కూడా నీలాటివాడినే. బాబా తన ఇష్టప్రకారం
ఎప్పుడు ఎవరికి దర్శనం ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తారు.
నేను అడిగినంత మాత్రాన దర్శనం ఇవ్వరు” అని సమాధానమిచ్చారు. ఇంత చెప్పినా కూడా ఆ పిల్లవాడు ఊరుకోలేదు. అపుడు నాభర్త ఆ పిల్లవాడిని మా పూజా మందిరంలోకి
తీసుకునివెళ్ళి సాయిబాబాని నువ్వే ప్రార్ధించుకో అని చెప్పారు. ఆపిల్లవాడు బాబా దర్శనం కోసం తపిస్తూ బాబా బాబా
అని గట్టిగా ఏడుస్తూ ఉంటే నాకళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
ఆరోజు
రాత్రి నాభర్త ధ్యానం చేసుకుంటున్నారు. ధ్యానంలో
బాబా దర్శనమిచ్చి, “ఉదయం మీయింటికి వచ్చి ఏడ్చినది ఎవరో తెలుసా? అది నేనే” అని అన్నారు.
బాబా
దర్శనం కావాలంటే మేము చెప్పినట్లు చెయ్యి అని మేము అంటామేమో, మాలో అహంకారం ఉందేమోనని
పరీక్షించడానికే బాబా వచ్చారని భావించాము.
మాకు సాయిబాబాను ప్రార్ధించడం తప్ప మాకింకేమీ తెలియదు. మరి అటువంటప్పుడు బాబా మమ్మల్ని ఈవిధంగా ఎందుకని
పరీక్షించారని అనుకున్నాము. ఆ తర్వాత మేము
బాబా పెట్టిన ఈపరీక్ష గురించి శ్రీశివనేశన్ స్వామి గారిని అడిగాము. “ఎవరయినా సరే అటువంటి బాధను అనుభవించనంత వరకు బాబా
దర్శనం లభ్యం కాదు“ మీకు ఆవిషయం తెలియచెప్పేందుకే
మీకు ఆలీలను అనుభవించేలా చేశారు బాబా” అన్నారు.
ఆవిధంగా శ్రీశివనేశన్ స్వామీజీ గారు మాసందేహాన్ని తీర్చి మా అజ్ఞానాన్ని తొలగించారు.
హైదరాబాద్
లోని బి.హెచ్.ఇ.ఎల్. దగ్గర ఉన్న తల్లాపూర్ లో శ్రీసాయిబాబా మందిరం నిర్మించారు. ఆమందిర రిసెప్షన్ కమిటీకి నాభర్త కన్వీనర్ గా ఉన్నారు. మందిరానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆయనే స్వయంగా
దగ్గరుండి చూసుకోవాలి. శ్రీసాయిబాబా విగ్రహాన్ని
ప్రతిష్టించేముందు తొమ్మిదిరోజులపాటు మేము నామజపంలో పాల్గొన్నాము. ఒకరోజు రాత్రి బాబా నాభర్తకు కలలో దర్శనమిచ్చారు. ఆ కలలో
బాబా నాభర్త చేతిని పట్టుకుని మందిరం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ప్రదక్షిణ పూర్తయిన తరువాత నాభర్తని మందిర ప్రవేశద్వారం
దగ్గర వదిలేసి, బాబా గర్భగుడిలోకి నడచుకుంటూ వెళ్ళిపోయారు. విగ్రహ ప్రతిష్ఠాపన తరవాత బాబా విగ్రహం ఎంతో తేజస్సుతో
జీవకళ ఉట్టి పడుతూ కనిపించింది. బాబా విగ్రహంలోని
ఆతేజస్సు భక్తుల హృదయాలను దోచుకుంది.
శ్రీదత్త
అవతారమయిన శ్రీనృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు ప్రతిష్టింపబడ్డ గాణుగాపూర్ యొక్క
ప్రాముఖ్యత అందరికీ తెలుసు.
నా
భర్త భీమ – అర్జున నదుల సంగమంలో స్నానం చేసి ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో ఆయనకు శ్రీనృసింహ సరస్వతి స్వామివారు దర్శనమిచ్చారు.
ఆయన నా భర్తను పంచగంగ సంగమ క్షేత్రానికి తీసుకుని
వెళ్ళి అక్కడ స్నానం చేయించారు.
అక్కడ ఎంతోమంది
మహాపురుషులు తపస్సు చేసుకుంటూ కనిపించారు.
ఆతరువాత నా భర్తయొక్క గత జన్మలను చూపించారు.
నాభర్త తరువాత జన్మలో ఆకుపచ్చని దుస్తులను ధరించి ఒక ఫకీరులా ఉంటాడని అదే ఆయన
చివరి జన్మ అని చెప్పారు.
అమలాపురంలోని
శ్రీ రామజోగేశ్వరరావు గారు నాసోదరుడయిన శ్రీహరిగోపాల్ కి మంచి స్నేహితులు. ఆయన నాడీ శాస్త్రంలో మంచి దిట్ట. ఆయన నాభర్త నాడీశాస్త్రం చూసి నాభర్తకు ఇక ఒకటె
జన్మ ఉందని, రాబోయే జన్మలో ఒక బ్రాహ్మణవంశంలో జన్మిస్తారని చెప్పారు. తరువాతి జన్మలో నాభర్త బ్రహ్మచారిగా ఉండచ్చని, సన్యాసాన్ని
స్వీకరించి ఒక ఫకీరులాగా లేక సన్యాసిగా జీవిస్తారని చెప్పారు. బాబా దృష్టిలో ఫకీరయినా, సన్యాసయినా ఒక్కటె. వచ్చే జన్మలో తనెవరయినా గాని, తాను ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి
భగవంతుని తెలుసుకునే తన లక్ష్యం నెరవేరుతుందని సంతోషించారు.
రేపటి సంచికలో సాయి ఏకాదశ సూత్రాలు - ప్రాముఖ్యత
గురించి బాబా చూపించిన దివ్యమైన లీల
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment