28.03.2017 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
లీలా తరంగిణి – 6 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల
రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనుబదింపబడినది)
సాయి
లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల
తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి
నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్
ఖైల్ గేట్, దుబాయి
Email
: tyagaraju.a@gmail.com
సాయి
భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు
సాయిప్రభ
మాస పత్రిక - బాబా ఆదేశం
1985వ.
సంవత్సరంలో నా భర్తకు బాబా కలలో దర్శనమిచ్చారు.
సాయిబాబా బోధనలను, తత్వాన్ని ప్రచారం చేయడానికి ఒక పత్రికను ప్రారంభించమని ఆదేశించారు. అదేరోజు రాత్రి సాయిబాబా శ్రీ యూసఫ్ ఆలీఖాన్ గారికి
కూడా కలలో దర్శనమిచ్చారు. మాసపత్రికను ప్రారంభించడానికి
ఉమా మహేశ్వరరావు గారికి కావలసిన సహాయం అందించమని పత్రికకు ‘సాయిప్రభ’ అని నామకరణం చేయమని
చెప్పారు. పత్రికను గురుపూర్ణిమ రోజున విడుదల
చేయమని చెప్పారు.
నా
భర్తకి రచనా వ్యాసంగంలో బొత్తిగా అనుభవం లేదు.
పత్రిక నడపడానికి అవసరమయిన డబ్బు సమకూర్చడం కూడా సాధ్యమయే విషయం కాదు.
ఇటువంటి
సందేహాలు మనసులో మెదులుతూ ఉండగానే ఈ విషయం గురించి చర్చించడానికి సాయిబంధువులందరిని
సమావేశపరిచాము. చాలా మంది పత్రిక నడపడమంటే
సామాన్యమయిన విషయం కాదు, నిర్వహించడం చాలా
కష్టమని చెప్పారు. మొదట్లో నాభర్త కాస్త నిరుత్సాహం
చెందినా పత్రిక ప్రారంభించమని బాబాయే ఆదేశించారు కాబట్టి పని మొదలుపెట్టడానికే నిర్ణయించుకున్నారు. అన్ని విషయాలలోను బాబాయే ముందుకు నడిపిస్తారనే నమ్మకంతో
ఉన్నారు. శ్రీయూసఫ్ ఆలీఖాన్ గారి సహాయంతో
‘సాయి ప్రభ’ మాసపత్రికను ప్రారంభించడానికి ఉద్యుక్తులయ్యారు.
గురుపూర్ణిమ
రోజున ‘సాయిప్రభ’ మొదటి సంచిక విడుదలయింది.
శ్రీ జి.విఆర్.నాయుడు సాయి సమాజ్ మందిర్, సికిందరాబాదులో డా.దివాకర్ల వెంకటావధానిగారు
మొదటి సంచికను ఆవిష్కరించారు.
1985
వ.సంవత్సరం విజయదశమి రోజున ‘సాయిప్రభ’ ప్రత్యేక సంచిక విడుదలయింది. బాబా దయ వల్ల పత్రికకు మంచి ఆదరణ లభించింది.
ఏమయినప్పటికి
పత్రికను నిర్వహించడం నాభర్తకు చాలా భారమయింది.
అందువల్లనే బాబా శ్రీ వి.నారాయణరావు గారిని నా భర్తకు సహాయం చేయడానికి పంపించారని
భావించాను. అప్పటి వరకు ఇద్దరికి ఒకరికొకరు
పరిచయం లేదు. పత్రిక నడపడానికి ఆయన సహాయం చేశారు. నా భర్త ఎడిషనల్ సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పదవీ
విరమణ చేసారు. శ్రీ నారాయణరావు గారు పే అండ్
ఎక్కౌంట్స్ ఆఫీసులో డిప్యూటీ డైరెక్టర్. ఇద్దరికీ
పత్రికా నిర్వహణలో ఎటువంటి అనుభవం లేదు. కాని,
బాబా దయవల్ల పత్రిక ప్రచురణ ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతోంది. పత్రికను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఆధ్యాత్మిక పుస్తకాలను
రచిస్తూ తన శేషజీవితం సాయి సేవలో గడిచిపోతున్నందుకు తనెంతో అదృష్టవంతుడినని భావించారు
నాభర్త.
*******
'సాయిప్రభ’
మాసపత్రిక పాత సంచికలోని విషయాలను సాయిభక్తులకి కూడా తెలియచేయాలనిపించింది. అది బాబా ప్రేరణ గానే భావిస్తున్నాను.
ఈ
సందర్భంగా ‘సాయిప్రభ’ 1987 నవంబరు సంచికలో ప్రచురింపబడ్డ బాబా లీలను యధాతధంగా ఇస్తున్నాను. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
ప్రాణదాత
రామానంద్
క్వార్టర్, 82, గంగాలేన్ స్వర్గాశ్రమ్, ఋషీకేశ్ తెలుగు
సేత – వి. నా. రావు
ఈ
సంఘటన 1984 నవంబరులోనో, డిసెంబరులోనో జరిగింది.
ఒకనాటి రాత్రి భోజనం తర్వాత నా కడుపులో యేదో వికారం మొదలైంది. విపరీతమైన తలనొప్పి, పైత్యవికారము, కడుపులో త్రిప్పుట
చెప్పసాధ్యంగాదు. ఏమి కారణమో తెలియలేదు. రాత్రి బాగా కమ్ముకుంటుంది. నాపరిస్థితి త్వరత్వరగా క్షీణిస్తోంది. పడకమీదనుండి లేవలేకుండా ఉన్నాను. ఏదైనా మందు తీసుకుందామన్నా, ఎవరికైనా తెలుపుదామన్నా
లేవలేను. లేస్తే పడిపోతానేమో అనే భయం. ఒంటరిగా రూములో ఉన్న నా పరిస్థితి ఇది. పడకమీదనే పరుండి నాకు తెలిసిన దేవతలను నన్ను రక్షించమని
ప్రార్ధన చేయ మొదలెట్టాను. గాయత్రి, మహామృత్యుంజయ
మంత్రము జపించాను. కాని లాభం లేకపోయింది. నేను సాయిబాబా భక్తుడనే గాని, ఆక్షణం వరకు ఆయన జ్ఞాపకమెందుకు
రాలేదో తెలియదు. ఎమైతేనేం బాబా జ్ఞాపకం రాగానే
వారికి క్షమార్పణలు తెలుపుకుని నన్నీ మృత్యుముఖంనుండి
కాపాడమని హృదయపూర్వకంగా ప్రార్ధిస్తు దుఃఖించినాను. నా కళ్ళనే నేను నమ్మలేని సంఘటన? బాబా సశరీరంగా నామంచము ప్రక్కనే నుంచున్నారు. అంత బాధలో నేను వెక్కివెక్కి ఏడ్చాను కూడా. అలా బాధ పడుతున్న నాకు, యీ కళ్లతో బాబాను చూచే భాగ్యము
కలిగింది. వారి దివ్య హస్తమును నా తలపై ఉంచి,
“నీవు తిన్న ఆహారంలో విషం కలిసి ఉంది. అది
నీ రక్తంలో కలిసిపోయింది. నేనాశీర్వదిస్తున్నాను. నీకు బాగౌతుంది” అన్నారు. ఆ క్షణంనుండే నాలో బాధ తగ్గటం గమనించాను. బాబా యింకా ఇలా అన్నారు. “ రేపటినుండి ఒక వారం రోజులు
అయిదు బిల్వపత్రాలు తిను. బాగౌతావు”
అని బాబా
గాలిలో ఎలా కనిపించారో అలాగే అదృశ్యమయ్యారు
నాకళ్ళయెదుట. తలుపులు, కిటికీలు వేసివున్న
ఆ రూములో బాబా దర్శనం నిజంగా నాకు, మేఘునికి యిచ్చిన దర్శనాన్ని గుర్తుకు తెచ్చింది.
“నాకు ప్రవేశించటానికి ద్వారమే అక్కరలేదు.
తలుపులు, గోడలు నాకడ్డుగావు. సాయి!సాయి!
అని ఎవరు మనసారా పిలుస్తారో నేను వారి వెంటనే ఉంటాను” అన్న మాటలు నా చెవిలో ప్రతిధ్వనిస్తూంటాయి. వారు చెప్పిన ప్రకారం చేసి నేను ఆరోగ్యవంతుడనయ్యాను.
(రేపటి సంచికలో రావుగారికి బాబా కలిగించిన దివ్యానుభూతులు)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment