27.03.2017
సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి 5 వ.భాగమ్
రచనః
శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన :
తెలుగు.
ఆంగ్లంలోకి అనుబదింపబడినది)
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః
ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్ ఖైల్ గేట్,
దుబాయి
Email
: tyagaraju.a@gmail.com
సాయిబాబా
మాఇంటికి అరుదెంచుట
1985వ.ససంవత్సరంలో
గురుపూర్ణిమనాడు హైదరాబాద్ లోని మా ఇంటిలో శ్రీసాయినామ సంకీర్తనను ఏర్పాటు చేసాము. హాలంతా సాయిభక్తులతో నిండిపోయింది. సాయి అంకిత భక్తులయిన శ్రీ డి.శంకరయ్యగారి ఆధ్వర్యంలో
నామసంకీర్తన మూడుగంటలపాటు జరిగింది.
మేము
నామ జపం చేస్తున్నపుడు మా యింటికి వయసు మళ్ళిన ఒక అంధుడు వచ్చాడు. అతను తెల్లని పంచ, తెల్లని కఫనీ ధరించి తలకు తెల్లని
గుడ్డ చుట్టుకుని ఉన్నాడు. మాయింటి మేడమీదకి
వచ్చేందుకు మెట్లు ఉన్న గది మూలగా ఎక్కడో ఉంది.
ఎవరయినా క్రొత్తవారు వస్తే మేడమీదకు రావాలంటే మెట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం
చాలా కష్టం. అటువంటిది ఆ వచ్చిన వ్యక్తికి
రెండు కళ్ళూ కనపడవు. అంధుడు. మరి మెట్లు ఎక్కడ ఉన్నాయో ఎలా తెలుసుకున్నాడు? మేడమీదకి ఏవిధంగా వచ్చాడు? మాకెవరికీ అర్ధం కాలేదు. అతను ఒక మూలగా కూర్చున్నాడు. "మీరు ప్రతి ఆదివారం నామసంకీర్తన చేస్తారా"? అని అడిగాడు. అప్పుడప్పుడు ఈ విధంగా చేస్తామని చెప్పాము. "అయితే నాకు ముందరే ఎందుకు చెప్పలేదు" అని అన్నాడు. నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు అన్నాను. మీ చిరునామా ఇవ్వండి ఈ సారి నామజపం జరిగేటప్పుడు
మీకు కబురు చేస్తామని చెప్పాను. అతను సరైన
సమాధానం ఇవ్వకుండా మవునంగా కూర్చున్నాడు.
కొంతమంది
భక్తులు, బహుశ బాబా మారురూపంలో వచ్చి ఉండవచ్చనే నమ్మకంతో ఉన్నారు. అతను వెళ్ళేటప్పుడు అతనికి తినడానికి ఏదయిన ఇచ్చి
పంపించమని చెప్పారు. మా అబ్బాయి కృష్ణకిషోర్ కి ఈ వివరాలేమీ తెలీవు. మేడమెట్లు అన్నీ వచ్చిన భక్తుల పాదరక్షలతో నిండిపోయాయి. అందుచేత జాగ్రత్తగా మెట్లు దిగి వెళ్లడానికి మా
అబ్బాయి అతనికి సహాయం చేస్తానని చెప్పాడు.
కాని అతను మాత్రం డాక్టర్ గారి (డా.సుధాకర్
మహరాజ్) ఉపన్యాసం విన్న తరవాతే వెడతానని చెప్పాడు. ఇది జరగడానికి కొద్ది నిమిషాలముందు నాభర్త డా.సుధాకర్
మహరాజ్ గారిని బాబా గురించి కొన్ని మాటలు మాట్లాడమన్నారు. ఈ అంధునికి సుధాకర్ మహారాజ్
గారు డాక్టరని ఎలా తెలుసు? నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ అంధుడు మరికొంతసేపు ఉండి
డాక్టర్ గారి ఉపన్యాసం విని వెడతానని చెప్పడంతో మా అబ్బాయి తలుపుకి దగ్గరగా ఒకచోట కూర్చున్నాడు. మెట్లు దిగి బయటకు వెళ్ళాలంటే ఆ తలుపులు తీసుకునే
వెళ్ళాలి. నా భర్త ఆవృద్దుని ప్రక్కనే కూర్చుని
ఉన్నారు. డా.సుధాకర్ మహరాజ్ గారు భక్తి గురించి,
నిష్ట గురించి మాట్లాడారు. కొంతసేపటి తరువాత
ఆవ్యక్తి కూర్చున్న వైపు చూశాను. అతను అక్కడ
లేదు. ఆ వృధ్ధుడు మంచి బలంగా భారీ కాయంతో ఉన్నాడు. ఇంతలోనే ఎలా అదృశ్యమయ్యాడో అర్ధం కాలేదు. హాలంతా భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. అతను లేచి బయటకు వెడితే నా భర్తకు ఖచ్చితంగా తెలిసే
అవకాశం ఉంది మెట్లు దిగి వెళ్ళడానికి బయటకు
వెళ్ళాలంటే హాలు తలుపులు తీసుకుని వెళ్ళాలి.
తలుపులు కాస్త ఓరగా వేసి ఉన్నాయి. తలుపుల
వద్ద దారికి అడ్డంగా భక్తులు కూర్చుని ఉన్నారు.
ఆవ్యక్తి బయటకు వెడితే అక్కడ కూర్చున్నవాళ్ళకు తెలీకుండా, కనపడకుండా వెళ్ళే
అవకాశం లేదు. అతను వెళ్ళడం ఎవ్వరూ చూడలేదు. అతను ఎందుకు ఆవిధంగా అదృశ్యమయాడో మాకెవరికీ అర్ధం
కాలేదు. ఆలోచించగా తరవాత మాకర్ధమయింది. అంధుని రూపంలో నామజపం జరుగుతున్న మాయింటికి వచ్చినది
శ్రీసాయిబాబా.
మరలా
ఆగస్టు 10వ.తారీకు 1986 వ.సంవత్సరం హైదరాబాద్ లోని మాయింటిలో మరొక్కసారి సాయినామ సంకీర్తన
జరుపుకున్నాము. నామ సంకీర్తన సమయంలో శ్రీసాయిబాబా
వచ్చారనే అనుభూతి కొంతమంది భక్తులకి కలిగింది.
శ్రీసాయిబాబా నామ సంకీర్తనకు వచ్చిన వెంటనే ఒక భక్తునికి
కరెంటు షాక్ కొట్టినట్లుగా అనుభూతి కలిగింది.
ఇంకొక
భక్తుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో దత్తాత్రేయులవారి దర్శనం కలిగింది.
శ్రీసాయిబాబా
నాభర్త తలమీద తన పవిత్ర హస్తాన్నుంచి ఆశీర్వదించారు. దానికి సాక్ష్యంగా నా భర్త తలనుంచి మధురమయిన పరిమళం
వచ్చింది.
ఈ
అనుభవాలు, అనుభూతులు అన్నీ బాబా తన భక్తుల మీద కురిపిస్తున్న కరుణకి తార్కాణాలు.
సాయి
ప్రేమ
‘సాయి
ప్రేమ’ ఆధ్యాత్మిక మాసపత్రికకి శ్రీ టి.ఎ. రామ్ నాధన్ గారు ఎడిటర్. ఈ పత్రిక ద్వారా ఆయన సాయి తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ పత్రిక కలకత్తా నుండి ప్రచురింపబడుతోంది.
1987వ.
సంవత్సరంలో మాకు ఒక నెల ఈ పత్రిక అందలేదు.
నెలాఖరు కూడా వచ్చింది. పుస్తకం కోసం
ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాము. మాకింకా పత్రిక
అందలేదని నా భర్త రామనాధన్ గారికి ఉత్తరం రాద్దామనుకున్నారు.
మరుసటి
రోజే మాకు రామనాధన్ గారి నుంచి ఉత్తరం వచ్చింది.
ఆ ఉత్తరంలో మాకు మరొక పత్రిక అదనంగా పంపుతున్నట్లుగా రాసారు. ఉమా మహేశ్వరరావు గారికి పత్రిక అందలేదుట. వారికి వెంటనే పంపించు అని బాబా ఆజ్ఞాపించారని కూడా
ఆ ఉత్తరంలో వ్రాసారు. ఆ ఉత్తరం చదవగానే మా ఆనందానికి అంతులేదు. సాయిబాబాకి కోటికోటి ప్రణామాలు అర్పించుకున్నాము. మరునాడే మాకు పోస్టులో పత్రిక వచ్చింది.
బాబా
మనలని ప్రతివిషయంలోను అది స్వల్పమైన విషయాలయినా సరే అనుక్షణం కనిపెట్టుకుని ఉంటారని చెప్పడానికి
ఇది కూడా ఒక ఉదాహరణ.
బాబా
తన భక్తులఎడల అనంతమయిన ప్రేమను కనబరుస్తూ ఉంటారు.
(రేపటి సంచికలో 'సాయిప్రభ' మాస పత్రిక)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment