26.03.2017
ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
లీలా తరంగిణి 4 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల
రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనుబదింపబడినది)
(మరల
తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి
నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్
ఖైల్ గేట్, దుబాయి
శ్రీ
సాయి లీలా తరంగిణిలో ఈ రోజు మరొక అత్యద్భుతమైన సాయి లీల తెలుసుకుందాము.
నామ
సంకీర్తన – దక్షిణ
1984
వ.సంవత్సరం జూలై 21వ.తారీకున హైద్రాబాద్ శ్రీరామనగర్ లోని మాయింటిలో మూడు గంటలపాటు
సాయి నామ సంకీర్తన జరిపించాము. మేమంతా భక్తిశ్రధ్ధలతో
నామసంకీర్తనలో మైమరచి పోయాము.
మా ఇంటినిర్మాణంలో
ఉపయీగింపబడ్డ ప్రతి ఇటుక, అణువణువు పవిత్రత పొందినంతగా నామసంకీర్తన జరిగింది. నామ సంకీర్తనలో పాల్గొనడానికి ఎంతో దూరంనుండి కూడా
భక్తులు వచ్చారు.
(సాయిరాం సాయిశ్యామ్ సాయి భగవాన్... ఈ పాట వినండి)
క్రింద లింక్ ఇచ్చాను.
https://www.youtube.com/watch?v=AO5TmV5pxsA
మా
కుటుంబ స్నేహితులయిన శ్రీ డి.శంకరయ్యగారు మాకు భజన బృందాన్ని పరిచయం చేశారు. భజన కార్యక్రమం పూర్తయిన తరువాత, భజన కార్యక్రమం
నిర్వహించిన భజన బృందానికి ఎంత ఇవ్వాలో నాభర్తకు తెలీలేదు. ఆయన శంకరయ్యగారిని సంప్రదించి వంద రూపాయలు ఇస్తే
సరిపోతుందా అని అడిగారు. “భజన బృందంవారు కార్యక్రమాన్ని
డబ్బు కోసం (వ్యాపార దృష్టితో) నిర్వహించరు.
వారు ఎక్కడ ఏకార్యక్రమం నిర్వహించినా భక్తితో మాత్రమే చేస్తారు. అందుచేత వారికి ఆటో చార్జీలు పాతిక రూపాయలు ఇస్తే
సరిపోతుంది” అన్నారు శంకరయ్యగారు. మరీ పాతిక
రూపాయలు ఇస్తే బాగుండదు, కనీసం యాభై రూపాయలయినా ఇస్తె బాగుంటుందని భావించారు నాభర్త. ఆవిషయమే శంకరయ్యగారితో చెప్పారు. ఆఖరికి శంకరయ్యగారు దానికి ఒప్పుకుని నిర్ణయం మాత్రం
నాభర్త ఇష్టానికే వదిలేశారు. నాభర్త వద్ద యాభైరూపాయలకి
చిల్లర లేకపోవడం వల్ల మా కోడలి వద్దనుంచి యాభై రూపాయలు తీసుకుని భజన బృందంవారికి తాంబూలంలో
పెట్టి సమర్పించారు. మేము తాంబూలం ఇస్తున్నపుడు
అక్కడ ఉన్న భక్తులందరూ గమనిస్తూనే ఉన్నారు.
నామ జప కార్యక్రమానికి తమిళనాడు హోసూరు నుంచి సాయి అంకిత భక్తుడయిన డా.జి.ఆర్.విజయకుమార్
గారు కూడా వచ్చారు. ఆయన కూడా దీనికంతా ప్రత్యక్ష
సాక్షి.
మరుసటిరోజు
రాత్రే శ్రీసాయిబాబా నా భర్తకు స్వప్నంలో దర్శనమిచ్చి నవ్వుతూ
“నువ్వు భజన బృందానికి
వందరూపాయలు ఇద్దామనుకున్నావు. కాని యాభై రూపాయలు
మాత్రమే ఇచ్చావు. కాని నువ్విచ్చినది వందరూపాయల
నోటు”
అని చెప్పి వందరూపాయల నోటును చూపించి వేళాకోళంగా నాభర్తవైపు చూసి నవ్వారు. వెంటనే నాభర్తకు మెలకువ వచ్చి, మంచంమీదనుండి లేచారు.
లేచిన వెంటనే తన జేబులో వందరూపాయల నోటు ఉందా లేదా అని చూశారు. ఆతరువాత మాకోడలిని “నువ్వు యాభై రూపాయల నోటు ఒక్కటే
ఇచ్చావా లేక పొరబాటున రెండు యాభై రూపాయల నోట్లు ఇచ్చావా” అని అడిగారు. తను యాభై రూపాయలనోటు ఒక్కటె ఇచ్చానని చెప్పింది. ఇది వినగానే మేమంతా పెద్ద సందిగ్ధంలో పడ్డాము. మేము యాభై రూపాయలు మాత్రమే ఇస్తే బాబా నవ్వుతూ వందరూపాయలు
నోటు ఇచ్చారని అంటారెందుకు? ఇందులో బాబా ఉద్దేశ్యం
ఏమయి ఉటుంది? సరే ఈవిషయం గురించి శంకరయ్యగారినే అడుగుదామనుకున్నాము. కాని మాకు ఆయనతో పరిచయం మూడునెలల క్రితం మాత్రమే
కలిగింది. ఈ విషయం గురించి ఆయనని అడిగితే ఏమనుకూటారోనని
నాభర్త సందేహించారు. మేము యాభై రూపాయలే ఇచ్చామా
లేక వందరూపాయలు ఇచ్చామా అని అడగటమంటే అది చాలా సున్నితమైన విషయం. పైగా మొహమాటంగాను ఉంటుంది. కాని మొహమాట పడుతూనే నాభర్త మరుసటి రోజు ఉదయాన్నే
శంకరయ్యగారింటికి వెళ్లారు. మాటల సందర్భంలో
ఈ ప్రస్తావన తెచ్చి అడగచ్చనుకున్నారు. నాభర్త
శంకరయ్యగారి ఇంటిలోకి వెళ్ళగానే “యాభై రూపాయలు ఇవ్వకుండా వంద రూపాయలు ఇచ్చారేమిటీ”
అని ప్రశ్నించారు శంకరయ్యగారు. ఈవిషయం మీకెవరు
చెప్పారు అని అడిగారు నాభర్త. మీఇంటినుంచి
వచ్చిన తరువాత భజన బృందంవాళ్ళే చెప్పారన్నారు శంకరయ్యగారు. అప్పుడు నాభర్త తనకు బాబా కలలో కనిపించడం, బాబా వందరూపాయలనోటు చూపించడం అంతా వివరంగా చెప్పారు.
వెంటనే
శంకరయ్యగారు భజనబృందం వారినుంచి పూర్తిగా వివరాలు తెలుసుకుందామని మారేడ్ పల్లికి వెళ్ళారు. వారికి ఈ విషయమంతా చెప్పి బాబావారిచ్చిన వందరూపాయలనోటును
భద్రంగా పూజా స్థలంలో పెట్టుకోమని చెప్పారు.
కాని వారు అప్పటికే ఆ వందరూపాయల నోటుతో రెండు ఎల్.పి. రికార్డులు భక్తిపాటలు కొనేశారు.
బాబా
మాకొక గుణపాఠం చెప్పారని భావించాము.
(రేపటి
సంచికలో మారు రూపంలో నామ సప్తాహానికి వచ్చిన బాబా)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment