25.03.2017
శనివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
లీలా తరంగిణి –3 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల
రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనుబదింపబడినది)
(మరల
తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి
నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్
ఖైల్ గేట్, దుబాయి
నాప్రార్ధనకు
తక్షణమే స్పందించిన సాయిబాబా
ఒకరోజు
రాత్రి సాయిబాబా నాభర్త కలలో కనపడి బైబిల్ లోని 23వ.అధ్యాయం చదవమని చెప్పారు. ఆ అధ్యాయం చదివిన తరువాత బైబిల్ మరియు గీత రెండూ ఒకటేనని, ఈరెండూ కూడా ఒకే అర్ధాన్ని కలిగి ఉన్నాయని అర్ధమయింది.
ఏగురువయినా దత్తాత్రేయులవారి అవతారమే. ఆయనకు ఎన్ని నామాలున్నా భగవంతుడనేవాడు ఒక్కడె. అదే విధంగా ఎన్ని మతాలున్నా గాని, మానవులంతా ఒకటే.
శ్రీసాయిబాబా
నా భర్తకు గుండెజబ్బు నయం చేసిన కొన్ని రోజులకి నాకొక కల వచ్చింది.
“ఆ
కలలో నలుగురు వ్యక్తులు నా భర్తను తమ చేతులమీద మోసుకుంటూ వచ్చి, ఆయన చనిపోయారని చెప్పారు. నేను నివ్వెరపోతూ, ఆయనని మంచం మీద పడుకోబెట్టండని
మంచం చూపించాను. వారు నా భర్తను మంచంమీద పడుకోబెట్టి
వెళ్ళిపోయారు. అసలు ఇదంతా ఎప్పుడు, ఎక్కడ,
ఎలా జరిగిందన్న విషయం ఆవ్యక్తులని అడగలేకపోయాను.
నాభర్త చనిపోయారని చెప్పిన మాటకి నాకు
నోటంబట మాటకూడా రాలేదు. నేను నాభర్త ప్రక్కనే
మంచంమీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాను. కొంతసేపటి
తరువాత నాభర్త శరీరంలో కాస్త కదలిక కనిపించింది.
అది నా భ్రమేమో అనుకున్నాను. బాగా పరిశీలనగా
చూశాను. ఆయనలో కొంచెం కదలిక కనిపించింది. నా మనసులో ఎన్నో ప్రశ్నలు కలిగాయి. ఆయనను తీసుకుని వచ్చిన వ్యక్తులు నాభర్త చనిపోయారని
పొరబాటు పడ్డారా? ఆయన తెలివితప్పి పడిపోయి
ఉంటారు. అంత మాత్రానికే నాభర్త చనిపోయారని అంత మూర్ఖంగా ఎలా భావించారు? నేను కూడా వాళ్ళు చెప్పిన విషయాన్ని అంత గుడ్డిగా
ఎలా నమ్మేశాను?
వెంటనే
ఆయనని ఆస్పత్రికి తీసుకుళ్ళి వైద్యం చేయించాలనే ఆత్రుతలో ఉన్నాను. కొద్ది నిమిషాల తరువాత నాడి కొట్టుకోవడం గమనించాను. ఆతరువాత నాభర్త తలచుట్టూ అర్ధచంద్రాకారంలో ఛాతీ
వరకు ఉన్నజీసస్ క్రైస్ట్ బొమ్మ కనిపించింది.
భగవంతుని దయవల్లనే నాభర్త బ్రతికారని అర్ధమయింది
నాకు. సర్వశక్తిమంతుడయిన భగవంతుడు ప్రతిచోట
నిండి ఉన్నాడని అర్ధం చేసుకున్నాను. ఆయన సర్వవ్యాపి.
“
ఆరోజునుండి నేను నాపూజా మందిరంలో జీసస్ క్రైస్ట్
ఫొటో కూడా ఉంచి ప్రార్ధించసాగాను.
సాయి
సర్వశక్తిమంతుడని, సర్వవ్యాపకుడని తెలియచెప్పడానికి మరొక సంఘటన కూడా వివరిస్తాను. సాయి స్వప్నంలో దర్శనమిచ్చి రాబోయే ఆపదలను తెలియచేసి
హెచ్చరిస్తూ ఉంటారు. 1984 వ.సంవత్సరరం నవంబరు,
28వ.తారీకున సాయి నా భర్తకు కలలో కనిపించారు.
ఆకలలో సాయి నా భర్తతో ఈవిధంగా చెప్పారు.
“రేపు నీ ప్రాణానికి ప్రమాదం. నేను
నీతోనే ఉంటాను. ఏమీ భయపడకు.”
మేము
హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో మాయింటిలో ఉన్నాము.
నేను కంగారు పడుతూ నా అక్కచెల్లెళ్ళకు ఫోన్ చేసాను. వాళ్ళప్పుడు హైదరాబాదులోనే ఉన్నారు. వెంటనే మాయింటికి వచ్చి రాత్రికి ఉండిపొమ్మని నాకు
ధైర్యంగా ఉంటుందని చెప్పాను.
నాభర్త
మరునాడు ప్రొద్దున్న ఆరోగ్యంగానే ఉన్నారు. ఒక గంటసేపు ధ్యానంలో ఉన్నారు. ప్రతిరోజు
ఆయన 2 లేక 3 గంటలపాటు ధ్యానం చేసుకుంటూ ఉంటారు.
నేను ఇంక ఇంటిపనులు అవీ చూసుకోవాలి కాబట్టి పూజ గదిలోనుంచి బయటకు వచ్చేశాను. కొంతసేపు గడిచింది. ఇంతలో నామనవరాలు చి.సుధ ఏడుస్తూ నాభర్త తెలివితప్పి
పడిపోయారని చెప్పింది. నేను వెంటనే పూజాగదిలోకి
పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అక్కడ నాభర్త సాయిపాదాల
వద్ద నేలమీద అచేతనంగా. తెలివితప్పి పడిపోయి
ఉన్నారు. తిరిగి లేచే సూచనలు ఏమీ కనపడలేదు
నాకు. వెంటనే మావారికి ఎప్పుడూ వైద్యం చేసే
డాక్టర్ కి ఫోన్ చేసాను. ఆయన వచ్చి పరీక్షించారు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, వెంటనే ఆస్పత్రికి
తీసుకువెళ్ళమని చెప్పారు.
నాభర్త
ధ్యానంలో ఉన్న సమయంలో పంచెకట్టులోనే ఉన్నారు.
ఆయన మెడలో ఉన్న రుద్రాక్షమాల, ఒక శిల్పం మెడలో వేసిన రుద్రాక్షమాలగా కనబడుతోంది. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. నాడి కూడా కొట్టుకోవడంలేదు. శ్వాస కూడా ఆడటంలేదు. చాలా బాధాకరమయిన విషయం ఏమిటంటె నాభర్త మరణించారు. అది నిశ్చయంగా తెలుస్తూనే ఉంది.
బాబా
అంతకుముందే కలలో కన్పించి మరీ చెప్పారు. “నేను నీతోనే ఉంటాను” అని. మరి ఇదెలా జరిగింది? బహుశ బాబా వేరే భక్తుల సమస్యలు తీర్చడంలో నిండా
మునిగి నాభర్త విషయం మర్చిపోయారేమో అని అనిపించింది నాకు. నాకు తెలియకుండానే అసంకల్పితంగా “బాబా – బాబా” అని
అరిచాను. ఆవిధంగా అయిదుసార్లు బాబా బాబా అని
అరవగానే నాభర్త కరెంటు షాక్ కొట్టినట్లుగా ఒక దీర్ఘమయిన శ్వాస తీసుకున్నారు. మరణించిన నాభర్తని ఏవిధంగా బ్రతికించారో ప్రత్యక్షంగా
చూశాను.
నాభర్త
15 సంవత్సరాలపాటు గుండె సమస్యతో బాధపడ్డ తరువాత సాయిబాబా ఆయన గుండెజబ్బుని నివారణకావించారు. 15 సంవత్సరాల క్రితం వరకు నాభర్త గుండెజబ్బుతో చాలా
బాధపడ్డారు. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకునివెళ్ళాల్సిన
పరిస్థితులు ఎదురయ్యేవి. విపరీతమయిన గుండె
నొప్పితో బాధపడే సమయంలో ఒక్కోసారి డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండేవారు కాదు. ఆయన బాధతో గిలగిలలాడుతూ మెలికలు తిరిగిపోతూ ఉంటే
చూడలేకపోయేదాన్ని. అదృష్టవశాత్తు మానాన్నగారు
డాక్టర్. నాచిన్నతనంలో నేను, మానాన్నగారు రోగులకి
ఇంజక్షన్ చేయడం గమనిస్తూ ఉండేదానిని. దానివల్ల
నాకు కాస్త ప్రధమ చికిత్స గురించి అవగాహన కలిగింది. నాభర్తకు మందులు ఇవ్వడం, నాడి పరీక్షించడం, ఇంజక్షన్
చేయడం ఇవన్నీ నేర్చుకున్నాను. నేను ఆయనకు ప్రధమ చికిత్స చేసినప్పుడల్లా కాస్త ఉపశమనం కలుగుతూ ఉండేది. గుండెపోటు వచ్చినపుడు
మనిషి స్పృహతప్పి పడిపోవడం, జీవంలేకుండా ఉండటం ఈ రెండిటికి వ్యత్యాసం ఏవిధంగా ఉంటుందన్న
విషయం నాకు బాగా తెలుసు. ఆయన పరిస్థితి చాలా
ప్రమాదకరంగా ఉందని నాకర్ధమయింది. ఆరోజున నాభర్త
తెలివితప్పి పడిపోయినపుడు బాబా ప్రాణదానం చేసి పునర్జన్మను ప్రసాదించారు. కలలో బాబా కనిపించి నేను నీప్రక్కనే ఉంటానని అభయమిచ్చిన
మాట నిజమయింది.
ఆతరువాత
ఆయనని హైదరాబా లక్ డీకాపూల్ లో ఉన్న ‘క్యూర్ వెల్’ ఆస్పత్రిలో చేర్పించాము. వెంటనే డాక్టర్స్ చాలా పరీక్షలు చేశారు. సక్షన్ యాపరేటస్ తో గొంతులోని ఫ్లమ్ ని తీసేశారు. 5% గ్లూకోజ్ ఇంట్రావీనస్ డ్రిప్ ఇచ్చారు. రక్తపరీక్షకి రక్తం తీసారు. రిపోర్టులన్నీ వెంటనే వచ్చాయి. బ్లడ్ సుగర్ 150 ఎమ్ ల్ ఉండాల్సింది 50 ఎమ్ ల్ మాత్రమే
ఉంది. మీరు చాలా అదృష్టవంతులు. వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చారు. కాస్త ఆలశ్యమయితే చనిపోయేవారని చెప్పారు డాక్టర్స్. శ్రీసాయిబాబా దయవల్లనే ఆయన ఆప్రమాదంనించి తప్పించుకున్నారనే
నిజాన్ని దాచిపెట్టాము. ఆవిషయం డాక్టర్స్ కి
చెప్పలేదు. నాభర్తకు చక్కెరవ్యాధి లేదు. కాఫీలో పంచదార వేసుకుని ప్రతిరోజు ఎన్నో కప్పులు
తాగుతూ ఉంటారు. అన్ని రకాల స్వీట్లు, ఇష్టం వచ్చినట్లు
తింటూ ఉంటారు.
అటువంటిది ఇదెలా జరిగిందో మాకెవ్వరికీ
అర్ధం కాలేదు. గ్రహస్థితి బాగుండని దశలో మానవుడు
కష్టాలెనుదుర్కోక తప్పదు. ఎవరికయితే శ్రీసాయిబాబావారి
దివ్యానుగ్రహం ఉంటుందొ వారికి ఎటువంటి కష్టాలనయినా ఎదుర్కొనే ధైర్యం కలుగుతుంది.
(రేపటి
సంచికలో బాబా చూపించిన అధ్బుత లీల
నామ
సంకీర్తన – దక్షిణ)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment